క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్కు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్


  • ఈ సమావేశాల్లోనే గిగ్ వర్కర్ల బిల్లు!
  • డ్రాఫ్ట్ బిల్లుకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం
  • సంక్షేమ పథకాలు, రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక పోర్టల్, యాప్
  • మే నెల నుంచి పూర్తి స్థాయిలో చట్టం అమలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్ల (క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ తదితరులు) జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వారి సామాజిక భద్రత, సంక్షేమమే లక్ష్యంగా తెస్తున్న ‘తెలంగాణ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్- ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు-2025’కు ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఈ ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆ తరువాత వచ్చే మే డే లోపు రూల్స్​ రాసుకుని అప్పటి నుంచి ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉంది.

దేశంలోనే తొలిసారిగా ఇంత సమగ్రమైన గిగ్ వర్కర్ల చట్టం తెస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించబోతోంది. ఈ చట్టం ద్వారా అసంఘటిత రంగానికి చెందిన సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల మంది గిగ్ వర్కర్లను ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలను అందించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ‘సామాజిక భద్రత కోడ్-2020’ ముసాయిదా నిబంధనలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులో కొన్ని మార్పులు కూడా చేసి తుది బిల్లును అసెంబ్లీలో పెట్టనుంది.

స్మార్ట్ యాప్​తో భద్రత!

గిగ్ వర్కర్లందరినీ వ్యవస్థీకృత పరిధిలోకి తెచ్చేందుకు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రత్యేక వెబ్ పోర్టల్, స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం రెడీ చేయిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక డిజిటల్ వేదిక రూపకల్పన బాధ్యతలను ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)’కు అప్పగించింది. తక్కువ చదువుకున్న వారు సైతం సులభంగా తమ వివరాలు నమోదు చేసుకునేలా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధికారులు డిజైన్ చేస్తున్నారు. ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తారు.

రిజిస్టర్ అయిన వర్కర్లకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ బోర్డు ద్వారా అందే లాభాలు నేరుగా అందుతాయి. భవిష్యత్తులో ఈఎస్ఐ, పీఎఫ్ తరహాలో భద్రత, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, ఇతర ఆర్థిక సాయాలకు సంబంధించిన దరఖాస్తులను కూడా ఇదే యాప్ ద్వారా సమర్పించుకునేలా సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీర్చిదిద్దుతున్నారు. బిల్లు ఆమోదం పొంది చట్టం అమల్లోకి వస్తే అగ్రిగేటర్లు (ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు) ప్రతి లావాదేవీపై 1 నుంచి 2 శాతం సెస్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ నిధిని నేరుగా గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లిస్తారు.

ఉద్యోగ భద్రత.. అల్గారిథమ్​లో పారదర్శకత!

కొత్త బిల్లు ప్రకారం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక ‘వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు కానుంది. ఈ బోర్డు రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ చూసుకుంటుంది. చట్టం అమల్లోకి వస్తే ఇకపై సంస్థలు కస్టమర్ భద్ర తకు ముప్పు కాని పక్షంలో.. ఏ వర్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైనా అకారణంగా లేదా ఉన్నపళంగా తొలగించ డానికి వీల్లేదు. తప్పనిసరిగా ఏడు రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సిందే. అలాగే, గిగ్ వర్కర్లకు పని కేటాయింపులు, రేటింగ్స్, అకౌంట్ సస్పెన్షన్ లాంటివి నిర్ణయించే సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేర్ ‘అల్గారిథమ్’ పారదర్శకంగా ఉండేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచారు.

జీతా ల చెల్లింపులో ఆలస్యం, మోసాలపై ఫిర్యాదు చేసేందుకు 100 మందికి పైగా వర్కర్లు ఉన్న ప్రతి సంస్థలో ‘అంతర్గత వివాద పరిష్కార కమిటీ’ని తప్పనిసరి చేశారు. అక్కడ న్యాయం జరగకపోతే స్వతంత్రంగా విచారణ జరిపే అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించేలా ముసాయిదాలో స్పష్టమైన గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను పొందుపరిచారు. ఈ చట్టం రూప కల్పన కోసం ప్రభుత్వం 1,300 మంది గిగ్ వర్కర్లపై సర్వే చేయడంతో పాటు, వివిధ వర్గా లతో ఆరుసార్లు చర్చలు జరిపి, ప్రజాభిప్రా య సేకరణ తర్వాత తుది రూపు ఇచ్చింది.



Source link

Spread the love