గద్దర్ అవార్డ్స్ సావనీర్‌ను ఆవిష్కరించిన భట్టి విక్రమార్క, చిరంజీవి


LIVE FEED

7:47 PM, 19 Mar 2026 (IST)

తెలంగాణ గద్దర్‌ అవార్డుల వేడుకకు హాజరైన చిరంజీవి, నాగార్జున

  • తెలంగాణ గద్దర్‌ అవార్డుల వేడుకకు హాజరైన చిరంజీవి, నాగార్జున
  • గద్దర్ అవార్డ్స్ సావనీర్‌ను ఆవిష్కరించిన భట్టి విక్రమార్క, చిరంజీవి
  • విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
  • విజేతలకు చిరంజీవి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం
  • విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తున్న భట్టి విక్రమార్క, జూపల్లి

7:17 PM, 19 Mar 2026 (IST)

ప్రభుత్వ విప్‌లుగా ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌

  • శాసనమండలిలో ఇద్దరు విప్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  • ప్రభుత్వ విప్‌లుగా ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌
  • శాసనసభలో ముగ్గురిని ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు
  • శాసనసభలో ప్రభుత్వ విప్‌లుగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేముల వీరేశం
  • శాసనసభలో ప్రభుత్వ విప్‌గా చింతకుంట విజయరమణారావు నియామకం

6:30 PM, 19 Mar 2026 (IST)

హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం, తరలివచ్చిన సినీప్రముఖులు

  • హైదరాబాద్‌: హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
  • ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
  • గద్దర్ అవార్డుల వేడుకకు తరలివచ్చిన సినీప్రముఖులు, నటులు
  • గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శనలు
  • విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
  • విజేతలకు చిరంజీవి, కమల్‌హాసన్‌ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం

6:30 PM, 19 Mar 2026 (IST)

హైదరాబాద్‌: ఎల్బీనగర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం

  • హైదరాబాద్‌: ఎల్బీనగర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం
  • ఎల్బీనగర్‌లో ఉద్రిక్తంగా మారిన ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్‌’
  • కాంగ్రెస్‌ నేతలకు వైట్ ఛాలెంజ్ విసిరిన ఎల్బీనగర్ బీఆర్‌ఎస్ నేతలు
  • బీఆర్‌ఎస్‌ నేతల ఛాలెంజ్‌ స్వీకరించి ఎల్బీనగర్‌కు చేరుకున్న కాంగ్రెస్‌ నేతలు
  • ఎల్బీనగర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు
  • వైట్ ఛాలెంజ్‌ విసిరి ఎల్బీనగర్‌కు వెళ్లిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర నేతలు
  • ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
  • పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ శ్రేణులు
  • పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట

6:30 PM, 19 Mar 2026 (IST)

సంగారెడ్డిలో కిడ్నాప్‌పై వస్తున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేసిన డీఎస్పీ

  • సంగారెడ్డిలో కిడ్నాప్‌పై వస్తున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేసిన డీఎస్పీ
  • మీడియా సమావేశంలో కిడ్నాప్‌ వివరాలు వెల్లడించిన డీఎస్పీ సత్తయ్య గౌడ్
  • ఆటోలో మామిడి కొమ్మలకు వెళ్తున్న వారికి, చిన్నారులకు మధ్య వాగ్వాదం: డీఎస్పీ
  • తమను కిడ్నాప్ చేస్తారేమోనని ఓ బాలుడు భావించినట్టు డీఎస్పీ సత్తయ్యగౌడ్‌ వెల్లడి
  • కిడ్నాప్‌ చేస్తారని భయపడి వారిపై చిన్నారులు రాళ్లు రువ్వినట్లు తెలిపిన డీఎస్పీ
  • సెలవుల నేపథ్యంలో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని డీఎస్పీ సూచన

4:57 PM, 19 Mar 2026 (IST)

