12-03-2026 Telangana News Today Live Updates : అల్లు కుటుంబసభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: సీఎం రేవంత్‌రెడ్డి


LIVE FEED

10:24 PM, 12 Mar 2026 (IST)

అల్లు కుటుంబసభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: సీఎం రేవంత్‌రెడ్డి

  • అల్లు కుటుంబసభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: సీఎం రేవంత్‌రెడ్డి
  • భవిష్యత్‌లో అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
  • సినిమా ఎంత బాగా చేసినా.. ప్రదర్శించేందుకు థియేటర్లు లేకపోతే వృథా: సీఎం
  • డాల్బీ విజన్ థియేటర్లలో సినిమా చూస్తే ఆ ఆనందమే వేరు: సీఎం
  • నేను సూపర్‌స్టార్ కృష్ణ అభిమానిని: సీఎం రేవంత్‌రెడ్డి
  • హాలీవుడ్‌ను చూసి తెలుగు సినీ పరిశ్రమ స్ఫూర్తి పొందాలి: సీఎం
  • హాలీవుడ్‌ చిత్రాల వసూళ్లతో పోటీపడేలా తెలుగు సినిమా ఎదగాలి: సీఎం
  • సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా సహకరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
  • దేశం సాంకేతికంగా సినిమాలో అభివృద్ధి సాధిస్తోంది
  • నైపుణ్యంతో తీసినా ప్రదర్శనకు థియేటర్లు లేకుంటే సాంకేతికత నిరుపయోగం
  • డాల్బీ స్క్రీన్‌లో అందరితో కలిసి సినిమా చూస్తే ఆనందమే వేరు
  • చెన్నై నుంచి హైదరాబాద్‌కు సినీ పరిశ్రమ తరలిరావడానికి ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, రామానాయుడు కృషిచేశారు

10:24 PM, 12 Mar 2026 (IST)

తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలోని 25 మందికి అస్వస్థత

  • భద్రాద్రి: గండుగులపల్లిలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
  • తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలోని 25 మందికి అస్వస్థత
  • ఆహార కలుషితం కారణంగా అస్వస్థతకు గురైన 6, 8వ తరగతుల విద్యార్థులు
  • నిన్న రాత్రి చికెన్ తినడంతో ఫుడ్‌పాయిజన్ అయినట్లు సమాచారం

10:24 PM, 12 Mar 2026 (IST)

వేములవాడ ఆలయంలో 33 రోజుల హుండీ ఆదాయం రూ.2.16 కోట్లు

  • వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు
  • వేములవాడ ఆలయంలో 33 రోజుల హుండీ ఆదాయం రూ.2.16 కోట్లు
  • 161 గ్రాముల బంగారం,11 కిలోల వెండిని కానుకగా సమర్పించిన భక్తులు

8:51 PM, 12 Mar 2026 (IST)

హనుమకొండ: ఆటోలో పేలుడు పదార్థాలు తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

  • హనుమకొండ: ఆటోలో పేలుడు పదార్థాలు తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
  • భీమదేవరపల్లి మం. ముల్కనూరు వద్ద పేలుడు పదార్థాలు పట్టివేత
  • 8 పెట్టెల్లో జిలెటిన్ స్టిక్స్, 1,950 డిటోనేటర్లు, 10 వైర్ బండిళ్లు స్వాధీనం
  • ఐలయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు, పరారీలో మరో నిందితుడు

8:51 PM, 12 Mar 2026 (IST)

ఖైరతాబాద్ రవాణాశాఖకు ఫ్యాన్సీ నంబర్లతో భారీ ఆదాయం

  • ఖైరతాబాద్ రవాణాశాఖకు ఫ్యాన్సీ నంబర్లతో భారీ ఆదాయం
  • ఇవాళ ఒక్కరోజే ఖైరతాబాద్ రవాణాశాఖకు రూ.31.14 లక్షల ఆదాయం
  • అత్యధికంగా టీజీ09ఎల్‌0009 నంబర్‌కు రూ.10.50 లక్షల ఆదాయం

8:39 PM, 12 Mar 2026 (IST)

నల్గొండ జిల్లాలో పలు హోటళ్లలో 68 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్

  • నల్గొండ జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు
  • తనిఖీలు చేపట్టిన సివిల్‌ సప్లై, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు
  • భారీగా గృహ వినియోగ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తింపు
  • పలు హోటళ్లలో 68 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్ చేసిన అధికారులు

8:39 PM, 12 Mar 2026 (IST)

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చే ప్రక్రియ వేగవంతం

  • గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చే ప్రక్రియ వేగవంతం
  • తెలుగువారిని త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు: ఏపీ భవన్ అధికారులు
  • బహ్రెయిన్‌లో ఉన్నవారిని హైదరాబాద్‌ తరలించేందుకు ఏర్పాట్లు: అధికారులు
  • ప్రత్యేక విమానాలు నడిపేలా గల్ఫ్ ఎయిర్‌ సంస్థతో మాట్లాడుతున్నట్లు వెల్లడి
  • బహ్రెయిన్ నుంచి మరో 400 మంది రావాల్సి ఉందన్న అధికారులు
  • కేంద్రమంత్రి రామ్మోహన్‌ దృష్టికి తీసుకెళ్లామన్న ఏపీ భవన్ అధికారులు
  • విదేశాంగశాఖ, డీజీసీఏ, ఎంబసీ సాయం తీసుకుంటున్నట్లు వెల్లడి
  • బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్టు మూసివేత వల్ల సౌదీకి తరలిస్తున్నామని వెల్లడి
  • సౌదీలోని దమామ్‌ విమానాశ్రయం నుంచి తీసుకువచ్చేలా ఏర్పాట్లు
  • బహ్రెయిన్ నుంచి 3 రోజుల్లో 300 మందిని తీసుకొచ్చామన్న అధికారులు

