18-03-2026 Telangana News Today Live Updates : కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నాం: సీఎం రేవంత్ రెడ్డి


LIVE FEED

8:01 PM, 18 Mar 2026 (IST)

కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

  • కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ సభలో పాల్గొని సూచనలు, సలహాలు ఇవ్వాలి: సీఎం
  • గవర్నర్ ప్రసంగంపై సూచనలు, సలహాలు వస్తాయనుకున్నాం: సీఎం
  • ప్రధాన ప్రతిపక్షం నుంచి కనీసం స్పందన రాలేదు: సీఎం
  • గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలను వివరించాం: సీఎం
  • గవర్నర్‌తో చర్చించిన తర్వాతే ప్రసంగాన్ని తయారు చేశాం: సీఎం

8:00 PM, 18 Mar 2026 (IST)

నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు: సీఎం

  • ప్రధాన ప్రతిపక్షం కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందనుకున్నాను: సీఎం
  • రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు పోలేదు: సీఎం
  • ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు: సీఎం
  • నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు: సీఎం
  • సమయం, సందర్భం లేకుండా నచ్చినట్లు మాట్లాడుతున్నారు: సీఎం
  • అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి… అధికారం పీకేసినా అదే అహంకారం: సీఎం
  • కొత్త గవర్నర్‌ను కలవడానికి ప్రతిపక్ష నేత వస్తారనుకున్నాం: సీఎం
  • సభ సాంప్రదాయాలను గౌరవించకపోడం తెలంగాణ సంస్కృతికి విరుద్ధం: సీఎం

7:54 PM, 18 Mar 2026 (IST)

విద్యుత్ శాఖ అధికారులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష

  • విద్యుత్ శాఖ అధికారులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష
  • 19 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌నూ తట్టుకునే నెట్‌వర్క్ సిద్ధం చేయాలన్న భట్టి
  • వేసవికాలం ముగిసే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి: భట్టి విక్రమార్క

7:24 PM, 18 Mar 2026 (IST)

ఈనెల 25 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు నిర్వహణ

  • ఈనెల 25 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు నిర్వహణ
  • ఈనెల 25, 26, 27న స్పోర్ట్స్ స్పెషల్ సెషన్స్ నిర్వహణ
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రోజూ 3 గంటల పాటు క్రీడలు
  • హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న క్రీడాశాఖ
  • సాయంత్రం 5 నుంచి ప్రతిరోజు క్రీడల్లో పాల్గొనేలా ప్రణాళికలు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడల్లో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు
  • అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనేలా అధికారుల ప్రణాళిక

7:24 PM, 18 Mar 2026 (IST)

సిద్దిపేట జిల్లా: మిరుదొడ్డి శివారులో రోడ్డు ప్రమాదం, ఇద్దరు బాలురు మృతి

  • సిద్దిపేట జిల్లా: మిరుదొడ్డి శివారులో రోడ్డు ప్రమాదం
  • ఇద్దరు మృతి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు బాలురు మృతి
  • కారు ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • ఇంటర్‌ విద్యార్థులు కారులో అల్వాల్‌కు వెళ్తుండగా ప్రమాదం
  • ప్రమాదంలో నితిన్ అనే బాలుడు మృతి

6:55 PM, 18 Mar 2026 (IST)

సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మరోసారి పొడిగింపు

  • సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం మరోసారి పొడిగింపు
  • సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం 3 నెలలు పొడిగింపు
  • రామకృష్ణారావు పదవీకాలం పొడిగించాలన్న ప్రభుత్వ వినతికి కేంద్రం అంగీకారం
  • గతేడాది ఏప్రిల్ 30న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావు
  • గతేడాది ఆగస్టు 31నే ముగిసిన రామకృష్ణారావు పదవీవిరమణ గడువు
  • రామకృష్ణారావు పదవీకాలం ఈనెలాఖరు వరకు గతంలోనే పొడిగించిన కేంద్రం

6:54 PM, 18 Mar 2026 (IST)

జగిత్యాల మండలం మోతెలో విషాదం

  • జగిత్యాల మండలం మోతెలో విషాదం
  • జగిత్యాల: అప్పుల బాధతో గడ్డిమందు తాగి సంపత్‌(25) ఆత్మహత్య
  • కుమారుడి మరణం తట్టుకోలేక గుండెపోటుతో తల్లి మల్లవ్వ(60) మృతి

6:09 PM, 18 Mar 2026 (IST)

బ్రిటిష్‌ సంప్రదాయం ప్రకారం గవర్నర్ వ్యవస్థ కొనసాగుతోంది: కూనంనేని

  • బ్రిటిష్‌ సంప్రదాయం ప్రకారం గవర్నర్ వ్యవస్థ కొనసాగుతోంది: కూనంనేని సాంబశివరావు
  • కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ల వల్ల వివాదాలు తలెత్తుతున్నాయి: కూనంనేని సాంబశివరావు
  • బ్రిటిష్‌ కాలం నాటి గవర్నర్‌ వ్యవస్థకు మేము వ్యతిరేకం: కూనంనేని సాంబశివరావు
  • గవర్నర్‌.. కేంద్ర, రాష్ట్రాలకు మధ్య అనుసంధానంగా ఉండాలి: కూనంనేని
  • రాష్ట్ర పరిస్థితిని చూసి ఆర్థికసహాయం గురించి కేంద్రానికి ప్రతిపాదనలు చేస్తే బాగుంటుంది
  • రాష్ట్రప్రభుత్వం భారీగా అప్పులు, బిల్లుల పెండింగ్‌లో చిక్కుకుని ఉంది
  • ఈ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అయినా.. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేదు
  • ఈ ప్రభుత్వం బాగానే పని చేస్తున్నా… ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉంది
  • ప్రజల అసంతృప్తికి కారణాలు తెలుసుకుని ప్రభుత్వం పరిష్కరించాలి
  • నిధుల కొరతే అన్ని సమస్యలకు కారణం… మరి నిధులు ఎలా సమకూర్చుకుంటారు
  • కేంద్రప్రభుత్వం తెలంగాణను అనాథలా వదిలేసింది: కూనంనేని సాంబశివరావు
  • దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ వివక్ష చూపుతోంది: కూనంనేని
  • నిధుల కొరతతో బాధపడుతున్న తెలంగాణకు ఎలాంటి సహాయం చేయట్లేదు
  • కేంద్రం అనేది ఒక మిథ్యా అని ఆనాడు ఎన్టీఆర్‌ అన్నారు
  • ఎక్కడో ఉన్న కేంద్రానికి రాష్ట్రాల సమస్యలు తెలియటం లేదు