డిమాండ్ బాగా ఉండి లాభాలు బాగా వచ్చే పంటల వైపు రైతులు మళ్లాలి: మంత్రి తుమ్మల

  • నేను ఏ పార్టీలో ఉన్నా.. రైతుల సంక్షేమం గురించే ఆలోచిస్తాను: మంత్రి తుమ్మల
  • రైతులు పంటల వైవిధ్యం గురించి మరింత ఆలోచించాలి: మంత్రి తుమ్మల
  • డిమాండ్ బాగా ఉండి లాభాలు బాగా వచ్చే పంటల వైపు రైతులు మళ్లాలి: మంత్రి తుమ్మల
  • ఆయిల్‌పామ్‌ను మరింత ప్రోత్సహించాలని కేంద్రాన్ని కూడా అడిగాను
  • పామాయిల్‌ దిగుమతిపై పన్ను పెంచితే.. దేశంలోని రైతులకు మేలు కలుగుతుందని చెప్పాను
  • ఆయిల్‌ రిఫైనరీకి కూడా రేపు శంకుస్థాపన చేస్తున్నాం: మంత్రి తుమ్మల

4:57 PM, 19 Mar 2026 (IST)

సిద్దిపేట జిల్లా: నర్మెటలో పామాయిల్‌ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత

  • సిద్దిపేట జిల్లా: నర్మెటలో పామాయిల్‌ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
  • పామాయిల్‌ ఫ్యాక్టరీ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు
  • ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలో స్టాల్స్‌ ఏర్పాటు సందర్భంగా వివాదం
  • పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ శ్రేణులు
  • సిద్దిపేట జిల్లా: నర్మెటలో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు

3:26 PM, 19 Mar 2026 (IST)

నా కొత్త పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోంది: కవిత

  • నా కొత్త పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోంది: కవిత
  • మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తా: కవిత
  • పార్టీ ప్రారంభించినప్పుడే అజెండా, లక్ష్యాలు ప్రకటిస్తా: కవిత
  • డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం ఉంటుంది: కవిత
  • కొత్త రాజకీయాలు చేస్తాం…సంకీర్ణ, రెయిన్‌బో రాజకీయాలు అవసరం: కవిత
  • భావసారూప్యత కలిగిన వారు, కలిసి వచ్చేవారితో కలిసి పోరాటం చేస్తాం: కవిత
  • బీఆర్ఎస్‌తో నా అంశాన్ని రేవంత్‌రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నారు: కవిత
  • పార్టీ ప్రకటనకు ముందే జాతీయ నేతలను కలిసే అంశాన్ని ఆలోచిస్తున్నా: కవిత
  • పార్టీ కార్యాలయం కోసం అనువైన స్థలాన్ని అన్వేషిస్తున్నాం: కవిత
  • అన్ని జిల్లాల్లో మా పార్టీ ప్రభావం ఉంటుంది: కవిత
  • యువత, మహిళలు, ఉద్యమంలో పనిచేసిన వారికి అవకాశం ఇస్తాం: కవిత

2:27 PM, 19 Mar 2026 (IST)

111 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడాయిల్ ధర

  • స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం
  • స్టాక్‌మార్కెట్లపై ప్రభావం చూపించిన క్రూడాయిల్ ధరలు
  • గ్యాస్, చమురు క్షేత్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో తీవ్ర ప్రభావం
  • సరఫరాలో అంతరాయాల నేపథ్యంలో 111 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడాయిల్ ధర

2:27 PM, 19 Mar 2026 (IST)

మహబూబాబాద్: కంబాలపల్లి శివారులో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

  • మహబూబాబాద్: కంబాలపల్లి శివారులో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
  • కుటుంబ కలహాలతో భార్య విజయపై కత్తితో దాడి చేసిన భర్త నరేష్
  • భర్త దాడిలో భార్య విజయకు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
  • మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలింపు

1:29 PM, 19 Mar 2026 (IST)