8:01 PM, 12 Mar 2026 (IST)

కోకాపేటలో అల్లు సినిమాస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

  • కోకాపేటలో అల్లు సినిమాస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన అల్లు అర్జున్
  • అల్లు సినిమాస్‌లో అల్లు రామలింగయ్య విగ్రహానికి నివాళులు
  • నివాళులర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
  • కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు, నిర్మాతలు, నటీనటులు
  • 4 స్క్రీన్లతో అల్లు సినిమాస్‌ను నిర్మించిన అల్లు అరవింద్
  • ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ విజన్ టెక్నాలజీతో స్క్రీన్-1 నిర్మాణం

7:47 PM, 12 Mar 2026 (IST)

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో పీపీ మోడల్ అనివార్యం: భట్టి

  • 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో పీపీ మోడల్ అనివార్యం: భట్టి
  • లక్ష్య సాధనకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క
  • క్యూర్, ప్యూర్‌తో పాటు సమగ్రాభివృద్ధికి రేర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి: భట్టి విక్రమార్క
  • రేర్‌లో పెద్దఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేలా చూడాలి: భట్టి విక్రమార్క
  • ఎంఎస్ఎంఈలను పెద్దఎత్తున ప్రోత్సహించాలనేది ప్రభుత్వ ఆలోచన: భట్టి విక్రమార్క
  • 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో పోలీసుశాఖ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క
  • భారీగా పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో శాంతిభద్రతలు ముఖ్యం: భట్టి
  • ఏ చిన్న పొరపాటుకు హోంశాఖ, సిబ్బంది అవకాశం ఇవ్వరాదు: భట్టి
  • పోలీసుశాఖలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలి: భట్టి

7:46 PM, 12 Mar 2026 (IST)

పరిశ్రమలు, ఐటీశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సమీక్ష

  • పరిశ్రమలు, ఐటీశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సమీక్ష
  • మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎస్ రామకృష్ణారావు, అధికారులతో సమీక్ష
  • సమీక్షలో పాల్గొన్న ఆర్థిక, పరిశ్రమలు, ఐటీ శాఖల అధికారులు

7:46 PM, 12 Mar 2026 (IST)

చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఎండీ ప్రియాంక

  • చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ఎండీ ప్రియాంక
  • గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకకు చిరంజీవిని ఆహ్వానించిన దిల్ రాజు, ప్రియాంక
  • ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డు స్వీకరించాలని ఆహ్వానపత్రం అందజేసిన దిల్ రాజు, ప్రియాంక
  • ఈనెల 19న హైటెక్స్ వేదికగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక

7:21 PM, 12 Mar 2026 (IST)

నానక్‌రాంగూడలో మెడికవర్‌ ఆస్పత్రి ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

  • నానక్‌రాంగూడలో మెడికవర్‌ ఆస్పత్రి ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • నిబద్ధతతో పనిచేస్తున్న యువతను గుర్తించాలనేది ప్రభుత్వ విధానం: సీఎం
  • ఫార్మా బల్క్‌ డ్రగ్స్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది: సీఎం
  • దేశం ఉత్పత్తి చేసే బల్క్‌ డ్రగ్స్‌లో రాష్ట్ర వాటా 40 శాతం: సీఎం
  • ప్రపంచంలో ఉత్పత్తైన 4 కొవిడ్‌ వ్యాక్సిన్లలో 3 హైదరాబాద్‌ నుంచే వచ్చాయి: సీఎం
  • ఐడీపీఎల్‌, ఆర్‌ అండ్‌ డీ ఏర్పాటు వల్లే హైదరాబాద్‌కు గుర్తింపు: సీఎం
  • హైదరాబాద్‌ ఫార్మా కంపెనీలు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందాయి: సీఎం
  • ఇతర దేశాలకు కూడా ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం: సీఎం

7:20 PM, 12 Mar 2026 (IST)

2050 నాటికి మెట్రో నెట్‌వర్క్‌ను 556.6 కి.మీ. విస్తరణ: హెచ్ఎండీఏ

  • హైదరాబాద్‌లో సమగ్ర రవాణా వ్యవస్థపై హెచ్ఎండీఏ కీలక ప్రణాళిక
  • 2050 నాటికి మెట్రో నెట్‌వర్క్‌ను 556.6 కి.మీ. విస్తరణ: హెచ్ఎండీఏ
  • 2050 నాటికి ఎంఎంటీఎస్ నెట్‌వర్క్ 336.4 కి.మీకు విస్తరణ: హెచ్ఎండీఏ
  • 2050 నాటికి రోడ్ నెట్‌వర్క్ 19,352 కిలోమీటర్లు: హెచ్ఎండీఏ
  • హైదరాబాద్‌లో 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, స్కైవాక్‌లకు ప్రతిపాదనలు: హెచ్ఎండీఏ
  • హైదరాబాద్‌లో 34 ఆర్‌వోబీలు, 16 ఆర్‌యూబీలు, 8 ఎలివేటెడ్ రోడ్లకు ప్రతిపాదనలు: హెచ్ఎండీఏ
  • మూసీ నదిపై 29 వంతెలు నిర్మించేందుకు ప్రతిపాదనలు: హెచ్ఎండీఏ
  • ప్రత్యేక బస్ లైన్ల కోసం 2050 నాటికి 48 కి.మీ వరకు రోడ్ కారిడార్ల గుర్తింపు: హెచ్ఎండీఏ
  • 2050 వరకు 7 అంతర్రాష్ట్ర బస్సు, ట్రక్ టెర్మినల్స్: హెచ్ఎండీఏ
  • సమగ్ర రవాణా వ్యవస్థ ప్రణాళికలకు రూ.4 లక్షల కోట్లు అవసరం: హెచ్ఎండీఏ

