కామేపల్లి: సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులను 2026-27 ఆర్థిక బడ్జెట్లో కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ రైతు సంఘం కామేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రైతులు భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దుగ్గి కృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు తక్కువ చేయుడం, సీతారామ ప్రాజెక్టుకు కేవలం రూ.336 వేల కోట్లు కేటాయించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సినీయర్ నాయకులు ఇంజం నాగభూషణం, అంబటి శ్రీనివాస్ రెడ్డి బాదావత్ శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు రాయల సత్యనారాయణ, కార్యదర్శి సకినాల శ్రీనివాసరావు, నిర్వాసితుల సంఘం నాయకులు షేక్ షరిఫ్, అర్జ రమేష్, గడ్డం వీరన్న, వెంకట్రామిరెడ్డి, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.