మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య పుతిన్ రహస్యంగా ఇరాన్‌కు మద్దతు ఇస్తున్నారని ట్రంప్ ఆరోపించారు


ట్రంప్: రష్యా క్లారిటీ ఇచ్చినా.. అమెరికా అనుమానాలు.. పుతిన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు..

ట్రంప్: మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజుకూ ముదురుతోంది. అమెరికా- ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు మొదలై 14 రోజులు గడుస్తోంది. ఇప్పటికీ కొలిక్కి రావడం లేదు. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ఇరాన్‌కు రహస్యంగా సపోర్టు చేస్తుందనే అనుమానం. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారంగా మారింది. “ఇరాన్‌కు పుతిన్ కొంచెం సహాయం చేస్తుండొచ్చు. అమెరికా ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి రష్యా ఇరాన్‌కు మద్దతు తెలుతుండొచ్చు. అంతర్జాతీయంగా రాజకీయాల్లో ఒక శక్తికి వ్యతిరేకంగా మరో శక్తి పావులు కదపడం సహజం. చైనా కూడా ఇదే బాటలో నడుస్తుందని నా అభిప్రాయం.” అని ట్రంప్ వ్యాఖ్యానించాడు.

మరింత చదవండి: Janasena Party Formation Day: నేడే “జనసేన” పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. పాడేరు పర్యటనలో డిప్యూటీ సీఎం..!

ఇదిలా.. ఇటీవల ట్రంప్‌ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధ పరిస్థితులపై చర్చించారు. ఈ సంభాషణ అనంతరం అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో తాము ఎలాంటి నిఘా ఉంచడం లేదని రష్యా అధికారులు యూఎస్‌కు తెలిపారు. రష్యా మాటలను తాము నమ్ముతున్నామన్నారు. ఇరాన్‌కు రష్యా సపోర్టు లేదని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంతలో ట్రంప్ రష్యాపై ఆరోపణలు చేయడం దుమారంగా మారింది. ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు రష్యా స్పందించలేదు.

మరింత చదవండి: Saturday Horoscope: శనివారం రాశి ఫలాలు.. ఆ రాశివారు పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిందే..!





Source link

Spread the love