7:20 PM, 12 Mar 2026 (IST)

గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దు: మంత్రి ఉత్తమ్‌

  • సూర్యాపేటలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  • గ్యాస్ కొరతపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
  • ప్రస్తుతానికి రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదు: ఉత్తమ్‌
  • కమర్షియల్ గ్యాస్ మాత్రమే కొంత సరఫరా ఆగింది: ఉత్తమ్‌
  • గ్యాస్ కొరతపై రేపు ఆయిల్ కంపెనీలతో సమీక్షిస్తాం: ఉత్తమ్‌
  • రేపు మధ్యాహ్నం సీఎస్, కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తాం: ఉత్తమ్‌
  • జనజీవనానికి ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేస్తాం: ఉత్తమ్‌
  • ఎల్‌పీజీ విషయంలో ఇబ్బందులు కలగకుండా చర్యలు: ఉత్తమ్‌
  • డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తీసుకుంటాం: ఉత్తమ్‌
  • గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దు: మంత్రి ఉత్తమ్‌

6:27 PM, 12 Mar 2026 (IST)

పెద్దపల్లిలో రూ.4.48 కోట్ల విలువైన ధాన్యాన్ని మాయం చేసిన విజయశ్రీ మిల్లుపై కేసునమోదు

  • పెద్దపల్లిలోని విజయశ్రీ బియ్యం మిల్లుపై కేసునమోదు
  • రూ.4.48 కోట్ల విలువైన ధాన్యాన్ని మాయం చేసినట్లు గుర్తింపు
  • పౌరసరఫరాల అధికారుల ఫిర్యాదు మేరకు పెద్దపల్లి పీఎస్‌లో కేసు నమోదు

6:15 PM, 12 Mar 2026 (IST)

ఆర్మూర్ పీఎస్‌ ఆవరణలో అగ్నిప్రమాదం

  • నిజామాబాద్: ఆర్మూర్ పీఎస్‌ ఆవరణలో అగ్నిప్రమాదం
  • పోలీసులు సీజ్ చేసిన బైకులు, ఆటోలు, కార్లు దగ్ధం
  • సుమారు 50 వరకు బైకులు, కార్లు దగ్ధమైనట్లు అంచనా
  • చెత్తను తగులపెట్టడంతో వాహనాలకు అంటుకున్న మంటలు
  • నిజామాబాద్: మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

6:15 PM, 12 Mar 2026 (IST)

కన్నడ మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై నటి రష్మిక మందన్న ఆగ్రహం

  • కన్నడ మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై నటి రష్మిక మందన్న(Rasmika Fire) ఆగ్రహం
  • తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని హెచ్చరిస్తూ రష్మిక లేఖ
  • ఎనిమిదేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు: రష్మిక
  • నేనెప్పుడూ మాట్లాడని పదాలతో కొందరు కథనాలు రాస్తున్నారు: రష్మిక
  • తప్పుడు ప్రచారం బాధపెట్టినా సహనంతో ఉన్నా: రష్మిక
  • గడిచిన 24 గంటల్లో నాపై తీవ్ర దుష్ప్రచారం: రష్మిక
  • వ్యక్తిగత గోప్యతపై తీవ్ర దాడి చేస్తూ పరువు నష్టం కలిగిస్తున్నారు: రష్మిక
  • ఇక నేను మౌనంగా ఉండను: సినీనటి రష్మిక
  • తప్పుడు కథనాలు తొలగించేందుకు 24 గంటల సమయమిస్తున్నా: రష్మిక
  • రేపటి నుంచి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా: రష్మిక
  • మీడియా సంస్థలు, ఇన్‌ప్లూయెన్సర్లకు చట్టపరమైన నోటీసులు ఇస్తా: రష్మిక

6:15 PM, 12 Mar 2026 (IST)

హైదరాబాద్: అంబర్‌పేటలో 2,500 కిలోల కల్తీ పెరుగు స్వాధీనం

  • హైదరాబాద్: అంబర్‌పేటలో 2,500 కిలోల కల్తీ పెరుగు స్వాధీనం
  • అంబర్‌పేట్ పోలీసులు, ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో తనిఖీలు
  • జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలు
  • పాలలో కాస్టిక్ సోడా వినియోగించి పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తింపు
  • పెరుగు నమూనాలను ల్యాబ్‌కు పంపిన అధికారులు

6:14 PM, 12 Mar 2026 (IST)

రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం

  • రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి(BRS Team) బృందం
  • క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక అంశంలో హైకోర్టు తీర్పుపై ఎస్‌ఈసీని కలిసిన బీఆర్‌ఎస్

6:13 PM, 12 Mar 2026 (IST)

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నూతన ఇళ్లకు మంత్రి తుమ్మల శంకుస్థాపన

  • ఖమ్మం: వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నూతన ఇళ్లకు మంత్రి తుమ్మల శంకుస్థాపన
  • కొంతమంది పెద్దల ముసుగులో అమాయక ప్రజలను మోసం చేశారు: తుమ్మల
  • ధనార్జన కోసం దోపిడీదారులు.. పేదలను ముంచారు: మంత్రి తుమ్మల
  • మాఫియా ముఠా ఆగడాలు నిలువరించేందుకు ఇళ్లు తొలగించాం: తుమ్మల
  • అర్హులకు న్యాయం చేయాలన్నదే రేవంత్‌ సర్కార్ లక్ష్యం: తుమ్మల
  • వెలుగుమట్ల కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి తుమ్మల
  • వెలుగుమట్లలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • యుద్ధ ప్రాతిపదికన అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం: మంత్రి తుమ్మల

