
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో 2,500 కిలోల కల్తీ పెరుగును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాలలో కాస్టిక్ సోడా వినియోగించి పెరుగు తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. అంబర్‌పేట పోలీసులు, ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. పెరుగు శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు. (తెలంగాణ వార్తలు)