Mar 12, 2026 12:08 IST
హైదరాబాద్: మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు అంతిమయాత్ర
Mar 12, 2026 12:08 IST
లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రసంగం
నిన్న అవిశ్వాసం వీగడంతో లోక్‌సభకు స్పీకర్ ఓం బిర్లా
భారత ప్రజల ప్రతిబింబం పార్లమెంట్: ఓం బిర్లా
సభా నియమాలకు కట్టుబడే అందరికీ అవకాశాలు: ఓం బిర్లా
నిబంధనల ప్రకారమే సభ నడిపిస్తున్నాం: స్పీకర్ ఓం బిర్లా
ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నామనేది అవాస్తవం: ఓం బిర్లా
విపక్షాలు మాట్లాడితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది: ఓం బిర్లా
మార్చి 12, 2026 12:01 IST
రాజ్యసభ: ఫరూక్ అబ్దుల్లా భద్రతపై ఖర్గే ప్రస్తావన
కశ్మీర్ ప్రజలకు రక్షణ లేకుండా పోయింది: ఖర్గే
మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం
మార్చి 12, 2026 12:01 IST
రాజ్యసభలో విపక్షాల నినాదాలు
మార్చి 12, 2026 12:00 IST
పార్లమెంట్ వెలుపల విపక్షాల ఆందోళన
మార్చి 12, 2026 11:59 IST
టెల్ అవీవ్ ఎయిర్‌పోర్టులో గందరగోళం
ఎయిర్ టికెట్ల కోసం ప్రయాణికుల ఘర్షణ
ఇజ్రాయెల్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు
మార్చి 12, 2026 11:20 IST
ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2026లో పాల్గొనం: ఇరాన్
మా ఆటగాళ్లపై అమెరికా దాడి చేసే అవకాశం ఉంది: ఇరాన్
గడిచిన తొమ్మిది నెలల్లోనే రెండోసారి మాపై యుద్దం చేస్తోంది: ఇరాన్
మార్చి 12, 2026 11:10 IST
రంగారెడ్డి: కొత్తూరు మున్సిపాలిటీ పెద్ద షాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
బైకును అతివేగంగా ఎదురుగా వచ్చి ఢీకొన్న లారీ
ఇంటర్ పరీక్షకు వెళ్తూ ఇద్దరు విద్యార్థుల మృతి
మృతులు కొత్తూరుకి చెందిన సూరజ్, బిక్కి గా గుర్తింపు
మార్చి 12, 2026 11:08 IST
ఇరాన్ యుద్ధంపై మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం
తప్పుడు ప్రచారం చేసేవారిపై నిఘా పెట్టండి: ప్రధాని మోదీ
విపక్షాల సోషల్ మీడియా ప్రచారాన్ని తిప్పికొట్టండి: మోదీ
యుద్ధం యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేస్తోంది: ప్రధాని
ముందస్తు ఏర్పాట్లు బలంగా చేశాం: ప్రధాని మోదీ
అనేక దేశాల కంటే భారత్ మెరుగ్గా ఉంది: ప్రధాని మోదీ
మార్చి 12, 2026 11:07 IST
విజయవాడ: కిడ్నాప్ కేసులో పిన్నెల్లి అనుచరుడు వీరభద్రరావు అరెస్టు
2023లో హైకోర్టు లాయర్‌ను నిర్బంధించి హింసించిన పిన్నెల్లి అనుచరులు
గతంలో పిన్నెల్లి అనుచరులకు డీఎస్‌పీ పల్లంరాజు, ఎస్ఐ రబ్బానీ సహకారం
సస్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ పల్లంరాజు, ఎస్ఐ రబ్బానీ అరెస్టుకు రంగం సిద్ధం
దొంగ కేసు పెట్టి ఆస్తులు రాయించుకున్నట్లు బాధితుడు ఫిర్యాదు
మార్చి 12, 2026 11:06 IST
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్కో ఆల్‌టైమ్ రికార్డ్
6,101 మెగావాట్లతో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి
రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తిపై మంత్రి గొట్టిపాటి హర్షం
మార్చి 12, 2026 11:05 IST
అభివృద్ధి విషయంలో కలెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలి: చంద్రబాబు
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై కలెక్టర్లు దృష్టి పెట్టాలి
పరిశ్రమలు రాని జిల్లాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి
వనరులను సరైన రీతిలో ఉపయోగించుకోవాలి
మార్చి 12, 2026 11:04 IST
ఏబీఎన్‌తో తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తెలంగాణపై పడింది: వినోద్
యుద్ధం వల్ల తెలంగాణలో గ్యాస్‌పై ప్రభావం చూపింది: వినోద్
గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులతో సంప్రదిస్తున్నాం: వినోద్
యుద్ధం కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం: వినోద్
ట్రంప్ ఆధిపత్య ఆలోచనల వల్లే ఇబ్బందులు: వినోద్
మార్చి 12, 2026 10:54 IST
మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు
మార్చి 12, 2026 10:53 IST
కాకినాడ: శంఖవరం, ప్రత్తిపాడు మండలాల పరిధిలో పులి సంచారం
శంఖవరం, ప్రత్తిపాడు, దారపల్లి, తాడ్వాయి పరిసరాల్లో పులి కదలికలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల హెచ్చరికలు
మార్చి 12, 2026 10:52 IST
రాజమండ్రి కల్తీ పాల ఘటనలో 13కి చేరిన మృతులు
మార్చి 12, 2026 10:49 IST
భారత్-ఇరాన్ విదేశాంగ మంత్రుల భేటీలో కీలక నిర్ణయం
మార్చి 12, 2026 10:48 IST
తిరుపతి: చంద్రగిరి మండలంలో ఏనుగుల గుంపు సంచారం
చంద్రగిరి మండలం ఎల్లంపల్లిలో గజరాజుల బీభత్సం
వరి, మామిడి తోటలను ధ్వంసం చేసిన ఏనుగులు
మార్చి 12, 2026 10:37 IST
భారీ నష్టాల్లో దేశీయ సూచీలు
ప్రస్తుతం సెన్సెక్స్ 750 పాయింట్ల నష్టంతో ఉంది
నిఫ్టీ 256 పాయింట్ల నష్టంతో ఉంది
డాలర్‌తో రూపాయి మారకం విలువ 92.35గా ఉంది
మార్చి 12, 2026 10:36 IST
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్
సూపర్ సిక్స్, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య..
వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చ
శాంతిభద్రతలపై ఎస్పీలతో సమీక్షించనున్న సీఎం చంద్రబాబు
మార్చి 12, 2026 10:28 IST
తగ్గిన బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,220
నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.1090 మేర తగ్గుదల
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,700 దగ్గర ఉంది
నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.1000 మేర తగ్గుదల
హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 2.9 లక్షలకు దిగి వచ్చింది
మార్చి 12, 2026 09:37 IST
ఒమన్ సలాలా పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి
ఇరాన్ దాడిలో ఒమన్ ఆయిల్ ట్యాంక్‌లు దగ్ధం
కొన్ని డ్రోన్లను కూల్చివేసిన ఒమన్ రక్షణ సంస్థ
మార్చి 12, 2026 09:27 IST
నిజామాబాద్: ఇందల్వాయి కాంగ్రెస్ మాజీ ఎంపీపీ గోపి హత్య
గోపిపై కత్తితో దాడిచేసి హత్య చేసిన మేనల్లుడు సతీష్
పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు సతీష్
మార్చి 12, 2026 09:26 IST
ఇజ్రాయెల్‌పై ఇరాన్ భీకర దాడులు
లెబనాన్ నుంచి హెజ్బొల్లా రాకెట్ దాడులు
టెల్ అవీవ్‌పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ దాడి
మిస్సైల్స్‌ను అడ్డుకున్న ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ
దక్షిణ ఇజ్రాయెల్‌లోనూ అలర్ట్
మార్చి 12, 2026 08:18 IST
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక ప్రకటన
యుద్ధానికి ముగింపు పలకాలంటే మా షరతులు అంగీకరించాల్సిందే
భవిష్యత్‌లోనూ మా దేశంపై ఎవరూ దాడులు చేయకూడదు
మా న్యాయపరమైన హక్కులను ప్రపంచం గుర్తించాలి
మార్చి 12, 2026 08:17 IST
పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత
తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా
మూతపడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు
గృహ వినియోగదారులు ఆందోళన చెందొద్దు: కేంద్రం
మార్చి 12, 2026 08:17 IST
ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ల బీభత్సం
సరికొత్త వ్యూహాలతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
మిలిటరీ బేస్‌లు, పోలీస్ స్టేషన్‌లు లక్ష్యంగా దాడులు
మార్చి 12, 2026 08:17 IST
ఇరాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్, US దాడులు
మార్చి 12, 2026 08:16 IST
అంతర్జాతీయ ఇంధన సంస్థ(IEA) కీలక నిర్ణయం
మార్కెట్లపై ఇంధన ఒత్తిడి తగ్గింపు దిశగా చర్యలు
అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల..
చమురు విడుదల చేస్తున్నట్లు IEA ప్రకటన
మార్చి 12, 2026 08:16 IST
హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం కావూరి సాంబశివరావు అంత్యక్రియలు
మహాప్రస్థానంలో కావూరి సాంబశివరావు అంత్యక్రియలు
ఉదయం 10.30 గంటలకు కావూరికి నివాళులర్పించనున్న కేటీఆర్
మార్చి 12, 2026 08:15 IST
నేడు లోక్‌సభకు స్పీకర్ ఓం బిర్లా
మార్చి 12, 2026 08:15 IST
హైదరాబాద్: నేడు హైటెక్ సిటీలో సీఎం రేవంత్ పర్యటన
నెట్‌ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
మధ్యాహ్నం విద్యుత్ శాఖపై సమీక్షించనున్న సీఎం రేవంత్
మార్చి 12, 2026 07:30 IST
నేడు బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,320
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,710
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,63,470
22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,49,860
హైదరాబాద్‌లో కిలో వెండి ధర దాదాపు రూ.3 లక్షలుగా ఉంది
మార్చి 12, 2026 07:28 IST
అమరావతి: నేడు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్
సూపర్ సిక్స్, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య..
వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చ
శాంతిభద్రతలపై ఎస్పీలతో సమీక్షించనున్న సీఎం చంద్రబాబు

మార్చి 12, 2026 07:24 IST
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టు విచారణ