6:13 PM, 12 Mar 2026 (IST)

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ

  • జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) నివేదికపై హైకోర్టులో విచారణ
  • కేసీఆర్, హరీశ్‌రావు తరఫున న్యాయవాదుల వాదనలు
  • ఇప్పటికే పూర్తయిన ప్రభుత్వం, కమిషన్ తరఫు వాదనలు
  • కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ పిటిషన్లు
  • పిటిషన్లు వేసిన కేసీఆర్, హరీశ్‌రావు, స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషి
  • కేసీఆర్, హరీశ్‌రావును ఇబ్బంది పెట్టడానికే కమిషన్ వేశారన్న న్యాయవాది శేషాద్రినాయుడు
  • కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకున్నారన్న శేషాద్రినాయుడు
  • ఇద్దరిపైనా ఇప్పటికే దుష్ప్రచారం చేశారన్న న్యాయవాది శేషాద్రినాయుడు
  • పిల్లర్లు కూలిపోయాయని ప్రభుత్వం కమిషన్ వేసిందన్న శేషాద్రినాయుడు
  • అదే ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించారన్న శేషాద్రినాయుడు
  • మల్లన్నసాగర్ నుంచి నగరానికి నీటిని తీసుకొచ్చేలా జీవో విడుదల చేశారన్న శేషాద్రినాయుడు

6:13 PM, 12 Mar 2026 (IST)

ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి పరీక్షలు

  • ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి పరీక్షలు
  • ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు
  • పరీక్షకు హాజరుకానున్న 5,28,239 మంది విద్యార్ధులు
  • మొత్తం 2,676 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ

5:15 PM, 12 Mar 2026 (IST)

లోక్‌సభ నుంచి వెళ్లిపోయిన రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ

  • లోక్‌సభ నుంచి వెళ్లిపోయిన రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ
  • కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురి ప్రసంగం వేళ వెళ్లిపోయిన రాహుల్‌, ప్రియాంక

5:15 PM, 12 Mar 2026 (IST)

నోటీసు ఇవ్వకుండా ఇతర విషయాలపై మాట్లాడటం సరికాదు: స్పీకర్‌

  • నోటీసు ఇవ్వకుండా ఇతర విషయాలపై మాట్లాడటం సరికాదు: స్పీకర్‌
  • ఒక అంశంపై నోటీసు ఇచ్చి.. మరో అంశంపై మాట్లాడటం సరికాదు: స్పీకర్‌
  • ప్రతి ఒక్కరూ సభా మర్యాదలు పాటించాల్సిందే: స్పీకర్‌

5:15 PM, 12 Mar 2026 (IST)

పెట్రోల్, డీజిల్‌, ఏటీఎఫ్‌ సరఫరాలో ఎలాంటి కొరత లేదు : కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి

  • కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి ప్రసంగాన్ని అడ్డుకుంటున్న విపక్షాలు
  • ఎప్‌స్టీన్‌.. ఎప్‌స్టీన్‌ అంటూ లోక్‌సభలో విపక్ష సభ్యుల నినాదాలు
  • పరిస్థితులను చక్కదిద్దుతున్నామన్న పెట్రోలియం మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి
  • ప్రధాని మోదీ చర్చల వల్ల పరిస్థితులు సర్దుకుంటున్నాయన్న కేంద్రమంత్రి
  • పెట్రోల్, డీజిల్‌, ఏటీఎఫ్‌ సరఫరాలో ఎలాంటి కొరత లేదన్న కేంద్రమంత్రి
  • దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్న కేంద్రమంత్రి
  • గృహవినియోగ సిలిండర్ల సరఫరాకు ఇబ్బందులు లేవన్న కేంద్రమంత్రి
  • 60 శాతం ఎల్‌పీజీని మనం గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం: హర్దీప్‌సింగ్‌
  • దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి: హర్దీప్‌సింగ్‌
  • చమురు శుద్ధి కర్మాగారాలు వంద శాతానికి మించి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి: హర్దీప్‌సింగ్‌
  • పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏటీఎఫ్‌, ఇంధన చమురు కొరత లేదు : హర్దీప్‌సింగ్‌
  • హర్మూజ్‌ ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాల్లో సరఫరా: హర్దీప్‌సింగ్‌
  • హర్మూజ్‌ యేతర ముడి చమురు సరఫరా 70 శాతానికి పెరిగింది: హర్దీప్‌సింగ్‌
  • భారత దిగుమతుల వనరులు 27 దేశాల నుంచి 40 దేశాలకు పెరిగాయి: హర్దీప్‌సింగ్‌

5:15 PM, 12 Mar 2026 (IST)

మనం ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా ఎలా నిర్ణయిస్తుంది: రాహుల్‌

  • పార్లమెంటులో ఎల్‌పీజీ అంశంపై మాట్లాడిన రాహల్‌ గాంధీ
  • హర్మూజ్‌ జల సంధి నుంచి పెద్దఎత్తున దిగుమతులు జరగాల్సి ఉంది: రాహుల్‌గాంధీ
  • యుద్ధ సమయంలో హర్మూజ్‌ జలసంధి నుంచి దిగుమతులు ఆగిపోయాయి: రాహుల్‌గాంధీ
  • ఇది ఆరంభం మాత్రమే: రాహుల్‌గాంధీ
  • గ్యాస్‌ కొరతతో దేశం అల్లాడుతోంది: రాహుల్‌గాంధీ
  • తన ప్రసంగంలో ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ గురించి ప్రస్తావించిన రాహుల్‌గాంధీ
  • మనం ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా ఎలా నిర్ణయిస్తుంది: రాహుల్‌
  • రష్యా నుంచి చమురు కొనాలో.. వద్దో.. మనకు మనం నిర్ణయించుకోవాలి: రాహుల్‌
  • రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా జోక్యం ఎందుకు?: రాహుల్‌

