LIVE FEED
కరీంనగర్ జిల్లాలో విషాదం, చిన్నారి మృతి
- కరీంనగర్ జిల్లాలో విషాదం, చిన్నారి మృతి
- కరీంనగర్: కేశవపట్నం జాతీయ రహదారిపై లారీ ఢీకొని చిన్నారి నిత్య మృతి
ప్రమాదంలో ఆటోలోని ప్రయాణికులకు తీవ్రగాయాలు
- వికారాబాద్: పూడూర్ మండలం రాకంచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం
- ఆటోను ఢీకొన్న కారు; ప్రమాదంలో ఆటోలోని ప్రయాణికులకు తీవ్రగాయాలు
- క్షతగాత్రులు బొంరాస్‌పేట మం. బోట్లవానితండా వాసులుగా గుర్తింపు
- పరిగి ఆస్పత్రిలో క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్
- ఒడిశాలో ఆరుగురు బీజేడీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్
- రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు సస్పెన్షన్
మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా
- మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా
- రూ.1.20 కోట్ల మేర మోస పోయిన వ్యాపారి దొడ్ల దివ్యారెడ్డి
- వ్యాపారి దివ్యారెడ్డి, అకౌంటెంట్‌ను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
- 18కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్న మాజీ డీజీపీ మనుమరాలు దొడ్ల దివ్యారెడ్డి
- ఈనెల 13న ఆమె పేరు, ఫొటోతో ఉన్న వాట్సప్ నుంచి అకౌంటెంట్‌కు సందేశం
- తాను మీటింగ్‌లో ఉన్నానని…చెప్పిన ఖాతాకు రూ.1.20కోట్లు పంపాలని సందేశం
- కంపెనీ డైరెక్టర్ మెసేజ్ చేశారని భావించి రూ.1.20కోట్లు పంపిన ఎకౌంటెంట్
- ఈనెల 17న మరోసారి డబ్బు పంపాలంటూ అకౌంటెంట్‌కు మళ్లీ వాట్సప్ సందేశం
- డబ్బులు పంపేదుకు చెక్ అప్రూవల్ కోసం డైరెక్టర్‌ను సంప్రదించిన ఎకౌంటెంట్
- గతంలో చేసిన రూ.1.20 కోట్ల లావాదేవి వివరాలు చెప్పిన ఎకౌంటెంట్
- తాను ఎవరికీ డబ్బు పంపమని చెప్పలేదని పేర్కొన్న దివ్యారెడ్డి
- వెంటనే హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
- నిందితుడి కోసం కేరళ వెళ్లిన సైబర్ క్రైం పోలీసులు
దానం నాగేందర్ పార్టీ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు
- దానం నాగేందర్ పార్టీ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు
- స్పీకర్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
- దానం నాగేందర్ పార్టీ మారలేదని ఈనెల 11న స్పీకర్ తీర్పు
- స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన మహేశ్వర్‌రెడ్డి
- స్పీకర్ తీర్పును క్వాష్ చేయాలని కోరిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
- 2024లో ఎంపీగా దానం నాగేందర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశారన్న మహేశ్వర్‌రెడ్డి
- ఎమ్మెల్యేగా నాగేందర్ తీసుకుంటున్న జీతాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పిటిషన్
- ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ
వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20 శాతం పెంచిన కేంద్రం
- వాణిజ్య సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం
- వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20 శాతం పెంచిన కేంద్రం
- హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్యాంటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
- ఎల్లుండి నుంచి సిలిండర్లు సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటన
- వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు: కేంద్రం
కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపీ పెట్టింది: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపీ పెట్టింది: కేటీఆర్
- రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజున 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారు: కేటీఆర్
- అభయహస్తం అనే దస్త్రంపై సీఎం రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేశారు: కేటీఆర్
