
హైదరాబాద్: ముషీరాబాద్ బాపూజీనగర్‌లోని A-1 ఫ్రెష్ చికెన్ మార్ట్‌పై వారాసిగూడ పోలీసులు దాడి చేసి, సుమారు 610 కిలోల కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమాని షేక్ షకీల్ పాడైన చికెన్‌ను విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాంసం దుర్వాసన రావడంతోపాటు, ఎలుకలు, పిల్లులు సంచరించే అత్యంత అపరిశుభ్ర ప్రాంతంలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. మరోవైపు షాపు ట్రేడింగ్ లైసెన్స్ గడువు ముగిసి ఏడాది దాటినా రెన్యువల్ చేయించుకోకుండా.. అక్రమంగా కొనసాగిస్తున్నట్లు తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.