5:15 PM, 12 Mar 2026 (IST)

మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసిన ఆర్టీసీ ఐకాస నేతలు

  • మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసిన ఆర్టీసీ ఐకాస(RTC JAC) నేతలు
  • ఆర్టీసీ కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందించిన నేతలు
  • ఆర్టీసీ కార్మికుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తుతాం: హరీశ్‌రావు
  • ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర: హరీశ్‌రావు
  • కాంగ్రెస్ సర్కార్ ఆర్టీసీని అప్పుల కుప్ప చేసింది: హరీశ్‌రావు
  • ప్రభుత్వం ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరించే కుట్రలు చేస్తోంది: హరీశ్‌రావు
  • కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది: హరీశ్‌రావు

5:15 PM, 12 Mar 2026 (IST)

829 పాయింట్ల నష్టంతో 76,035 వద్ద ముగిసిన సెన్సెక్స్

  • భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
  • 829 పాయింట్ల నష్టంతో 76,035 వద్ద ముగిసిన సెన్సెక్స్
  • 228 పాయింట్ల నష్టంతో 23,639 వద్ద ముగిసిన నిఫ్టీ

3:35 PM, 12 Mar 2026 (IST)

ఈనెల 15 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు

  • ఈనెల 15 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు
  • ఏప్రిల్ 24 వరకు కొనసాగనున్న ఒంటిపూట బడులు
  • ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగనున్న పాఠశాలలు

3:34 PM, 12 Mar 2026 (IST)

మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ప్రొ.కోదండరామ్‌, అద్దంకి దయాకర్ భేటీ

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ప్రొ.కోదండరామ్‌, అద్దంకి దయాకర్ భేటీ
  • ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు కమిటీ ఏర్పాటుపై భేటీ
  • కమిటీలో వివిధ వర్గాలకు అవకాశం అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంపై చర్చ
  • ఉద్యమకారులకు హామీల అమలు, విధివిధానాలు, అర్హుల ఎంపికపై చర్చ
  • జిల్లాలవారీగా అర్హులను గుర్తించి ఉద్యమకారుల డిమాండ్లపై అధ్యయనానికి నిర్ణయం
  • సీఎంతో ఉద్యమకారుల కమిటీ భేటీ ఏర్పాటుపై సమావేశంలో చర్చ
  • వారంలో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం

2:34 PM, 12 Mar 2026 (IST)

సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు బహిరంగ లేఖ

  • సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు బహిరంగ లేఖ
  • రైతు భరోసాను రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు: రామచందర్‌రావు
  • రైతు భరోసాను పెంచకుండా.. రూ.12 వేలకే పరిమితం చేశారు: రామచందర్‌రావు
  • ఆ రైతు భరోసాను కూడా సమయానికి ఇవ్వడం లేదు: రామచందర్‌రావు
  • యాసంగి పంట రైతు భరోసా రాక రైతులు అప్పుల పాలవుతున్నారు: రామచందర్‌రావు
  • ప్రాజెక్టుల నీళ్లు కాల్వలకు రాక పంటలు ఎండిపోతున్నాయి: రామచందర్‌రావు
  • అప్పులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు: రామచందర్‌రావు

2:33 PM, 12 Mar 2026 (IST)

సీబీఐ నోటీసులపై స్పందించిన కల్వకుంట్ల కవిత

  • సీబీఐ నోటీసులపై స్పందించిన కల్వకుంట్ల కవిత
  • ఈనెల 16న విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు తెలిపారు: కవిత
  • సీబీఐ నోటీసులపై మా లీగల్ టీంతో చర్చిస్తున్నా: కవిత
  • సత్యం నా తోడుగా ఉన్నంతవరకు సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తా: కవిత

2:00 PM, 12 Mar 2026 (IST)

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,67,180

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,67,180
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,700
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,75,000

2:00 PM, 12 Mar 2026 (IST)

చాలా మంది ఇలాంటి స్టూడియో కోసం వెయిట్ చేస్తున్నారు: సీఎం

  • చాలా మంది ఇలాంటి స్టూడియో కోసం వెయిట్ చేస్తున్నారు: సీఎం
  • హైదరాబాద్‌కు వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌కు స్వాగతం: సీఎం రేవంత్‌రెడ్డి
  • ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌ ట్యాలెంట్‌ను వెలికితీస్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి
  • హైదరాబాద్, నెట్‌ఫ్లిక్స్‌కు పోలికలు ఉన్నాయి: సీఎం రేవంత్‌రెడ్డి
  • నెట్‌ఫ్లిక్స్‌ ట్యాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు కల్పిస్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి
  • గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
  • రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టింది: సీఎం రేవంత్‌రెడ్డి
  • నెట్‌ఫ్లిక్స్ కూడా క్రీడలపై దృష్టి పెట్టినట్లు చదివాను: సీఎం
  • భవిష్యత్తులో క్రీడల నంబర్ వన్ బ్రాడ్‌కాస్టర్‌గా ఎదిగుతుందని ఆశిస్తున్నా: సీఎం

1:44 PM, 12 Mar 2026 (IST)

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా

  • యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా
  • గవర్నర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు

1:44 PM, 12 Mar 2026 (IST)

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో విచారణ ముగించిన సుప్రీంకోర్టు

  • ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో విచారణ ముగించిన సుప్రీంకోర్టు
  • బీఆర్ఎస్‌ పిటిషన్లపై విచారణ ముగిసినట్లు ప్రకటించిన ధర్మాసనం
  • ఇప్పటికే పిటిషన్లను స్పీకర్‌ పరిష్కరించినట్టు తెలిపిన న్యాయవాది సింఘ్వీ
  • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్‌ నిర్ణయం వెలువరించారన్న సింఘ్వీ
  • పెండింగ్‌లో ఉన్న ఇద్దరిపై నిన్నతుదితీర్పు ఇచ్చినట్టు తెలిపిన సింఘ్వీ
  • సుప్రీంకోర్టులో ఇంకా విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదన్న సింఘ్వీ
  • స్పీకర్‌ న్యాయవాది సింఘ్వీ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
  • 2 రోజుల్లో స్పీకర్‌ తన తీర్పు కాపీలు ఫిర్యాదుదారులకు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు
  • విచారణ ముగిసినట్లు ప్రకటించిన జస్టిస్ సంజయ్‌ కరోల్‌

1:44 PM, 12 Mar 2026 (IST)

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ

  • కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ
  • వాణిజ్య, గృహ ఎల్పీజీ సిలిండర్ల కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరిన కేటీఆర్
  • సిలిండర్ల కొరత ఆహార వ్యాపారాలను ప్రభావితం చేస్తుందన్న కేటీఆర్
  • హోటళ్లు, హాస్టళ్లు, చిన్న ఆహార వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది: కేటీఆర్
  • సరఫరాను వెంటనే పునరుద్ధరించకపోతే వేలాది సంస్థలు మూసివేయవచ్చు: కేటీఆర్
  • గ్యాస్‌ కొరత వల్ల కార్మికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది: కేటీఆర్

1:12 PM, 12 Mar 2026 (IST)

ఇవాళ, రేపు బడ్జెట్ సన్నాహక సమావేశాలు

  • ఇవాళ, రేపు బడ్జెట్ సన్నాహక సమావేశాలు
  • వివిధ శాఖల ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
  • మంత్రులు, అధికారులతో సమీక్షించనున్న భట్టి విక్రమార్క

1:12 PM, 12 Mar 2026 (IST)

దిల్లీ హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు కవిత ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులు

  • కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ అధికారులు
  • దిల్లీ హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు వచ్చిన సీబీఐ అధికారులు
  • దిల్లీ మద్యం కేసులో క్లీన్‌చిట్ ఇచ్చిన రౌస్‌ అవెన్యూ కోర్టు
  • దిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసిన సీబీఐ

1:11 PM, 12 Mar 2026 (IST)

నెట్‌ఫ్లిక్స్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నాం : రేవంత్‌రెడ్డి

  • నెట్‌ఫ్లిక్స్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నాం : రేవంత్‌రెడ్డి
  • హైదరాబాద్‌ అన్ని అవకాశాలను కల్పిస్తుంది
  • మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది
  • నాకు బాల్యం నుంచే సినిమాలు అంటే ఇష్టం : రేవంత్‌రెడ్డి
  • చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఫిల్మ్‌ ఇండస్ట్రీని తీసుకువచ్చారు
  • నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌కు వచ్చిందంటే హాలీవుడ్ నగరానికి వచ్చినట్లే
  • నెట్‌ఫ్లిక్స్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌కు భూమిని ఇవ్వాలని మంత్రిని ఆదేశిస్తున్నా : రేవంత్‌రెడ్డి

12:37 PM, 12 Mar 2026 (IST)

విద్యా కమిషన్‌ నివేదికపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం

  • విద్యా కమిషన్‌ నివేదికపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం
  • మన సంస్కృతి గురువును దేవునితో సమానంగా గౌరవిస్తుంది: బండి సంజయ్‌
  • తెలంగాణ విద్యా కమిషన్ సూచనలు ఏంటి?: బండి సంజయ్‌
  • విద్యా కమిషన్‌ నివేదిక రాష్ట్రంలోని ఉపాధ్యాయ సమాజానికి అవమానం: బండి సంజయ్‌
  • రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పి నివేదికను తిరస్కరించాలి: బండి సంజయ్‌

12:32 PM, 12 Mar 2026 (IST)

గ్యాస్‌ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ వద్ద ఇండీ కూటమి ఎంపీల నిరసన

  • గ్యాస్‌ ధరల పెరుగుదల, కొరతపై పార్లమెంట్ వద్ద ఇండీ కూటమి ఎంపీల నిరసన
  • పార్లమెంట్‌ వద్ద నిరసనల్లో పాల్గొన్న రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే

12:08 PM, 12 Mar 2026 (IST)

కాసేపట్లో నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం

  • జూబ్లీహిల్స్ నివాసం నుంచి హైటెక్ సిటీకి బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
  • కాసేపట్లో నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం

12:08 PM, 12 Mar 2026 (IST)

నిర్మల్ జిల్లాలో పెళ్లి వాహనం బోల్తా పడి ఇద్దరు మృతి

  • నిర్మల్ జిల్లాలో పెళ్లి వాహనం బోల్తా పడి ఇద్దరు మృతి
  • టైరు పేలి వాహనం బోల్తా పడి మరో 15 మందికి గాయాలు
  • ఇచ్చోడ మండలం సోన్‌పల్లి నుంచి ఆర్మూర్‌కు పెళ్లికి వెళ్తుండగా బోల్తా
  • నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ బైపాస్ వద్ద ఘటన

12:07 PM, 12 Mar 2026 (IST)

ఫిబ్రవరిలో 78 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

  • ఫిబ్రవరిలో 78 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
  • ప్రత్యేక ఆపరేషన్ ద్వారా 16 రాష్ట్రాల నుంచి 117 మంది నిందితులు అరెస్టు
  • నిందితులకు 74 కేసుల్లో సంబంధం ఉన్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల గుర్తింపు
  • దేశవ్యాప్తంగా 1,081 సైబర్‌ క్రైమ్ కేసుల్లో నిందితుల ప్రమేయం గుర్తింపు
  • బ్యాంక్‌ ఖాతాల్లో దాదాపు రూ.139 కోట్ల లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తింపు
  • బాధితులకు రూ.34,76,884 రీఫండ్ చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