సంగారెడ్డి జిల్లాలో కిడ్నాపర్లను తరిమికొట్టిన చిన్నారులు

  • సంగారెడ్డి జిల్లాలో కిడ్నాపర్లను తరిమికొట్టిన చిన్నారులు
  • ఆటోలో వచ్చిన ముగ్గురు కిడ్నాపర్లను రాళ్లతో తరిమికొట్టిన చిన్నారులు
  • మైదానంలో ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేసేందుకు యత్నం
  • చిన్నారులు ప్రతిఘటించడంతో పారిపోయిన కిడ్నాపర్లు
  • సంగారెడ్డి: ఐకమత్యంగా ఉండటంతో చిన్నారులందరూ క్షేమం
  • సీసీ కెమెరాల ద్వారా దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు

1:29 PM, 19 Mar 2026 (IST)

ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,51,000

  • ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,51,000
  • ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,38,920
  • ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ.2,42,000

12:20 PM, 19 Mar 2026 (IST)

ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరం: సీఎం

  • ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరం: సీఎం
  • ఉగాది ప్రధానంగా రైతుల పండుగ: సీఎం రేవంత్‌రెడ్డి
  • రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం: సీఎం
  • రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం : సీఎం
  • రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది: సీఎం
  • రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే: సీఎం
  • రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశాం: సీఎం
  • రైతులు ఆత్మగౌరవంతో బతకేందుకు ప్రభుత్వం కృషి చేసింది: సీఎం
  • రైతుభరోసా ద్వారా ఇప్పటికే రైతులకు రూ.18 వేల కోట్లు ఇచ్చాం: సీఎం
  • ఈనెల 22 నుంచి మళ్లీ రైతుభరోసా కార్యక్రమం ప్రారంభమవుతుంది: సీఎం
  • రైతుల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది: సీఎం

12:19 PM, 19 Mar 2026 (IST)

భద్రాద్రి: జూలూరుపాడులో 105 కిలోల గంజాయి, కారు స్వాధీనం

  • భద్రాద్రి: జూలూరుపాడులో 105 కిలోల గంజాయి, కారు స్వాధీనం
  • గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

12:19 PM, 19 Mar 2026 (IST)

పాకిస్థాన్‌: కరాచీలో వరద బీభత్సం, 19 మంది మృతి

  • పాకిస్థాన్‌: కరాచీలో వరద బీభత్సం, 19 మంది మృతి
  • పాకిస్థాన్‌: భారీ వర్షం, ఈదురుగాలుల వల్ల 19 మంది మృతి
  • పాకిస్థాన్‌: మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • మావచ్ గోత్ ప్రాంతంలో కూలిన రెండంతస్తుల భవనం

12:07 PM, 19 Mar 2026 (IST)

కవిత కొత్త పార్టీ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి దిల్లీ హైకోర్టు సూచన

  • పార్టీ నమోదు వ్యవహారంలో కవితకు దిల్లీ హైకోర్టులో ఊరట
  • కవిత కొత్త పార్టీ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచన
  • ‘తెలంగాణ ప్రజా జాగృతి’పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచన
  • కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో కోర్టుకు చెప్పిన ఈసీ
  • లోపాలన్నీ సరిచేసినట్లు కోర్టుకు తెలిపిన కవిత తరఫు న్యాయవాదులు
  • సాంకేతిక తప్పులు సరిచేసి ఈసీకి మళ్లీ దరఖాస్తు చేశామన్న కవిత లాయర్లు
  • కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకుంటామన్న ఈసీ
  • ఈసీ త్వరగా నిర్ణయం తీసుకుంటామనడంతో విచారణ ముగించిన దిల్లీ హైకోర్టు

12:07 PM, 19 Mar 2026 (IST)

అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు సరికాదు: బండి సంజయ్

  • అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు సరికాదు: బండి సంజయ్
  • వందేమాతరం ఆలపిస్తుండగా ఎంఐఎం సభ్యులు వెళ్లిపోయారు: బండి సంజయ్
  • కేంద్రం ఆదేశాలను ఎంఐఎం ఎమ్మెల్యేలు ధిక్కరించారు: బండి సంజయ్
  • ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు తప్పని కూడా స్పీకర్ చెప్పలేని పరిస్థితి: సంజయ్
  • ఎంఐఎం ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి: బండి సంజయ్
  • దేశంలో ఉండాలంటే అందరూ వందేమాతరం ఆలపించాల్సిందే: బండి సంజయ్
  • అసదుద్దీన్‌ ఒవైసీ నడిపే కళాశాలల్లో ఉగ్రమూలాలు ఉన్నాయి: బండి సంజయ్