5:55 PM, 18 Mar 2026 (IST)

రాష్ట్రంలో శాంతిభద్రతలు కూడా క్షీణించాయి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

  • ప్రజాభవన్‌లోని ప్రజాదర్బార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు వెళ్లారు: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
  • ఆరంభంలో హడావుడి చేశారు కానీ.. సమస్యలు పరిష్కరించలేదు: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
  • హైదరాబాద్‌లో పెరుగుతున్న కాలుష్య సమస్య గురించి ఆలోచించట్లేదు
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు కూడా క్షీణించాయి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
  • పరామర్శకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు
  • హోంశాఖకు మంత్రి లేకపోవటం వల్ల శాంతిభద్రతలు సరిగా లేవు
  • రాష్ట్రంలో హిందువులు, ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

5:54 PM, 18 Mar 2026 (IST)

అక్కను చంపి ముక్కలు చేసి చెరువులో పడేసిన తమ్ముడు

  • రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌ మం. బాటసింగారంలో దారుణం
  • అక్కను చంపి ముక్కలు చేసి చెరువులో పడేసిన తమ్ముడు
  • గతనెల 28న కిరాణదుకాణానికి వెళ్లి కనిపించకుండా పోయిన మహిళ(40)ను సోదరుడే చంపినట్లు దర్యాప్తులో తేల్చిన పోలీసులు
  • మహిళ హత్య కేసులో సోదరుడు పుష్పరామ్‌ను అరెస్టు చేసిన పోలీసులు

5:54 PM, 18 Mar 2026 (IST)

కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తోంది: బీర్ల ఐలయ్య

  • బీసీ నేతను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది బీజేపీ అధిష్ఠానం: బీర్ల ఐలయ్య
  • కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తోంది: బీర్ల ఐలయ్య

5:24 PM, 18 Mar 2026 (IST)

బాటసింగారంలో అక్కను చంపి ముక్కలు చేసి చెరువులో పడేసిన తమ్ముడు

  • రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌ మం. బాటసింగారంలో దారుణం
  • అక్కను చంపి ముక్కలు చేసి చెరువులో పడేసిన తమ్ముడు
  • అక్క ప్రవర్తన సరిగా లేదనే కోపంతో చంపినట్లు సమాచారం
  • కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న మహిళ

5:24 PM, 18 Mar 2026 (IST)

బీజేపీ నేతలు రాష్ట్రానికి నిధులు తేలేకపోయారు: మంత్రి పొన్నం

  • బీజేపీ నేతలు రాష్ట్రానికి నిధులు తేలేకపోయారు: మంత్రి పొన్నం
  • రాష్ట్రానికి నిధులు తేలేని బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు: మంత్రి పొన్నం

5:24 PM, 18 Mar 2026 (IST)

సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత లోక్‌సభలో మాట్లాడిన ఎంపీ చామల

  • సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత లోక్‌సభలో మాట్లాడిన ఎంపీ చామల
  • అగ్రికల్చర్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ చర్చలో మాట్లాడిన ఎంపీ చామల
  • ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది: ఎంపీ చామల
  • కార్పొరేట్లకు రుణాలు మాఫీ చేసి రైతు రుణాలను విస్మరించింది: ఎంపీ చామల
  • విభజనచట్టం ప్రకారం తెలంగాణలో వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేయాలి

5:11 PM, 18 Mar 2026 (IST)

మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్‌ నేతలు

  • జగిత్యాల: జీవన్‌రెడ్డి ఇంటికి వెళ్లిన ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి
  • మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్‌ నేతలు
  • పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన జీవన్‌రెడ్డిని బుజ్జిగిస్తున్న కాంగ్రెస్‌ పెద్దలు
  • అధిష్ఠానం ఆదేశాలతోనే జీవన్‌రెడ్డిని కలిసి చర్చించాను: కత్తి వెంకటస్వామి
  • కాంగ్రెస్‌తో 40 ఏళ్ల అనుబంధమున్న నేతను పార్టీ వదులుకోదు: కత్తి వెంకటస్వామి
  • జీవన్‌రెడ్డి ఎంతో ఆవేదనతో ఉన్నారు, చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు: కత్తి వెంకటస్వామి
  • జీవన్‌రెడ్డి చెప్పిన అంశాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తా: కత్తి వెంకటస్వామి

4:36 PM, 18 Mar 2026 (IST)

డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు ఎల్లుండికి వాయిదా

  • మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి
  • డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు ఎల్లుండికి వాయిదా
  • పైలెట్ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌శర్మను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్
  • తీర్పును ఎల్లుండికి వాయిదా వేసిన ఉప్పరపల్లి కోర్టు

4:35 PM, 18 Mar 2026 (IST)

దిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • దిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
  • శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్న సీఎం
  • నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