11:37 AM, 12 Mar 2026 (IST)

నేరేడ్‌మెట్‌లో ఎక్సైజ్‌ సీఐ జ్యోతి భర్త శ్రీనివాస్‌ ఆత్మహత్య

  • నేరేడ్‌మెట్‌లో ఎక్సైజ్‌ సీఐ జ్యోతి భర్త శ్రీనివాస్‌ ఆత్మహత్య
  • భార్య జ్యోతి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త సూసైడ్‌ నోట్
  • సీఐగా జ్యోతికి పదోన్నతి పొందినప్పటి నుంచి బెదిరించేదని శ్రీనివాస్‌ ఆరోపణ
  • అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందని సూసైడ్‌ నోట్‌లో వెల్లడి
  • పీఎస్‌కు పిలిపించి సీఐ జ్యోతి బెదిరించేదని సూసైడ్ నోట్‌లో పేర్కొన్న శ్రీనివాస్
  • భార్య వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో భర్త వెల్లడి

11:36 AM, 12 Mar 2026 (IST)

కావూరు సాంబశివరావు భౌతికకాయానికి నివాళులర్పించిన కేటీఆర్

  • కావూరు సాంబశివరావు భౌతికకాయానికి నివాళులర్పించిన కేటీఆర్
  • కావూరు భౌతికకాయానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రాంచందర్‌రావు నివాళులు
  • కావూరు భౌతికకాయానికి ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్‌ నివాళులు

11:36 AM, 12 Mar 2026 (IST)

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘నిర్మాణ్ 26’ కార్యక్రమం

  • ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘నిర్మాణ్ 26’ కార్యక్రమం
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీసీ ప్రొ.కుమార్‌

11:36 AM, 12 Mar 2026 (IST)

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం వద్ద ప్రమాదం

  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం వద్ద ప్రమాదం
  • ఖమ్మం జిల్లా: రెండు బైక్‌లను ఢీకొన్న లారీ, ఇద్దరు మృతి

11:35 AM, 12 Mar 2026 (IST)

సంగారెడ్డి జిల్లా బీరంగూడ నుంచి లింగంపల్లి ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్‌ జామ్‌

  • సంగారెడ్డి జిల్లా బీరంగూడ నుంచి లింగంపల్లి ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్‌ జామ్‌
  • భారీగా ట్రాఫిక్‌ జామ్ కావడంతో వాహనాదారుల ఇబ్బందులు

11:28 AM, 12 Mar 2026 (IST)

నేరేడ్‌మెట్‌లో ఎక్సైజ్‌ సీఐ జ్యోతి భర్త శ్రీనివాస్‌ ఆత్మహత్య

  • నేరేడ్‌మెట్‌లో ఎక్సైజ్‌ సీఐ జ్యోతి భర్త శ్రీనివాస్‌ ఆత్మహత్య
  • భార్య జ్యోతి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త సూసైడ్‌ నోట్
  • సీఐగా జ్యోతికి పదోన్నతి పొందినప్పటి నుంచి బెదిరించేదని శ్రీనివాస్‌ ఆరోపణ
  • అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందని సూసైడ్‌ నోట్‌లో వెల్లడి
  • పీఎస్‌కు పిలిపించి సీఐ జ్యోతి బెదిరించేదని సూసైడ్ నోట్‌లో పేర్కొన్న శ్రీనివాస్
  • భార్య వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో భర్త వెల్లడి

11:28 AM, 12 Mar 2026 (IST)

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘నిర్మాణ్ 26’ కార్యక్రమం

  • ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘నిర్మాణ్ 26’ కార్యక్రమం
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీసీ ప్రొ.కుమార్‌

11:27 AM, 12 Mar 2026 (IST)

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం వద్ద ప్రమాదం

  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం వద్ద ప్రమాదం
  • ఖమ్మం జిల్లా: రెండు బైక్‌లను ఢీకొన్న లారీ, ఇద్దరు మృతి

11:27 AM, 12 Mar 2026 (IST)

సంగారెడ్డి జిల్లా బీరంగూడ నుంచి లింగంపల్లి ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్‌ జామ్‌

  • సంగారెడ్డి జిల్లా బీరంగూడ నుంచి లింగంపల్లి ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్‌ జామ్‌
  • భారీగా ట్రాఫిక్‌ జామ్ కావడంతో వాహనాదారుల ఇబ్బందులు

11:27 AM, 12 Mar 2026 (IST)

ఇరాక్‌లోని బస్రా నౌకాశ్రయంపై దాడి చేసిన ఇరాన్‌

  • ఇరాక్‌లోని బస్రా నౌకాశ్రయంపై దాడి చేసిన ఇరాన్‌
  • అమెరికాకు చెందిన చమురు ట్యాంకర్‌లో ఉన్న భారతీయుడు మృతి
  • ఇరాకీ జలాల్లో ఉన్న రెండు చమురు ట్యాంకర్లపైనా డ్రోన్‌ దాడి
  • చమురు ట్యాంకర్ల నుంచి భారీగా ఎగసిపడిన మంటలు
  • మరో 27 మందిని రక్షించినట్లు తెలిపిన ఇరాక్‌ అధికారులు
  • ఇరాక్‌లో అన్ని చమురు టెర్మినళ్ల కార్యకలాపాల నిలిపివేత

10:49 AM, 12 Mar 2026 (IST)