- గవర్నర్ ప్రసంగంలోనూ ఆరు గ్యారంటీలపై సంతకం జరిగిందని చెప్పించారు
- ఆరు గ్యారంటీల్లో అరగ్యారంటీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదు: కేటీఆర్
- ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కోరుతూ ప్రైవేటు మెంబర్ ప్రవేశపెట్టనున్నాం: కేటీఆర్
- వచ్చే శుక్రవారం నాడు శాసనసభలో మేము ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించాం: కేటీఆర్
- మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు.. వెంటనే అమలు చేయాలి: కేటీఆర్
- పింఛను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామన్నారు.. వెంటనే పెంచాలి: కేటీఆర్
- విద్యార్థులకు విద్యాభరోసా కార్డులు ఇస్తామన్నారు.. వెంటనే ఇవ్వాలి
రంగారెడ్డి: పెంజర్ల శివారులో లారీ దగ్ధం
- రంగారెడ్డి: పెంజర్ల శివారులో లారీ దగ్ధం
- బాణసంచా లోడుతో వెళ్తుండగా మంటలు ఎగిసిపడి లారీ దగ్ధం
- ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
- భారీగా మంటలు ఎగిసిపడి అప్పటికే పూర్తిగా దగ్ధమైన లారీ
న్యాయవాదులు, బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులతో సమావేశం కానున్న కేటీఆర్
- న్యాయవాదులు, బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులతో సమావేశం కానున్న కేటీఆర్
- ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం ప్రైవేటు బిల్లుపై చర్చించనున్న కేటీఆర్
జీవన్‌రెడ్డితో ముగిసిన మంత్రుల సమావేశం – తన నిర్ణయంలో మార్పులేదని ప్రకటన
- మంత్రులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన జీవన్‌రెడ్డి
- తన నిర్ణయంలో మార్పులేదని ప్రకటించిన జీవన్‌రెడ్డి
- పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తానన్న జీవన్‌రెడ్డి
పార్టీ మారతానన్న కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డితో ముగిసిన మంత్రుల సమావేశం
- పార్టీ మారతానన్న కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డితో ముగిసిన మంత్రుల సమావేశం
- జీవన్‌రెడ్డితో సమావేశమైన మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం
- జీవన్‌రెడ్డిని బుజ్జింగించేందుకు గంటకుపైగా సమావేశమైన మంత్రులు
- పార్టీలో గౌరవం దక్కటం లేదని మంత్రుల ముందు ఆవేదన వ్యక్తం చేసిన జీవన్‌రెడ్డి
- జీవన్‌రెడ్డిని కలవటానికి ఇక్కడికి వచ్చాం: మంత్రి శ్రీధర్‌బాబు
- జీవన్‌రెడ్డి పద్దతి గల నాయకుడిగా 4 దశాబ్దాలుగా పార్టీలో ఉన్నారు: మంత్రి శ్రీధర్‌బాబు
- పార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభాలను తెలియజేశారు: మంత్రి శ్రీధర్‌బాబు
- జీవన్‌రెడ్డితో అనేక అంశాల గురించి చర్చించాం: మంత్రి శ్రీధర్‌బాబు
- జీవన్‌రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం : మంత్రి శ్రీధర్‌బాబు
జియాగూడలో సమోసా తయారీ యూనిట్‌పై టాస్క్ ఫోర్స్ దాడి
- హైదరాబాద్ : జియాగూడలో సమోసా తయారీ యూనిట్‌పై టాస్క్ ఫోర్స్ దాడి
- హెచ్-ఫాస్ట్, కుల్సుంపురా పోలీసుల సంయుక్త ఆపరేషన్
- రూ.5 లక్షల విలువైన అనారోగ్యకర ఆహార పదార్థాల స్వాధీనం
- పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాల తయారీ
- ఎఫ్ఎస్ఎస్ఏఐ, ట్రేడ్ లైసెన్స్ లేకుండా యూనిట్ నిర్వహణ
- వందల సంఖ్యలో సమోసాలు, ముడి పదార్థాలు, యంత్రాలు స్వాధీనం
- నిర్వాహకుడు అబ్దుల్ రషీద్‌ను అరెస్టు చేసిన పోలీసులు
ముందుచూపుతో నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ప్రణాళికలు చేశాం: హరీశ్‌రావు
- ముందుచూపుతో నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ప్రణాళికలు చేశాం: హరీశ్‌రావు
- మేము అన్ని సమకూర్చడం.. మీరు శంకుస్థాపనలు చేయడం: హరీశ్‌రావు
- ఆయుష్ ఆస్పత్రులు మేమే ఏర్పాటు చేశాం: హరీశ్‌రావు
- నడుస్తున్న ఆయుష్ ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తున్నారు: హరీశ్‌రావు