4:35 PM, 18 Mar 2026 (IST)

లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్‌ ఎంపీ ప్రద్యుత్‌ బర్దోలాయి

  • లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్‌ ఎంపీ ప్రద్యుత్‌ బర్దోలాయి
  • బీజేపీలో చేరిన నగావ్‌ నియోజకవర్గం ఎంపీ ప్రద్యుత్‌ బర్దోలాయి
  • అసోం అసెంబ్లీ ఎన్నికల్లో దిస్పూర్‌ నుంచి పోటీ చేయనున్న ప్రద్యుత్‌

4:05 PM, 18 Mar 2026 (IST)

హైదరాబాద్‌: వెంగళరావునగర్‌లో ఆక్రమణలు కూల్చుతున్న హైడ్రా

  • హైదరాబాద్‌: వెంగళరావునగర్‌లో ఆక్రమణలు కూల్చుతున్న హైడ్రా
  • డ్రగ్ కంట్రోల్ ఆఫీసు ఎదుట ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలు కూల్చివేత
  • వెంగళరావునగర్‌లో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న సమయంలో స్వల్ప ఉద్రిక్తత

3:10 PM, 18 Mar 2026 (IST)

దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు రిజిస్టర్‌లో వేలిముద్రలు నమోదు చేసిన కవిత

  • దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లిన కల్వకుంట్ల కవిత
  • దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు రిజిస్టర్‌లో వేలిముద్రలు నమోదు చేసిన కవిత
  • సీబీఐ కేసు నుంచి డిశ్చార్జ్ పిటిషన్ల ప్రక్రియ పూర్తికి వేలిముద్రలు వేసిన కవిత
  • దిల్లీ మద్యం కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు అనుమతి ఇస్తూ ఇటీవల కోర్టు తీర్పు
  • రౌస్ అవెన్యూ కోర్టులో వేలిముద్రలు నమోదు చేసి హైదరాబాద్‌కు బయలుదేరిన కవిత

3:09 PM, 18 Mar 2026 (IST)

నాగర్‌కర్నూలు: పొలంలో గంజాయి సాగుచేస్తున్న దంపతులు అరెస్టు

  • నాగర్‌కర్నూలు: పొలంలో గంజాయి సాగుచేస్తున్న దంపతులు అరెస్టు
  • నాగర్‌కర్నూలు: పదర మం. వంకేశ్వరం శివారు పొలంలో గంజాయి సాగు
  • 16 గంజాయి మొక్కలు, 1.8 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

3:08 PM, 18 Mar 2026 (IST)

కల్తీ పన్నీరు తయారీ కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

  • కల్తీ పన్నీరు తయారీ కేంద్రంపై ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
  • హైదరాబాద్‌: 3 వేల కిలోల కల్తీ పన్నీర్‌ను సీజ్ చేసిన పోలీసులు
  • శ్రీ బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్, విజయ్ మిల్క్ కార్డ్ షాపుతో సహా 6 షాపులపై దాడులు
  • శ్రీ బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్‌లో 1,600 కిలోల పన్నీర్‌ను సీజ్ చేసిన అధికారులు
  • విజయ్ మిల్క్ అండ్ కార్డ్ షాప్‌లో వెయ్యి కిలోల కల్తీ పన్నీర్ సీజ్
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పన్నీరు అమ్ముతున్న నిర్వాహకులు

3:07 PM, 18 Mar 2026 (IST)

జగిత్యాల జిల్లా: భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్టు

  • జగిత్యాల జిల్లా: భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్టు
  • కోరుట్ల మం. మాదాపూర్‌లో గర్భిణిని కత్తితో పొడిచి హత్య చేసిన భర్త
  • భార్య వైష్ణవిని కట్నం కోసం కొద్దిరోజులుగా వేధించిన భర్త హరిబాబు
  • సోమవారం రాత్రి భార్య వైష్ణవిని కత్తితో పొడిచి హత్య చేసి పరారైన భర్త హరిబాబు
  • హరిబాబును ఇవాళ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

3:07 PM, 18 Mar 2026 (IST)

జగ్గారెడ్డి భవిష్యత్తులో పీసీసీ అయితే బాగుంటుందని చెప్పాను: మంత్రి కోమటిరెడ్డి

  • మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్‌చాట్
  • జగ్గారెడ్డి పీసీసీగా ఉంటే 100 స్థానాలు వస్తాయన్న వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి
  • మహేష్‌ కుమార్‌గౌడ్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: మంత్రి కోమటిరెడ్డి
  • మహేష్‌గౌడ్ సారధ్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు గెలిచాం: కోమటిరెడ్డి
  • రంజాన్ వేడుకల్లో జగ్గారెడ్డి ఆర్గనైజింగ్‌ చూసి ఆ వ్యాఖ్యలు చేశాను: కోమటిరెడ్డి
  • జగ్గారెడ్డి భవిష్యత్తులో పీసీసీ అయితే బాగుంటుందని చెప్పాను: మంత్రి కోమటిరెడ్డి
  • ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడిని తొలగించాలనేది నా ఉద్దేశం కాదు: కోమటిరెడ్డి
  • ఉద్దేశపూర్వకంగా నాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి కోమటిరెడ్డి

3:07 PM, 18 Mar 2026 (IST)

నాగర్‌కర్నూలు జిల్లా: సింగిల్ విండో మాజీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య

  • నాగర్‌కర్నూలు జిల్లా: సింగిల్ విండో మాజీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య
  • వనపట్లలోని సొంత స్టోన్ క్రషింగ్ మిషన్ ఆఫీసులో ఉరేసుకుని మృతి
  • ఆత్మహత్యకు అప్పుల బాధలే కారణం అంటున్న గ్రామస్థులు