మహారాష్ట్ర శాసనసభకు బాంబు బెదిరింపులు

  • మహారాష్ట్ర శాసనసభకు బాంబు బెదిరింపులు
  • బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండగా బాంబు బెదిరింపులు
  • ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు వెల్లడి
  • బాంబు బెదిరింపులతో సిబ్బందిని ఖాళీ చేయించిన అధికారులు
  • మహారాష్ట్ర: తనిఖీలు చేస్తున్న బాంబ్‌ స్క్వాడ్‌, పోలీసులు

10:48 AM, 12 Mar 2026 (IST)

ఖమ్మం వెలుగుమట్ల బాధితులను పునరావస కేంద్రం నుంచి తరలింపు

  • ఖమ్మం వెలుగుమట్ల బాధితులను పునరావస కేంద్రం నుంచి తరలింపు
  • ఖమ్మం: బాధితులను అంబేడ్కర్ భవన్‌ నుంచి ఖాళీ చేయించిన అధికారులు
  • ఖమ్మం: అసలైన లబ్ధిదారులకు లిస్టులో పేరు రాలేదని బాధితుల ఆరోపణ
  • పునరావాస కేంద్రం నుంచి తరలిస్తే ఎక్కడికి వెళ్లాలని బాధితుల ఆవేదన

10:47 AM, 12 Mar 2026 (IST)

బంజారాహిల్స్‌లోని నివాసంలో కావూరు సాంబశివరావు భౌతికకాయం

  • హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని నివాసంలో కావూరు సాంబశివరావు భౌతికకాయం
  • కావూరు భౌతికకాయానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సీపీఐ నేత నారాయణ నివాళులు
  • కావూరు భౌతికకాయానికి నాదెండ్ల మనోహర్‌, డి.సురేష్‌బాబు నివాళులు
  • మధ్యాహ్నం హైదరాబాద్‌ మహాప్రస్థానంలో కావూరు సాంబశివరావు అంత్యక్రియలు

9:25 AM, 12 Mar 2026 (IST)

హైదరాబాద్‌: కాచిగూడ పరిధిలో మహిళ ఆత్మహత్య

  • హైదరాబాద్‌: కాచిగూడ పరిధిలో మహిళ ఆత్మహత్య
  • మద్యం తాగవద్దని భర్త మందలించినందుకు భార్య లక్ష్మీ ఆత్మహత్య
  • ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
  • హైదరాబాద్‌: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

7:57 AM, 12 Mar 2026 (IST)

మహబూబాబాద్ జిల్లా: మరిపెడ మండలం లచ్చుతండా వద్ద ప్రమాదం

  • మహబూబాబాద్ జిల్లా: మరిపెడ మండలం లచ్చుతండా వద్ద ప్రమాదం
  • బైకును ఢీకొన్న గుర్తుతెలియని వాహనం, ఇద్దరు యువకులు మృతి
  • మృతులు గాలివారిగూడెం వాసులు ఉదయ్‌కిరణ్(22), భిక్షం (20)

7:56 AM, 12 Mar 2026 (IST)

తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం

  • తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
  • శ్రీవారి సర్వదర్శనానికి 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 66,606 మంది భక్తులు
  • తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు
  • నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 25,899 మంది భక్తులు

7:38 AM, 12 Mar 2026 (IST)

అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) కీలక నిర్ణయం

  • అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) కీలక నిర్ణయం
  • యుద్ధం దృష్ట్యా ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించేందుకు కీలక నిర్ణయం
  • అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదల చేస్తున్నట్లు ప్రకటన
  • 2022 ఉక్రెయిన్ యుద్ధంలో విడుదల చేసిన 182 మిలియన్‌ బ్యారెళ్ల కంటే ఇది ఎక్కువ

6:34 AM, 12 Mar 2026 (IST)

నిజామాబాద్: ధర్పల్లిలోని ఎన్టీఆర్‌ కాలనీ పరిధిలో మహిళ మృతదేహం లభ్యం

  • నిజామాబాద్: ధర్పల్లిలోని ఎన్టీఆర్‌ కాలనీ పరిధిలో మహిళ మృతదేహం లభ్యం
  • సీతాయిపేట తండాకు చెందిన జరుపుల కాంతి(55)గా గుర్తించిన పోలీసులు
  • బైక్‌పై గోనె సంచిలో మహిళ మృతదేహం తీసుకెళ్లిన ధర్పల్లికి చెందిన వ్యక్తి
  • మార్గంమధ్యలో సంచిలో నుంచి పడిపోయిన కాంతి మృతదేహం
  • నిజామాబాద్: గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ధర్పల్లి పోలీసులు

6:33 AM, 12 Mar 2026 (IST)

మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమైన సర్కార్‌

  • మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమైన సర్కార్‌
  • రేపు స్వయంగా మూసీ అభివృద్ధి ప్రణాళికపై సీఎం ప్రజంటేషన్
  • మూసీ పునరుజ్జీవనం ఆవశ్యకత, కార్యాచరణ వివరించనున్న రేవంత్‌రెడ్డి
  • ప్రజంటేషన్‌కు ఏర్పాట్లు చేసిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
  • ప్రధాన రాజకీయ పార్టీలు, పర్యావరణ, వ్యాపారవేత్తలకు ఆహ్వానం

6:33 AM, 12 Mar 2026 (IST)

ఇవాళ మధ్యాహ్నం కావూరు సాంబశివరావు అంత్యక్రియలు

  • ఇవాళ మధ్యాహ్నం కావూరు సాంబశివరావు అంత్యక్రియలు
  • హైదరాబాద్‌ మహాప్రస్థానంలో కావూరు సాంబశివరావు అంత్యక్రియలు
  • బంజారాహిల్స్‌లోని నివాసంలో కావూరు సాంబశివరావు భౌతికకాయం



Source link

Spread the love