- పీహెచ్‌సీలు కూడా నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడే ఏర్పాటు చేశాం: హరీశ్‌రావు
- ఎన్నికల కోడ్ వల్ల పీహెచ్‌సీలు ప్రారంభించలేదు: హరీశ్‌రావు
- బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జిల్లా జైలుకు భూసేకరణ చేశాం..నిధులు కేటాయించాం: హరీశ్‌రావు
- జిల్లా జైలు పూర్తయి రెండేళ్లు అయ్యింది.. ఇప్పుడు మీరు వచ్చి ప్రారంభిస్తున్నారు: హరీశ్‌రావు
- శ్రమ ఎవరిది.. శిలాఫలకం ఎవరిది?: హరీశ్‌రావు
- ఇప్పటికీ రుణమాఫీ పూర్తి కాలేదు: హరీశ్‌రావు
- నర్మెట్టలోనే 350 మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదు: హరీశ్‌రావు
- సిద్దిపేట నియోజకవర్గంలో 22,819 మందికి రుణమాఫీ కాలేదు: హరీశ్‌రావు
- మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారు: హరీశ్‌రావు
- రైతుబంధు బకాయిలు వెంటనే ఇవ్వాలని రైతుల తరఫున అడుగుతున్నా: హరీశ్‌రావు
- పంటల బీమా ఇప్పటికీ చేయించలేదు: హరీశ్‌రావు
- వర్షాలు, తుపానుల వల్ల నష్టపోయిన పంటలకు బీమా రాలేదు: హరీశ్‌రావు
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిద్దిపేటకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు: హరీశ్‌రావు
పార్టీ మారతానన్న కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డిని బుజ్జగిస్తున్న మంత్రులు
- పార్టీ మారతానన్న కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డిని బుజ్జగిస్తున్న మంత్రులు
- మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో జగిత్యాల వెళ్లిన మంత్రులు
- జీవన్‌రెడ్డితో సమావేశమైన మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం
- జీవన్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న మంత్రులు
- జీవన్‌రెడ్డితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం
భార్య మృతితో మనస్తాపానికి గురై అత్తగారింట్లో ఉరివేసుకున్న ఎస్ఐ
- కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ బలవన్మరణం
- అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ చంద్రశేఖర్
- ఇటీవల గన్నేరుపప్పు తిని చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య
- కడుపు నొప్పితో భార్య ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేసిన ఎస్ఐ చంద్రశేఖర్
- దివ్య ఆత్మహత్యకు భర్తే కారణమని దాడికి ప్రయత్నించిన మృతురాలి బంధువులు
- గ్రామస్థులు, బంధువుల నిరసనల మధ్యే అంత్యక్రియలు పూర్తి
- అంత్యక్రియల అనంతరం భార్య స్వగ్రామం సీతంపేటలో ఉంటున్న ఎస్ఐ
- ఐదు రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చిన ఎస్ఐ చంద్రశేఖర్
- భార్య మృతితో మనస్తాపానికి గురై అత్తగారింట్లో ఉరివేసుకున్న ఎస్ఐ
- ఎస్ఐ చంద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వాస్పత్రికి తరలింపు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,800
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,990
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,800
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,35,000
వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని మహిళపై ప్రియుడు కత్తితో దాడి
- హైదరాబాద్: వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని మహిళపై ప్రియుడు కత్తితో దాడి
- నిందితులు ఆలీషా, అతని తండ్రి లాలూను అరెస్టు చేసిన పోలీసులు
- మియాపూర్‌లోని రెడ్డికాలనీలో ఉంటూ హౌస్ కీపింగ్ పనిచేస్తున్న నూకరత్నం
- భర్తను కోల్పోయిన నూకరత్నంకు ఇద్దరు కుమార్తెలు
- నూకరత్నం పని చేసే చోటే వంటవాడిగా పనిచేస్తున్న ఆలీషా
- ఫిబ్రవరి 20న ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న నూకరత్నం
- ఈ నెల 19వ తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి మహిళ ఇంటికి వెళ్లిన ఆలీషా