2:00 PM, 18 Mar 2026 (IST)

రాష్ట్రంలో రోజురోజుకు డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుంది: రామచందర్‌రావు

  • నల్గొండ బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన రామచందర్‌రావు
  • రాష్ట్రంలో రోజురోజుకు డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుంది: రామచందర్‌రావు
  • డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేది ఏం లేదు: రామచందర్‌రావు
  • సిట్ అంటేనే కాలయాపన.. ఎలాంటి చర్యలు ఉండవు: రామచందర్‌రావు
  • గత ప్రభుత్వం హయాంలో డ్రగ్స్ కల్చర్ పెరిగింది: రామచందర్‌రావు
  • డ్రగ్స్ నిర్మూలిస్తామన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు.. మాటలకే పరిమితం: రామచందర్‌రావు
  • డ్రగ్స్ రహిత సమాజం కోసం బీజేపీ పూర్తి మద్దతు ఉంటుంది: రామచందర్‌రావు

1:59 PM, 18 Mar 2026 (IST)

రోహిత్‌రెడ్డి తప్పు చేసినందున పార్టీ చర్యలు తీసుకుంది: కేటీఆర్

  • జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌లో అసంతృప్తి ఉన్నట్లుంది: కేటీఆర్
  • జీవన్‌రెడ్డి విషయంలో మేం ఎలాంటి చర్చలు చేయలేదు: కేటీఆర్
  • రోహిత్‌రెడ్డి తప్పు చేసినందున పార్టీ చర్యలు తీసుకుంది: కేటీఆర్
  • రోహిత్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చాం… తాత్కాలికంగా సస్పెండ్ చేశాం: కేటీఆర్
  • టెస్టులకు నేను సిద్ధమని చెప్పా… మరి ఏమైందో: కేటీఆర్
  • ఎప్పుడు ఎక్కడకు రావాలో కేసీఆర్‌కు తెలుసు: కేటీఆర్
  • మమ్మల్నే తట్టుకోవట్లేదు.. ఇక వారికి కేసీఆర్ ఎందుకు?: కేటీఆర్
  • పార్టీ మారి.. ఆ పార్టీ తరఫున పోటీ చేసినా పట్టించుకోవట్లేదు: కేటీఆర్
  • నిషేధిత భూములపై మంత్రి పొంగులేటి ఎందుకు నోరు మెదపట్లేదు?: కేటీఆర్
  • కోటి ఎకరాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి: కేటీఆర్

1:59 PM, 18 Mar 2026 (IST)

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చారు: సీఎం

  • మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చారు: సీఎం
  • స్టేషన్ బెయిల్ ఇవ్వడంలో మా ప్రమేయం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
  • మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై సిట్ వేశాం: సీఎం రేవంత్‌రెడ్డి
  • 2029 లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఉంటాయి: సీఎం రేవంత్‌రెడ్డి
  • మహిళ రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదే: సీఎం రేవంత్‌రెడ్డి

1:58 PM, 18 Mar 2026 (IST)

ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన

  • ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన
  • రాహుల్‌, ప్రియాంకను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
  • వేం నరేందర్‌రెడ్డిని ఇరువురు నేతలకు పరిచయం చేసిన రేవంత్‌రెడ్డి

1:56 PM, 18 Mar 2026 (IST)

ఉత్తర్వు చూపితే రాజీనామాకు సిద్ధమన్న మాటకు కట్టుబడి ఉన్నా: కేటీఆర్

  • రూ. 57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు భట్టి చెప్పారు: కేటీఆర్
  • వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు ఉత్తర్వు చూపిస్తే రాజీనామా చేస్తానన్నాను: కేటీఆర్
  • నేను రాజీనామా చేయాలని మంత్రి సీతక్క అంటున్నారు: కేటీఆర్
  • సీతక్క మాటల్లో అర్థం లేదు: కేటీఆర్
  • ఉత్తర్వు చూపితే రాజీనామాకు సిద్ధమన్న మాటకు కట్టుబడి ఉన్నా: కేటీఆర్
  • సభను తప్పుదోవ పట్టించిన భట్టి రాజీనామా చేయాలా?.. నేను చేయాలా?: కేటీఆర్
  • మూసీ డీపీఆర్ విషయంలో మెుత్తం ప్లేట్ మార్చారు: కేటీఆర్
  • మంత్రుల కంటే అధికారులు ఎక్కువ మాట్లాడుతున్నారు : కేటీఆర్
  • ఆరునూరైనా మూసీ ప్రాజెక్టు చేపడతామని అధికారి ఎలా చెబుతారు? : కేటీఆర్
  • డీపీఆర్ ఉంటే సభలో ప్రవేశపెట్టాలి: కేటీఆర్
  • డీపీఆర్‌ ప్రవేశపెట్టకపోతే శ్రీధర్‌బాబు సభా హక్కుల ఉలంఘన కింద ఫిర్యాదు చేస్తాం: కేటీఆర్
  • ప్రభుత్వం నడుపుతున్న వారు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్
    ప్రణాళిక, డబ్బులు లేకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారు: కేటీఆర్
  • మూసీ, హ్యామ్ రోడ్లలో అవినీతిపై మా ప్రభుత్వం వచ్చాక విచారణ చేపడతాం: కేటీఆర్
    అధికారుల స్థాయికి మించి మాట్లాడుతున్నారు : కేటీఆర్

12:42 PM, 18 Mar 2026 (IST)

