ఇంధన భద్రత పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మోదీ


ABN
ప్రచురణ తేదీ – మార్చి 12, 2026 | 09:58 PM

భారతదేశ ఇంధన భద్రతా పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని, దీనిని చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గురవారనాడిక్కడ జరిగిన ఎన్ఎక్స్‌టీ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ప్రస్తావించారు.

ఇంధన భద్రత పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మోదీ

ప్రధాని మోదీ

ఇటీవల: భారతదేశ ఇంధన భద్రతా పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని, దీనికి చేయాల్సినదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (నరేంద్ర మోదీ) అన్నారు. గురవారన్నాడిక్కడ జరిగిన ఎన్ఎక్స్‌టీ సదస్సు (NXT సమ్మిట్)లో ప్రధాని ప్రసంగించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంధన రంగంలో ఇండియా స్వయం సమృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. 2014కు ముందు వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లకు సంబంధించిన స్టోరేజీ కెపాసిటీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంది, ఇప్పుడు మనవద్ద తగినన్ని నిల్వలు ఉన్నాయని మోదీ అన్నారు.

మహాత్మాగాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం (దండి యాత్ర) 1930లో ఇదేరోజు ప్రారంభించారని, అది స్వాతంత్ర్య పోరాటంలో కీలకమైన మలుపు అని మోదీ గుర్తుచేశారు. ఇవాళ మనం కూడా ‘వికసిత్ భారత్’ కోసం సుదీర్ఘమైన, చారిత్రక ప్రయాణం సాగిస్తున్నామని అన్నారు. వికసిత్ భారత్ కల సాకారానికి ఇలాంటి కీలక సదస్సుల్లో జరిగే చర్చలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. కాగా, మూడురోజుల పాటు జరిగే గ్లోబల్ లీడర్‌షిప్ ఫోరం ఎన్ఎక్స్‌టీ సమ్మిట్-2026ను ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి..

భారత్‌లో ఇంధన కొరత లేదు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్

తప్పుడు విదేశాంగ విధానం వల్లే ఎల్పీజీ కొరత.. పార్లమెంటు ఆవరణలో రాహుల్ నిరసన

నవీకరించబడిన తేదీ – మార్చి 12, 2026 | 10:10 PM





Source link

Spread the love