12:06 PM, 19 Mar 2026 (IST)

చైనాలో భారత రాయబారిగా విక్రమ్ కె.దొరైస్వామి నియామకం

  • చైనాలో భారత రాయబారిగా విక్రమ్ కె.దొరైస్వామి నియామకం
  • విక్రమ్ కె.దొరైస్వామిని నియమించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటన
  • ప్రస్తుతం యూకేలో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న విక్రమ్ కె.దొరైస్వామి

12:06 PM, 19 Mar 2026 (IST)

హైదరాబాద్‌: రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు

  • హైదరాబాద్‌: రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు
  • భాష, సంస్కృతి, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో వేడుకలు
  • శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం
  • జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలు ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • ఉగాది సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి వేదాశీర్వచనం చేసిన పండితులు
  • నూతన పంచాంగం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  • వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి, భట్టి, పొంగులేటి, జూపల్లి, పొన్నం, కొండా సురేఖ
  • వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
  • ఉగాది వేడుకల్లో పాల్గొన్న పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ వేంనరేందర్‌రెడ్డి
  • రవీంద్రభారతిలో డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగ ప్రవచనం
  • హైదరాబాద్‌: రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గంటలకు కవి సమ్మేళనం

11:28 AM, 19 Mar 2026 (IST)

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు
ఉగాది వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు

11:26 AM, 19 Mar 2026 (IST)

హైదరాబాద్‌: రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు

  • హైదరాబాద్‌: రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు
  • భాష, సంస్కృతి, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో వేడుకలు
  • శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం
  • జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలు ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
    ఉగాది సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి వేదాశీర్వచనం చేసిన పండితులు
  • నూతన పంచాంగం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  • పంచాంగకర్త బాచంపల్లి సంతోష్‌కుమార్‌ను సన్మానించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి, భట్టి, పొంగులేటి, జూపల్లి, పొన్నం, కొండా సురేఖ
  • వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
  • ఉగాది వేడుకల్లో పాల్గొన్న పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ వేంనరేందర్‌రెడ్డి
  • రవీంద్రభారతిలో డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగ ప్రవచనం
    హైదరాబాద్‌: రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గంటలకు కవి సమ్మేళనం

11:05 AM, 19 Mar 2026 (IST)

హైదరాబాద్‌: రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు

  • హైదరాబాద్‌: రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు
  • భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు
  • శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం
  • జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలు ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి, భట్టి, జూపల్లి, పొన్నం, కొండా సురేఖ
  • వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
  • రవీంద్రభారతిలో డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగ ప్రవచనం
  • హైదరాబాద్‌: రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గంటలకు కవి సమ్మేళనం

11:04 AM, 19 Mar 2026 (IST)

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు

  • హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు
  • ఉగాది వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు

10:30 AM, 19 Mar 2026 (IST)

ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు ‘ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు’

  • సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మంత్రి తుమ్మల
  • ప్రజా పాలనలో రైతు ఉత్సవాలకు రేవంత్‌, భట్టిని ఆహ్వానించిన తుమ్మల
  • ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు ‘ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు’
  • ఈనెల 22న ‘రైతు ఉత్సవాలు’ వేదిక నుంచే రైతుభరోసా నిధులు విడుదల

10:28 AM, 19 Mar 2026 (IST)

కవిత పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ చేపట్టనున్న దిల్లీ హైకోర్టు

  • ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరిట కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ
  • పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసి గుర్తు కేటాయించాలని ఈసీకి కవిత దరఖాస్తు
  • తన పార్టీ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని దిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్
  • కవిత దరఖాస్తులో లోపాలు ఉన్నాయని తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
  • కవిత పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ చేపట్టనున్న దిల్లీ హైకోర్టు