హిందువుల ప్రభుత్వంలో హోంమంత్రి అవుతాను: రాకేష్‌రెడ్డి

  • అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డిని పలకరించిన హరీశ్‌రావు
  • 2029లో హోంమంత్రిగా ప్రమాణం చేస్తానని హరీష్‌తో చెప్పిన రాకేష్‌రెడ్డి
  • రాకేష్‌రెడ్డికి ఆల్‌ ది బెస్ట్ చెప్పిన మాజీ మంత్రి హరీశ్‌రావు
  • హిందువుల ప్రభుత్వంలో హోంమంత్రి అవుతాను: రాకేష్‌రెడ్డి
  • ఇదే కాంగ్రెస్ చివరి ప్రభుత్వం: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి
  • హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దు: రాకేష్‌రెడ్డి
  • గతంలో హిందువులు ఏడెనిమిది మందిని కనేవారు: రాకేష్‌రెడ్డి

12:42 PM, 18 Mar 2026 (IST)

శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ శిబిరం
  • వరద మైదానాల జోనింగ్‌పై ప్రాంతీయ స్థాయి శిక్షణ శిబిరం
  • సీడబ్ల్యూసీ, కృష్ణా, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శిబిరం
  • శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  • వరదల నివారణకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీ ఏర్పాటు: మంత్రి ఉత్తమ్
  • వరదల ఉద్ధృతిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు: మంత్రి ఉత్తమ్
  • ఆధునిక పరిజ్ఞానంతో వరదలు అడ్డుకునేందుకు చర్యలు: మంత్రి ఉత్తమ్

12:17 PM, 18 Mar 2026 (IST)

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,61,980

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,61,980
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,44,600
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,61,000

11:52 AM, 18 Mar 2026 (IST)

వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు

  • వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు
  • ఈ-మెయిల్‌ ద్వారా కోర్టుకు బాంబు బెదిరింపు
  • కోర్టు ప్రాంగణం మొత్తం ఖాళీ చేయించిన అధికారులు
  • బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

11:44 AM, 18 Mar 2026 (IST)

డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి

  • డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి
  • అక్రిడిటేషన్ కార్డులు నిజమైన జర్నలిస్టులకు ఇవ్వాలన్నదే మా లక్ష్యం: పొంగులేటి
  • జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం: మంత్రి పొంగులేటి
  • కోర్టుల్లో ఆటంకాలు లేకుండా ఇళ్ల స్థలాల పంపిణీకి యోచన: మంత్రి పొంగులేటి

11:44 AM, 18 Mar 2026 (IST)

ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిసిన మంత్రి తుమ్మల

  • ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిసిన మంత్రి తుమ్మల
  • ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ఆహ్వానించిన తుమ్మల
  • ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

11:43 AM, 18 Mar 2026 (IST)

సికింద్రాబాద్: చిలకలగూడ పీఎస్‌ పరిధిలో యువతి ఆత్మహత్య

  • సికింద్రాబాద్: చిలకలగూడ పీఎస్‌ పరిధిలో యువతి ఆత్మహత్య
  • ఇంటర్ సెకండియర్ చదువుతున్న జెనిమ్మ ఉరేసుకొని ఆత్మహత్య
  • జగదీశ్‌ అనే యువకుడు తమ కుమార్తెను వేధిస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపణ
  • యువతి జెనిమ్మ శరీరంపై గాయాలు ఉన్నట్లు అనుమానం
  • యువతి ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • యువకుడి వేధింపులే జెనిమ్మ ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న పోలీసులు

11:42 AM, 18 Mar 2026 (IST)

మాపై బురదజల్లి తుడుచుకోవాలని బీఆర్‌ఎస్ అంటుంది: శ్రీధర్‌బాబు

  • మాపై బురదజల్లి తుడుచుకోవాలని బీఆర్‌ఎస్ అంటుంది: శ్రీధర్‌బాబు
  • ప్రజల జీవితాల్లో మార్పు చూపెట్టడమే మా లక్ష్యం: శ్రీధర్‌బాబు
  • బీఆర్‌ఎస్ సభ్యులు సత్యదూరపు మాటలు మాట్లాడుతున్నారు: శ్రీధర్‌బాబు
  • బీఆర్‌ఎస్‌ సభ్యుల వైఖరి సరికాదు: మంత్రి శ్రీధర్‌బాబు
  • ఏం మాట్లాడినా బీఆర్‌ఎస్ సభ్యులు రూ.లక్షన్నర కోట్లు అని ఆరోపిస్తున్నారు
  • తొలి దశ డీపీఆర్‌ రూ.6,500 కోట్ల నుంచి 7,000 కోట్లు అని చెప్పినా వారికి అర్థం కాలేదు

11:42 AM, 18 Mar 2026 (IST)

మూసీ పరివాహక ప్రజలు అపరిశుభ్రత వాతావరణంలో జీవిస్తున్నారు: భట్టి

  • మూసీ పరివాహక ప్రజలు అపరిశుభ్రత వాతావరణంలో జీవిస్తున్నారు: భట్టి
  • మూసీ ప్రజల జీవనగతులు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది: భట్టి
  • మూసీ అభివృద్ధి కాకూడదని ప్రతిపక్షం కోరుకుంటుందా?: భట్టి
  • నగరానికి మణిహారంగా మూసీని మార్చాలని ప్రయత్నిస్తున్నాం: భట్టి
  • మూసీ పరివాహక ప్రజలకు పునరావాసం కల్పిస్తామని చెప్పాం
  • మూసీ ప్రజలు మురికికూపంలో బతకాలనేదే ప్రతిపక్షం కోరిక
  • ప్రతిపక్షం తీరు సరికాదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • మూసీలోకి వచ్చే ప్రతినాళాకు ఎస్టీపీ పెట్టి శుద్ధి చేస్తాం: భట్టి
  • ప్రతిపక్షం ఏవైనా మెరుగైన సలహాలు ఇస్తే స్వీకరిస్తాం: భట్టి

