సెక్షన్ 301,US టారిఫ్‌లు అంటే ఏమిటి: భారత్, చైనాలే టార్గెట్‌గా ట్రంప్ కొత్త వ్యూహం.. తెరపైకి సెక్షన్ ‘301’ అస్త్రం.. సుప్రీం కోర్టు కూడా ఆపలేదు! – డోనాల్డ్ ట్రంప్ పరిపాలన సెక్షన్ 301 భారతదేశం మరియు చైనాలను లక్ష్యంగా చేసుకుని అన్యాయమైన పద్ధతులపై తాజా వాణిజ్య పరిశోధనను ప్రారంభించింది


US ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974 : యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడేం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏ దేశంపై ఎప్పుడు ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నారో తెలియట్లేదు. అప్పటికప్పుడు బాగానే కనిపించినా.. మరుక్షణమే అదే దేశంపై చర్యలు తీసుకున్న ఘటనలు కూడా చూశాం. ఇందులో భాగంగానే తాను జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు దేశాలపై భారీగా దిగుమతి సుంకాల్ని విధిస్తున్నారు. మెక్సికో, కెనడా, చైనా, భారత్ వంటి దేశాలపై రికార్డు స్థాయిలోనూ పెంచారు. ఈ ఉంది ట్రంప్ ఎడాపెడా విధించిన భారీ సుంకాల్ని చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పు కూడా వెలువరించింది. అయినా తగ్గని ట్రంప్.. తమ ప్రధాన వాణిజ్య సంస్థలపై ఎలాగైనా టారిఫ్ వసూలు చేయాలని చూస్తున్నారు. దీని కోసం కొత్త దారులు వెతకుతున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు సెక్షన్- 301 అనే ఆయుధాన్ని బయటకు తీశారు.

>> ఈ సెక్షన్ 301 .. భారత్, చైనా సహా 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దర్యాప్తు ప్రారంభించేందుకు వీలు కల్పిస్తుంది. దీనికి సంబంధించి యూఎస్ వాణిజ్య శాఖ ప్రతినిధి జెమిసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు. 1974 యూఎస్ ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 కింద.. యూరోపియన్ యూనియన్, సింగపూర్, స్విట్జర్లాండ్, భారత్, చైనా, నార్వే, మలేసియా, ఇండోనేసియా, కాంబోడియా, వియత్నాం, సౌత్ కొరియా, బంగ్లాదేశ్, తైవాన్, థాయ్‌లాండ్, జపాన్, మెక్సికో దేశాలపై దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ లిస్టులో కెనడా మాత్రం లేదు.

అసలేంటీ సెక్షన్ 301..

ఇతర దేశాలు అనుసరిస్తున్నటువంటి అన్యాయ వాణిజ్య విధానాలను సవాల్ కోసం అమెరికాకు ఉన్న శక్తిమంతమైన ఆయుధం సెక్షన్ 301. ఆయాాలు పాటిస్తున్న ట్రేడ్ పాలసీలు.. అమెరికా ప్రయోజనాలు, వ్యాపారాలకు నష్టం కలిగిస్తున్నాయా.. లాభం చేకూరుస్తున్నాయా అంటే ఈ చట్టం కింద అమెరికా దర్యాప్తు చేయడానికి వీలు కల్పిస్తుంది. దర్యాప్తులో భాగంగా సాక్ష్యాలు సేకరిస్తుంది.
ఇక్కడ ఏదైనా దేశం అమెరికాకు నష్టం కలిగించేలా ట్రేడ్ పాలసీని పాటిస్తున్నట్లు తేలితే.. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనుమతి లేకుండానే ఆ దేశంపై చర్యలు తీసుకునే అధికారం అమెరికాకు ఉంటుంది. ఆ దేశాలపై అప్పుడు చట్టబద్ధంగానే భారీగా సుంకాలు విధించడం ఇతర ప్రతీకార చర్యలు చేపట్టేందుకు అమెరికాకు అధికారం లభిస్తుంది.

అమెరికాకు చైనా ప్రత్యర్థిగా ఉంది సరే.. మరి భారత్ వంటి మిత్ర దేశంపైనా అమెరికా ఇలా సెక్షన్ 301 కింద దర్యాప్తు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. భారత్.. అమెరికా ఉత్పత్తులపై విపరీతంగా సుంకాలు విధిస్తుందని.. అన్యాయ సాంకేతికతను అవలంబిస్తుందని ట్రంప్ ఎప్పటినుంచో ఆరోపిస్తూ భారత్‌పై ఒక దశలో దిగుమతి సుంకాల్ని 25 పెంచారు. తర్వాత రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నందున ప్రతీకార పేరుతో మరో 25 శాతం.. 50 శాతం చేర్చారు. ఎ తర్వాత రెండు దేశాల మధ్య చర్చలతో ప్రతీకార సుంకాల్ని తొలగించి.. దిగుమతి సుంకాల్ని మొత్తంగా 18 శాతం చేర్చింది.. ఈ సమయంలో.. ఇప్పుడు ట్రంప్ ఈ సెక్షన్‌ను తెరపైకి తీసుకొచ్చి మరో చర్చకు తెరతీశారు.

పూర్ణచందర్ తూనం

రచయిత గురించిపూర్ణచందర్ తూనంపూర్ణచందర్ తూనం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన బిజినెస్‌ రంగానికి సంబంధించిన తాజా వార్తలతోపాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ న్యూస్, బంగారం వెండి ధరలపై తాజా అప్‌డేట్లు అందజేస్తున్నాయి. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తోపాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ఈటీవీ భారత్ సంస్థలో బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్ న్యూస్ రాశారు. పూర్ణచందర్ ఈనాడు జర్నలిజం స్కూల్‌లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. పూర్ణచందర్ 2025 ఏప్రిల్‌లో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఏబీసీడీ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి



Source link

Spread the love