10:28 AM, 19 Mar 2026 (IST)

శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

  • శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
  • భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయం తరఫున సీఎంకు ఆహ్వానం
  • బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ
  • సీఎంను ఆహ్వానించిన దేవాయశాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో
  • ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
  • ఈనెల 27న భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవం

10:27 AM, 19 Mar 2026 (IST)

ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్

  • ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్
  • తెలుగుప్రజల ఆత్మీయపండగ ఉగాది: పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్
  • ప్రతి ఇంటా ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యాలు ఉండాలి: పీసీసీ చీఫ్‌
  • కొత్త ఆరంభాలకు ఉగాది ప్రతీక: పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్
  • ప్రజల ఆశయాలు నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది: పీసీసీ చీఫ్‌

10:26 AM, 19 Mar 2026 (IST)

సిద్దిపేట: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన

  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
  • హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం పూజలు
  • ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు పరిశీలించిన మంత్రి పొన్నం
  • ఎల్లమ్మ చెరువు పనులు వేగవంతం చేయాలని సూచించిన మంత్రి పొన్నం

10:25 AM, 19 Mar 2026 (IST)

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు

  • భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు
  • సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామికి ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు
  • భద్రాచలంలో ఉదయం నుంచి భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ
  • భద్రాచలంలో ఇవాళ్టి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

10:25 AM, 19 Mar 2026 (IST)

ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

  • ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
  • మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచి విజయం సాధించాలి: కేసీఆర్
  • రాష్ట్రం పునర్వైభవాన్ని సంతరించుకుని, ప్రగతి పథంలో పయనించాలి: కేసీఆర్
  • రైతు నామ సంవత్సరంగా ఉగాది ప్రత్యేకతను సంతరించుకొంది: కేసీఆర్

7:02 AM, 19 Mar 2026 (IST)

డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

  • డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా
  • తీర్పును రేపటికి వాయిదా వేసిన ఉప్పరపల్లి కోర్టు
  • మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై నిన్న వాదనలు పూర్తి
  • పైలట్ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌శర్మను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్

7:01 AM, 19 Mar 2026 (IST)

‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ

  • ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ
  • రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘానికి గత నెల అప్లికేషన్ పెట్టిన కవిత
  • అదేరోజు కల్వకుంట్ల కవితకు రిప్లై ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
  • ఈసీ స్పందించే ముందే దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కవిత
  • తన పార్టీని రిజిస్టర్ చేసి గుర్తు కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
  • కవిత పిటిషన్‌పై ఫిబ్రవరి 27న విచారణ జరిపి నేటికి వాయిదా వేసిన హైకోర్టు
  • అప్లికేషన్‌లో కొన్ని లోపాలు గుర్తించినట్లు హైకోర్టుకు తెలిపిన ఈసీ
  • అదే విషయాన్ని కవితకు కూడా తెలియజేసినట్లు కోర్టుకు తెలిపిన ఈసీ

6:48 AM, 19 Mar 2026 (IST)

రేపు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

  • రేపు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం
  • రేపు ఉ.9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్‌ సమావేశం
  • సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
  • రేపు మ.12 గం.కు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క
  • రేపు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు

6:47 AM, 19 Mar 2026 (IST)

తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

  • తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
  • ఆలయంలో బంగారు వాకిలి చెంతకు సర్వభూపాల వాహనంపై రానున్న మలయప్పస్వామి
  • మరో పల్లకిపై శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు విష్వక్సేనుల వేంచేపు
  • ఉత్సవమూర్తులకు నివేదనలు, పూజల తర్వాత నూతన వస్త్రాల సమర్పణ
    తిరుమల: అనంతరం పంచాంగ శ్రవణం చేయనున్న సిద్ధాంతి

6:46 AM, 19 Mar 2026 (IST)

నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

  • నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
  • ఇవాళ ఉగాది సందర్భంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా మిథిలా మండపంలో సీతారామ కల్యాణోత్సవం
  • భద్రాచలం: ఏప్రిల్‌ 2 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు



Source link

Spread the love