11:42 AM, 18 Mar 2026 (IST)

మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్: కేటీఆర్

  • మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్: కేటీఆర్
  • మూసీకి వ్యతిరేకం కాదు.. రూ.లక్ష కోట్ల దోపిడీకి వ్యతిరేకం: కేటీఆర్

11:36 AM, 18 Mar 2026 (IST)

బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పనులు.. చిన్న వరదకే కొట్టుకుపోయాయి

  • బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పనులు.. చిన్న వరదకే కొట్టుకుపోయాయి
  • మురికి కాలువగా ఉన్న జీవనది మూసీని అభివృద్ధి చేయడం తప్పా?
  • మూసీ అభివృద్ధికి ఎందుకు అడ్డుపడుతున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు

10:55 AM, 18 Mar 2026 (IST)

‘హరీశ్‌రావు బీఏసీలో చెప్పిన మాటలను వారి సభ్యులకు చెప్పాలి’

మంత్రి శ్రీధర్‌బాబు

  • హరీశ్‌రావు బీఏసీలో చెప్పిన మాటలను వారి సభ్యులకు చెప్పాలి
  • గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే… బఫర్‌జోన్ నిర్ణయించాం
  • మేం కొత్తగా బఫర్‌జోన్ నిర్ణయించలేదు: మంత్రి శ్రీధర్‌బాబు
  • 2024 డిసెంబర్‌లో మెయిన్‌హార్ట్‌కు డీపీఆర్‌ బాధ్యతలు అప్పగించాం
  • 2026 ఫిబ్రవరిలో మెయిన్‌హార్ట్ సంస్థ డీపీఆర్ అప్పగించింది
  • కేటీఆర్‌ ఆరోపిస్తున్నట్లు మూసీ డీపీఆర్‌ రెండు నెలల్లో పూర్తి కాలేదు
  • వచ్చే ఏడీబీ బోర్డు మీటింగ్‌లో మూసీ ప్రాజెక్టుకు అనుమతి లభించే అవకాశం
  • బీఆర్‌ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ఆపేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది
  • ప్రాజెక్టులను మేము నిలిపేసినట్లు బీఆర్‌ఎస్ ఆరోపించడం సరికాదు
  • ఎస్టీపీలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ హయాంలో 30 శాతం పనులు పూర్తయ్యాయి
  • పెండింగ్‌లో ఉన్న 70 శాతం పనులు మా హయాంలో పూర్తయ్యాయి
  • బీఆర్‌ఎస్ హయాంలో చేసిన పనులు.. చిన్న వరదకే కొట్టుకుపోయాయి
  • మురికి కాలువగా ఉన్న జీవనది మూసీని అభివృద్ధి చేయడం తప్పా?
  • మూసీ అభివృద్ధికి ఎందుకు అడ్డుపడుతున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు

10:45 AM, 18 Mar 2026 (IST)

మూసీ ప్రాజెక్టు తొలి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్‌బాబు

  • మూసీ ప్రాజెక్టు తొలి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్‌బాబు
  • తొలి దశ డీపీఆర్‌ రూ.6,500 నుంచి 7000 కోట్లు: మంత్రి శ్రీధర్‌బాబు
  • మూసీ పునర్నిర్మాణంలో 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం: శ్రీధర్‌బాబు
  • తుది ఎన్యూమరేషన్ కొనసాగుతుంది: మంత్రి శ్రీధర్‌బాబు
  • బఫర్‌జోన్‌లో ఉన్నవారికి టీడీఆర్ ఇస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
  • 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం ఉంటుంది: శ్రీధర్‌బాబు

10:45 AM, 18 Mar 2026 (IST)

మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం ఎవరికీ సంతృప్తిగా లేదు: కేటీఆర్

  • మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం ఎవరికీ సంతృప్తిగా లేదు: కేటీఆర్
  • తొలి దశ రూ.7 వేల కోట్లు అన్నారు.. ఇంకా ఎన్ని దశలు ఉంటాయి?: కేటీఆర్
  • రూ.16 వేల కోట్లయ్యే ప్రాజెక్టుకు సీఎం లక్షన్నర కోట్లు అని చెబుతున్నారు: కేటీఆర్

10:44 AM, 18 Mar 2026 (IST)

‘మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు’

సుధీర్‌రెడ్డి

  • మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు
  • మూసీ అభివృద్ధికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు
  • మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్‌ఎస్ హయాంలో
  • మూసీ పునర్నిర్మాణానికి మా హయాంలో ఒక్క నిర్మాణం కూలగొట్టలేదు

10:44 AM, 18 Mar 2026 (IST)

మూసీ డీపీఆర్‌ తయారుచేసేందుకే 18 నెలలు పడుతుందని జనవరిలో మంత్రి చెప్పారు : కేటీఆర్

  • మూసీ డీపీఆర్‌ తయారుచేసేందుకే 18 నెలలు పడుతుందని జనవరిలో మంత్రి చెప్పారు : కేటీఆర్
  • ఇప్పుడేమో డీపీఆర్‌ పూర్తయిందని మంత్రి చెబుతున్నారు?: కేటీఆర్
  • 18 నెలలు పడుతుందని చెప్పి… రెండు నెలల్లోనే పూర్తి చేశారా?: కేటీఆర్
  • ఒకవేళ డీపీఆర్‌ పూర్తయి ఉంటే.. మా ముందు పెట్టండి: కేటీఆర్
  • డీపీఆర్‌ మాకు ఇంతవరకు అందలేదని ఏడీబీ చెబుతుంది
  • డీపీఆర్‌ తయారుకాకుండా… తయారైందని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు
  • మూసీ డీపీఆర్‌ బాధ్యతలను మెయిన్‌హార్ట్‌కు అప్పగించారు
  • మెయిన్‌హార్ట్ సంస్థపై పాకిస్థాన్‌ ప్రభుత్వం రెడ్‌కార్నర్ నోటీసులు ఇచ్చింది
  • మూసీ పునర్నిర్మాణంలో 1400 నిర్మాణాలు పోతాయని మంత్రి చెబుతున్నారు?
  • మూసీ పునర్నిర్మాణంలో 10 వేల నిర్మాణాలు పోతాయని గెజిట్ చెబుతోంది
  • మంత్రి చెబుతున్నది కరెక్టా?… ప్రభుత్వ గెజిట్‌లో చెబుతున్నది కరెక్టా?