- హైదరాబాద్: తనతో రావాలని మహిళతో గొడవ పడిన ఆలీషా
- తనతో రావడానికి నిరాకరించడంతో మహిళపై కత్తితో దాడి చేసిన ఆలీషా
- తీవ్ర గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న నూకరత్నం
కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ బలవన్మరణం
- కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ బలవన్మరణం
- అత్త గారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ చంద్రశేఖర్
- ఇటీవల గన్నేరుపప్పు తిని ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య
- అంత్యక్రియల అనంతరం భార్య స్వగ్రామం సీతంపేటలో ఉంటున్న ఎస్ఐ చంద్రశేఖర్
- భార్య మృతితో మనస్తాపానికి గురై అత్త గారింట్లో ఉరివేసుకున్న ఎస్ఐ చంద్రశేఖర్
- ఎస్ఐ చంద్రశేఖర్ మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ఏప్రిల్ రెండో వారంలో రాష్ట్రానికి ప్రధాని మోదీ
- ఏప్రిల్ రెండో వారంలో రాష్ట్రానికి ప్రధాని మోదీ
- కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు రానున్న మోదీ
- ఈ నెలాఖరున ప్రధాని మోదీ పర్యటన తేదీ ఖరారయ్యే అవకాశం
మీరాలం ఈద్గాహ్ లో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్
- మీరాలం ఈద్గాహ్ లో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్
- ఈద్గాహ్ పరిసరాల్లో భద్రతను పర్యవేక్షించిన సీపీ
- ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేస్తున్న సీపీ
రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు
- రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు
- మెదక్‌లోని నవాబుపేటలో ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
- ఖమ్మం గొల్లగూడెం ఈద్గా మైదానంలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
- ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
రంజాన్ సందర్భంగా ఖిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు
- రంజాన్ సందర్భంగా ఖిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు
- ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
- ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ
దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలను జరుపుకొంటున్న ముస్లింలు
- దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలను జరుపుకొంటున్న ముస్లింలు
- దేశవ్యాప్తంగా ఈద్గాలు, మసీదులకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన ముస్లింలు
- దిల్లీలోని జామా మసీదు వద్ద ప్రార్థనలు నిర్వహించిన వేలమంది ముస్లింలు
- ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్న ముస్లింలు
- శాంతిభద్రతల దృష్ట్యా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన దిల్లీ పోలీసులు
రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో సందడి వాతావరణం
- రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో సందడి వాతావరణం
- మక్కా మసీదులో వేల మంది ముస్లింల సామూహిక ప్రార్థనలు
- మీరాలం ఈద్గాలో ప్రార్థనలకు భారీగా తరలివస్తున్న ముస్లింలు
- రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఒకరికొకరు ఆలింగనాలు
- హైదరాబాద్: రంజాన్ సందర్భంగా పాతబస్తీలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్
- హైదరాబాద్: ప్రార్థనల కోసం రోడ్లపైకి భారీగా వస్తున్న ముస్లింలు
- హైదరాబాద్: ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తున్న పోలీసులు
- హైకోర్టు, సిటీ కాలేజీ, జూపార్క్, మీరాలం ట్యాంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
- రంజాన్ వేళ పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు
గోదావరిలో గల్లంతైన వారిలో మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం
- భద్రాచలం: గోదావరిలో గల్లంతైన వారిలో మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం
- గల్లంతైన ఐదుగురు యువకుల్లో నిన్న ముగ్గురి మృతదేహాలు లభ్యం
- ఇవాళ సతీష్, తేజ మృతదేహాలను వెలికితీసిన అధికారులు
- భద్రాచలం: గోదావరిలో నిన్న ఐదుగురు విద్యార్థులు గల్లంతు
- ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతు
- గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థులు
ముస్లింలకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
మహేశ్ గౌడ్ :
- ముస్లింలకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
- ఈ పండుగ శాంతి, సౌభ్రాతృత్వం, ప్రేమ మరింతగా పెంపొందించాలి: మహేశ్‌గౌడ్
- ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, సుఖశాంతులు నిండాలి: మహేశ్‌గౌడ్
వరంగల్ : దుగ్గొండి మం. వెంకటాపురంలో మృతదేహంతో ఆందోళన
- వరంగల్ : దుగ్గొండి మం. వెంకటాపురంలో మృతదేహంతో ఆందోళన
- 5 రోజుల క్రితం ట్రాక్టర్ ఢీకొని తాళ్ల సతీష్‌కు తీవ్రగాయాలు
- ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాత్రి మృతి చెందిన సతీష్(45)
- సతీష్ మృతికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన
- ట్రాక్టర్ యాజమాని జైపాల్‌రెడ్డి ఇంటి ముందు మృతదేహంతో బంధువుల ఆందోళన
- వరంగల్ జిల్లా: పోలీసుల అదుపులో ట్రాక్టర్ డ్రైవర్ సంజీవ్
రేపు రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల
- రేపు రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల
- సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
- ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
- రంజాన్ పండుగ లౌకికవాదానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది: సీఎం
- క్రమశిక్షణతో చేసే ప్రార్థనలు, ధాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయి: సీఎం
- ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా
- పవిత్ర ఖురాన్ బోధనల పట్ల తనకు ఎంతో గౌరవం ఉంది: గవర్నర్
- ఖురాన్ సన్మార్గంలో నడిపిస్తూ మానవత్వం, కరుణకు మార్గదర్శకంగా నిలిచింది : గవర్నర్
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- భక్తి శ్రద్ధలతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారు: కేసీఆర్
- రంజాన్ సందర్భంగా శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమ పరిమళిస్తాయి: కేసీఆర్
- ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలి: కేసీఆర్
- గంగా-జమున తహజీబ్‌కు ప్రతీకగా మేం పరిపాలన చేశాం: కేసీఆర్
- ముస్లింల సంక్షేమం, ప్రగతి కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం: కేసీఆర్
- ముస్లింల జీవన విధానంలో గుణాత్మక మార్పులు తీసుకొచ్చాం: కేసీఆర్
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌లో విషాదం
- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌లో విషాదం
- నర్మాల వద్ద మానేరులో దూకి నవవరుడు వినయ్ ఆత్మహత్య
- ఈనెల 19న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాని వినయ్
- గంభీరావుపేట మం. నర్మాల మానేరులో వినయ్ మృతదేహం లభ్యం
సంగారెడ్డి జిల్లా : చిన్న కంజర్లలో 3,200 కిలోల అల్లం పేస్టు స్వాధీనం
- సంగారెడ్డి జిల్లా: చిన్న కంజర్లలో 3,200 కిలోల అల్లం పేస్టు స్వాధీనం
- అల్లం వెల్లుల్లి పేస్టు తయారుచేస్తున్న మహారాణా కంపెనీలో సోదాలు
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఉన్నతీకరణకు అనుమతి
- కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఉన్నతీకరణకు అనుమతి
- రూ.1,011 కోట్లతో పనులు చేపట్టేందుకు అడ్మినిస్ట్రేషన్ అనుమతులు జారీ
- రూ.496.75 కోట్లతో 11 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి అనుమతి
- రూ.364.60 కోట్లతో ప్రస్తుతం ఉన్న 17 పాఠశాలల ఉన్నతీకరణకు అనుమతి
- 164 పాఠశాలల్లో అదనంగా రూ.105.30 కోట్లతో 501 తరగతి గదుల నిర్మాణం