why2fight |పంచాంగ శ్రవణంలో ట్రంప్ కి పంచ్. – ఆంధ్రప్రభ | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు మరియు LIVE Updates | ఏపీ, తెలంగాణల్లో బ్రేకింగ్ న్యూస్


ఎందుకు2 ఫైట్ | అధ్యక్షుడి ఆత్మశోధనకిదే సమయం
అమెరికన్లలో పెరుగుతున్న ఆవేదన
యుద్ధాలపై ప్రజల అసంతృప్తి
ఇరాన్ ఎదురుదెబ్బ… ట్రంప్‌కు సవాల్
అహంభావం vs వాస్తవం

ఎందుకు2 ఫైట్ | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒక దేశాధ్యక్షుడి పనేంటి? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? అవును…ఇప్పుడు అమెరికన్లందరూ అదే ప్రశ్నను తమలో తామే వేసుకుంటున్నారట. ఎందుకో తెలుసా? తామందరూ కలిసి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ని ఎన్నుకున్నది ఎందుకని? అంటే, తమని పరిపాలించడానికా, లేక ప్రపంచ దేశాలను రెచ్చగొట్టి, కయ్యానికి కాలు దువ్వి, లొంగదీసుకునిఆక్రమించుకుని దేశాలను సుంకాలతో బెదిరించిస్నేహ సంబంధాలను దెబ్బదీయడానికా అని. అవును మరి వారి ఆవేదనలో అర్థం ఉంది.

పాలన గాలికొదిలేసి, ప్రజల నుంచి పన్నుల రూపేణా వచ్చిన సొమ్మంతా యుద్ధాల పేరుతో తగలబెడుతూంటే ఏ దేశ ప్రజలు మాత్రం హర్షిస్తారు? ఇప్పుడే దేశ ప్రజల యుద్ధాలను కోరుకోవడం లేదు. అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు, మెరుగైన జీవన విధానం—ఇవి అందించిన పాలకుడే నిజమైన సమర్థుడు. ఏ దేశ ప్రజలకైనా.

ఎందుకు 2 పోరాటం
ఎందుకు 2 పోరాటం

అన్నింటినీ వదిలేసి, అభివృద్ధిని అవతలికి విసిరేసిఆయుధాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న ట్రంప్ కి ఇరాన్ రూపంలో గట్టి దెబ్బ తగిలింది. ట్రంప్ లోని అహంభావం, ఇగోకి ఇరాన్ తగ్గేదెలే అంటూ దృఢంగా ఎదురు నిలిచి పోరాడుతోంది. అయినా మేకపోతు గాంభీర్యంతో ముందుకే అంటోన్న ట్రంప్ కి ఎవరు చెప్పాలి? పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి?

ట్రంప్ పంచాంగ శ్రవణం కోసం బుద్ధిగా కూర్చుంటేఅయ్యవారు ట్రంప్ లోని అవలక్షణాలను పరోక్షంగా ఎత్తిచూపుతున్నట్లు ఈ కార్టూన్ ఒక వ్యంగ్య అద్దంఒక బలమైన సందేశంగా నిలుస్తోంది.

మరిన్ని కార్టూన్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని ఫంటూన్‌లను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Spread the love