10:26 AM, 18 Mar 2026 (IST)

రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌పై ర్యాష్‌ డ్రైవింగ్

  • రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్‌పై ర్యాష్‌ డ్రైవింగ్
  • అతివేగంగా వచ్చి మూడు కార్లను ఢీకొట్టిన మరో కారు
  • ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్న మూడు కార్లు
  • ప్రమాదానికి కారణమైన కారును ఆపేందుకు యత్నించిన పోలీసులు
  • కార్లను ఢీకొట్టి చాంద్రాయణగుట్టవైపు వెళ్లిన కారు డ్రైవర్
  • కేసు నమోదు చేసిన ట్రాఫిక్ పోలీసులు

10:15 AM, 18 Mar 2026 (IST)

‘మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు అందిస్తున్నాం’

పొన్నం :

  • మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
  • మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నాం: మంత్రి పొన్నం
  • 600 బస్సులకు మహిళలను యజమానులను చేశాం
  • ఈఎంఐలు పోగా మహిళలకు నెలకు రూ.70 వేలు మిగులుతుంది
  • అన్ని బస్‌స్టేషన్లలో రూ.100 కోట్లతో మౌలికవసతులు కల్పించాం: పొన్నం
  • ఏటూరునాగారం, పెద్దపల్లి జిల్లాల్లో బస్‌డిపోలు ఏర్పాటు చేశాం
  • ఆర్టీసీ కార్మికులు మరణిస్తే… రూ.కోటి బీమా ఇచ్చేలా ఒప్పందం
  • పీఎఫ్‌ బకాయిలు రూ.1,355 కోట్లు ఉంటే.. రూ.650 కోట్లకు తగ్గించాం: పొన్నం
  • ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు సాధికారత వచ్చింది

10:15 AM, 18 Mar 2026 (IST)

ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

  • ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
  • కోరుట్ల జనరల్ ఆస్పత్రిలో కనీస పరికరాలు లేవు: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

10:15 AM, 18 Mar 2026 (IST)

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెండేళ్లలో ఓపీల సంఖ్య చాలా పెరిగింది : మధుసూదన్‌రెడ్డి

  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెండేళ్లలో ఓపీల సంఖ్య చాలా పెరిగింది: మధుసూదన్‌రెడ్డి
  • ఔట్‌పేషంట్ల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లను నియమించాలి: మధుసూదన్‌రెడ్డి
  • వైద్యకళాశాలల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాలి
  • మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో కొత్తగా 25 వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

10:13 AM, 18 Mar 2026 (IST)

కొనసాగుతున్న మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు

  • కొనసాగుతున్న మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు
  • అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం

10:13 AM, 18 Mar 2026 (IST)

8 లక్షల ఎకరాల్లో రైతులు మెుక్కజొన్న పండించారు: హరీశ్‌రావు

  • 8 లక్షల ఎకరాల్లో రైతులు మెుక్కజొన్న పండించారు: హరీశ్‌రావు
  • మద్దతు ధర లేక మెుక్కజొన్న రైతులు నష్ట పోతున్నారు: హరీశ్‌రావు
  • వర్షాల కారణంగా రైతులు నష్ట పోయారు: మాజీ మంత్రి హరీశ్‌రావు
  • 25 శాతం పంట దళారుల చేతికి వెళ్తుంది: మాజీ మంత్రి హరీశ్‌రావు
  • పంటల బీమా అమలు చేయట్లేదు: మాజీ మంత్రి హరీశ్‌రావు
  • ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే ఇవ్వాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు
  • మద్దతు ధర రూ.2,400, బోనస్ రూ.500 ఇవ్వాలి: హరీశ్‌రావు

10:13 AM, 18 Mar 2026 (IST)

అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన

  • అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన
  • మొక్కజొన్న సంచులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ నేతలు యత్నం
  • బీఆర్‌ఎస్ సభ్యుల నుంచి మెుక్కజొన్న సంచులు లాక్కునేందుకు యత్నించిన మార్షల్స్
  • బీఆర్ఎస్ సభ్యుల నుంచి మొక్కజొన్న కంకులు లాక్కున్న మార్షల్స్
  • మార్షల్స్ వైఖరిపై మండిపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

9:44 AM, 18 Mar 2026 (IST)

హైదరాబాద్‌: గన్‌పార్కు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన

  • హైదరాబాద్‌: గన్‌పార్కు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన
  • మొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ఆందోళన
  • మొక్క జొన్న రైతుకు మద్దతివ్వాలని ప్లకార్డులు ప్రదర్శించిన బీఆర్‌ఎస్
  • మద్దతు ధరకే మెుక్కజొన్న కొనుగోలు చేయాలంటూ బీఆర్‌ఎస్ నేతల నినాదాలు
  • మొక్కజొన్న పొత్తులు చేత పట్టి నినాదాలు చేసిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు
  • గన్‌పార్కు నుంచి అసెంబ్లీకి ప్రదర్శనగా వెళ్తున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు
  • మొక్కజొన్న సాగుబస్తాలతో అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు

