- ట్రంప్ చైనా టూర్‌పై సందిగ్ధం
- అమెరికా ప్రభుత్వ వర్గాల నుంచి కీలక సంకేతాలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనపై సందిగ్ధం. ఏప్రిల్‌లో చైనాలో ఉండటానికి ట్రంప్ సిద్ధపడ్డారు. ఇప్పటికే ట్రంప్ ప్రకటనలు. కానీ ఇంతలోనే పశ్చిమాసియా యుద్ధం అట్టుడుకుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇంకోవైపు చమురు, గ్యాస్ సంక్షోభంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చైనా పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. యుద్ధం కారణంగా చైనా పర్యటన ఆలస్యం కావొచ్చని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.
ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అమెరికా తన దౌత్య, భద్రతా వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలను సమీక్షించేందుకు అమెరికా పరిపాలన అత్యవసర చర్చలు జరుపుతున్నట్లు. ఈ కారణంగానే ట్రంప్ చైనా పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం.
అమెరికా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్ యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలతో సమన్వయం చేయడం ప్రస్తుతం ప్రధాన ప్రాధాన్యతగా మారింది. విదేశీ పర్యటనల షెడ్యూల్లో మార్పులు రావొచ్చని అధికారులు సూచిస్తున్నారు. అయితే ట్రంప్‌పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చైనా పర్యటనకు సంబంధించిన తేదీలు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అమెరికా వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్య దేశాల దౌత్య చర్చలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.