Telangana Budget 2026 Live: నేడు తెలంగాణ బడ్జెట్. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశం. ఇవీ ప్రత్యేకతలు | తెలంగాణ వార్తలు


తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో వారి ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, రైతుల సపోర్ట్, మహిళలకు సాయం… అన్నీ ఒకే రోజులో నిర్ణయమయ్యే రోజు ఈ రోజు. నేడు మార్చి 20, 2026 నాడు తెలంగాణ బడ్జెట్ 2026-27ని ప్రవేశపెట్టే రోజు. ఉదయం 9.30 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. అక్కడ ఆమోదం తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. హైదరాబాద్‌, తెలంగాణలో ఉన్న మనకు ఇది ఎంతో ముఖ్యమైనది. ఒక సంవత్సరం పాటూ.. మన జీవితాలపై ఇది ప్రభావం చూపిస్తుంది. అలాగే తెలంగాణ అభివృద్ధికి కూడా ఈ బడ్జెట్ కీలకమైనది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ హామీలు, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు, రైతు సహాయం మధ్య బ్యాలెన్స్ చేసిందా? అన్ని వర్గాలకూ మేలు చేసిందా అనేది మనం ఇవాళ గమనిద్దాం. ఇక్కడ ప్రతీక్షణం లైవ్‌లో అన్నీ తెలుసుకుందాం.

నేడు బడ్జెట్ షెడ్యూల్ ఏమిటి?:

ఈ రోజు ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇక్కడే బడ్జెట్ ఆమోదం అవుతుంది. తర్వాత కచ్చితంగా మధ్యాహ్నం 12 గంటలకు లెజిస్లేటివ్ అసెంబ్లీలో డెప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ స్పీచ్ చేస్తారు. అదే సమయంలో శాసన మండలిలో లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు టేబుల్ చేస్తారు. ఈ సెషన్ మార్చి 30 వరకు కొనసాగుతుంది. ఇది బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం.

బడ్జెట్ మొత్తం ఎంత? 3.25 లక్షల కోట్లు!:

గత 2025-26 బడ్జెట్ 3.04 లక్షల కోట్లు. ఇప్పుడు 6.5% పెరిగి దాదాపు 3.25 లక్షల కోట్లకు చేరిందని అంచనా. అసలు లెక్క ఎంతో.. ప్రవేశపెట్టాక తెలుస్తుంది. రెవెన్యూ, ట్యాక్స్ కలెక్షన్, సెంట్రల్ గ్రాంట్స్ ఆధారంగా బడ్జెట్ అంచనాలు వేశారు. ఐతే.. ఆర్థిక సమస్యలు బాగా ఉన్నాయి. జనవరి వరకు 69,148 కోట్లు ఆర్థిక లోటు ఉంది. వచ్చే ఆదాయంలో.. రుణాలకు వడ్డీ, శాలరీలకే 40% ఖర్చు అవుతోంది. అయినా ప్రభుత్వం ఇన్‌ఫ్రా + వెల్ఫేర్ మధ్య బ్యాలెన్స్ చేస్తోందని ది హిందూ తెలిపింది.

కీలక రంగాలు & కేటాయింపులు ఏమిటి?:

సీఎం రేవంత్ రెడ్డి “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ ప్రకారం రాష్ట్రాన్ని 3 ఎకానమిక్ రీజియన్లుగా విభజించారు. అవి CURE (కోర్ అర్బన్), PURE (పెరి అర్బన్), RARE. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది.

ఇన్‌ఫ్రా ఫోకస్ (ప్రధానం):

– హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ (ఏప్రిల్ 1 నుంచి గవర్నమెంట్ ఆపరేషన్ తీసుకుంటుంది).

– మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ (ఏప్రిల్‌లో పనులు మొదలవుతాయి).

– రీజినల్ రింగ్ రోడ్ (RRR).

– హైదరాబాద్ సిటీ లిమిట్స్ ORR వరకు విస్తరణ, కొత్త మున్సిపల్ కార్పొరేషన్లైన సైబరాబాద్, మల్కాజ్‌గిరిపై ఫోకస్.

– ఇరిగేషన్ ప్రాజెక్టులు 3 సంవత్సరాల్లో పూర్తి చేసేలా ప్లాన్ ఉంది.

వెల్ఫేర్ & ఆరు హామీలు:

– చేయూత పెన్షన్లు పెంచుతారనే అంచనా ఉంది. ఇది వృద్ధులు, వితంతువులు, సింగిల్ మహిళలు, నేతన్నలకు మంచిది.

– రైతు భరోసా – ఖరీఫ్ 2026 & రబీ 2027 ఇన్‌స్టాల్‌మెంట్లకు రూ.18,000 కోట్లు అవసరం.

– మహాలక్ష్మి పథకం కొనసాగింపు.. మహిళలకు నెలకు ₹2,500 ఇస్తారా?

– యువతకు జాబ్ క్యాలెండర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పారా అథ్లెట్లకు ఇన్సెంటివ్స్ వంటివి కీలకం.

ఇతరాలు:

– ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్‌పోర్ట్‌లో ఇన్‌ఫ్రా.

– టెంపుల్ పూజారుల శాలరీలు పెంపు వంటివి చర్చల్లో ఉన్నాయి.

ప్రభుత్వం ముందున్న సవాళ్లు:

– రుణాలు పెరగడంతో వడ్డీ భారం ప్రజలపై పన్నుల రూపంలో పడవచ్చు.

– సెంట్రల్ ఫండ్స్ రాకపోతే ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు.

– వెల్ఫేర్‌కు ఎక్కువ ఖర్చు అయితే ఇన్‌ఫ్రా తగ్గుతుందా?

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఈ బడ్జెట్‌ని ప్రవేశపెడుతోంది. మరో 2 ఏళ్లలో ఎన్నికలు రావచ్చు. అందువల్ల ఈ బడ్జెట్ కీలకమైనది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతోంది. అందువల్ల ఆ వ్యతిరేకత పెరగకుండా చూసుకోవడానికి ఈ బడ్జెట్ ముఖ్యమైనది. మరి ప్రభుత్వం ఎలా రూపొందించిందో మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.

ఇవాళ అప్‌డేట్స్ ఏమున్నాయి?

ఇరాన్ యుద్ధానికి 20 రోజులు పూర్తయ్యాయి. ఇవాళ 21వ రోజు కొనసాగుతోంది. మ.12కి తెలంగాణ బడ్జెట్ ఉంది. నేడు తెలంగాణలో జుమాతుల్ విదా ఆప్షనల్ సెలవు ఉంది. నేడు ఫ్యామిలీతో తిరుమలకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు.. రేపు మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు కారణంగా రేపు కూడా తిరుమలలోనే ఉంటారు. మత్స్యకారుల హక్కుల కోసం నేడు నెల్లూరు జిల్లా, కావలిలో వైసీపీ “ఛలో జువ్వలదిన్నె” కార్యక్రమం చేపడుతోంది. నేడు ప్రపంచ ఓరల్ హెల్త్ డే, నేడు అంతర్జాతీయ సంతోష దినోత్సవం, నేడు ప్రపంచ పిచుకల దినోత్సవం. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love