వ్లాదిమిర్ పుతిన్ : ఇరాన్‌కు రష్యా పూర్తి అండ


వ్లాదిమిర్ పుతిన్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, అమెరికాలతో జరుగుతున్న ఘర్షణల్లో మిత్రదేశమైన ఇరాన్‌కు రష్యా పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ముజ్తబా ఖమేనీకి అభినందనలు

ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు ముజ్తబా ఖమేనీకి పుతిన్ అభినందనలు తెలిపారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని నడిపించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇరాన్ నేతల మృతిపై సంతాపం

ఇటీవల జరిగిన ఘటనల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ సహా పలువురు అగ్రనేతల మృతిపై పుతిన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఎదురవుతున్న సాయుధ దురాక్రమణను ఎదుర్కోవడంలో ముజ్తబా నాయకత్వం కీలకమని తెలియజేసింది.

ఇది కూడా చదవండి: IND vs NZ T20 World Cup Final : కష్టాల్లో కివీస్

వ్లాదిమిర్ పుతిన్
వ్లాదిమిర్ పుతిన్

మారుతున్న రాజకీయ సమీకరణలు

అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ పరిస్థితుల మధ్య రష్యా–ఇరాన్ మధ్య బలపడుతున్న వ్యూహాత్మక బంధం పశ్చిమాసియా రాజకీయ సమీకరణలను వేగంగా మార్చుతోంది. రష్యా ఇచ్చిన ఈ బహిరంగ మద్దతు ఇరాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో నైతిక బలం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు.

హిందీ వార్తలు: hindi.vaartha.com

పేపర్: epaper.vaartha.com

ఇది కూడా చదవండి:



Source link

Spread the love