9:44 AM, 18 Mar 2026 (IST)

అవినీతి కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ రాము అరెస్టు

  • అవినీతి కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ రాము అరెస్టు
  • సిరిసిల్లలో పనిచేస్తున్న సమయంలో రాము అవినీతికి పాల్పడినట్లు గుర్తింపు
  • అధికారులకు ఆధారాలు లభించడంతో రామును అరెస్టు చేసిన ఏసీబీ

9:43 AM, 18 Mar 2026 (IST)

విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల బకాయిలపై బీజేపీ వాయిదా తీర్మానం

  • విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల బకాయిలపై బీజేపీ వాయిదా తీర్మానం
  • ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల బకాయిలపై అసెంబ్లీలో బీజేపీ వాయిదా తీర్మానం

9:43 AM, 18 Mar 2026 (IST)

భద్రాద్రి: పినపాక మండలం దుగినేపల్లి వద్ద ప్రమాదం

  • భద్రాద్రి: పినపాక మండలం దుగినేపల్లి వద్ద ప్రమాదం
  • కూలీలతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొని ఏడుగురికి గాయాలు

9:43 AM, 18 Mar 2026 (IST)

మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం

  • మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం
  • ఉభయసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్‌ఎస్
  • మెుక్కజొన్న రైతులకు మద్దతుగా ప్రదర్శన చేపట్టనున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు
  • గన్‌పార్కు నుంచి అసెంబ్లీకి ప్రదర్శనగా వెళ్లనున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు

8:18 AM, 18 Mar 2026 (IST)

హనుమకొండ: కడపికొండ రాజీవ్‌గృహకల్పలో తండ్రి, కుమార్తె మృతి

  • హనుమకొండ: కడపికొండ రాజీవ్‌గృహకల్పలో తండ్రి, కుమార్తె మృతి
  • మంటల్లో సజీవ దహనమైన తండ్రి రాజశేఖర్(54), కుమార్తె రాజశ్రీ(24)
  • కుటుంబకలహాలతో భార్య, మామను అల్లుడే చంపినట్లు సమాచారం

8:17 AM, 18 Mar 2026 (IST)

నిర్మల్: బాసర ఆర్జీయూకేటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

  • నిర్మల్: బాసర ఆర్జీయూకేటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
  • రాత్రి నుంచి వీసీ ఇంటి వద్ద బైఠాయించిన టీఎస్ఏఎస్ సంఘం విద్యార్థులు
  • తేజస్విని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్
  • తేజస్విని మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు ఆరోపణ
  • డిమాండ్‌లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదన్న విద్యార్థులు

8:17 AM, 18 Mar 2026 (IST)

నేడు మూడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

  • నేడు మూడోరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న ఉభయ సభలు
  • గిడ్డంగుల కార్పొరేషన్ సంబంధించి 2019-20 ఆర్థిక ఏడాది వార్షిక నివేదికపై చర్చ
  • వార్షిక నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
  • గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ

6:40 AM, 18 Mar 2026 (IST)

హైదరాబాద్‌లోని పలు చోట్ల కురిసిన వర్షం

  • హైదరాబాద్‌లోని పలు చోట్ల కురిసిన వర్షం
  • జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్, అమీర్‌పేట్‌లో కురిసిన వర్షం
  • పంజాగుట్ట, రహమత్ నగర్, యూసుఫ్ గూడాలో కురిసిన వర్షం
  • బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్ , పరిసరాల ప్రాంతాల్లో వర్షం
  • కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్‌లో వర్షం
  • హైదర్‌నగర్, ప్రగతినగర్, బాచుపల్లి, ప్రాంతాల్లో వర్షం
  • మియాపూర్, చందానగర్, లింగంపల్లిలో కురిసిన వర్షం
  • గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపుర్, రాయదుర్గం ప్రాంతాల్లో వర్షం

6:39 AM, 18 Mar 2026 (IST)

టేకులపల్లి రహదారి వద్ద అర్ధరాత్రి టిప్పర్ దగ్ధం

  • భద్రాద్రి: టేకులపల్లి రహదారి వద్ద అర్ధరాత్రి టిప్పర్ దగ్ధం
  • ఇల్లందు-టేకులపల్లి ప్రాంతంలోని రోళ్లపాడు అటవీప్రాంతంలో టిప్పర్ దగ్ధం
  • టిప్పర్‌లో డ్రైవర్‌ లేకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు
  • భద్రాద్రి: మంటల ధాటికి రెండువైపులా నిలిచిపోయిన ట్రాఫిక్

6:39 AM, 18 Mar 2026 (IST)

ఎల్‌పీజీ గ్యాస్ కొరతపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

  • ఎల్‌పీజీ గ్యాస్ కొరతపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
  • హోటళ్లు, వ్యాపారాలపై ఎల్‌పీజీ గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం
  • పైప్డ్ గ్యాస్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని కేంద్ర ప్రభుత్వం సూచన
  • పరిస్థితులు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని కేంద్రం వెల్లడి
  • అయినప్పటికీ గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేస్తున్నట్లు వెల్లడి

6:38 AM, 18 Mar 2026 (IST)

నేడు దిల్లీలో మంత్రి సీతక్క పర్యటన

  • నేడు దిల్లీలో మంత్రి సీతక్క పర్యటన
  • దిల్లీలో నేడు రాహుల్‌గాంధీ అధ్యక్షతన ఆదివాసి కాంగ్రెస్ కౌన్సిల్ సమావేశం
  • ఆదివాసి కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న మంత్రి సీతక్క
  • కౌన్సిల్ అడ్వైజరీ మెంబర్‌గా నియమితులైన మంత్రి సీతక్క



Source link

Spread the love