25 మార్చి కార్టూన్ | ట్రంప్-మోడీ కాల్… అసలు చర్చ ఏంటి?
శాంతి మాటలు వినిపించాయా? సందేహాలు
యుద్ధ విరామం… వ్యూహమా లేక నాటకమా?
హార్ముజ్ నేపథ్యం… గ్లోబల్ దౌత్య కదలికలు
కార్టూన్ చెప్పిన కఠిన సత్యం

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : 24 మార్చి 2026 మంగళవారం నాడు అమెరికా అధ్యక్షులు..గౌరవనీయులైన ట్రంపు గారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి మాట్లాడారు. అంతవరకూ బాగానే ఉంది. ఇంతకీ ఏం మాట్లాడారు? అక్కడే ఉంది అసలు కథ. అసలు ట్రంపు గారు దేనికి కాల్ చేయాలనుకుంటున్నారో అది చెప్పి ఫోన్ పెట్టేసారు. అంతే తప్ప మోడీ గారు చెప్పినవేవీ అతగాడి తలకెక్కలేదన్నది పచ్చి నిజం. అసలు ట్రంపులో ఆమాత్రం శాంతికాముకత్వం ఉంటే యుద్ధం అనేది ఎందుకొచ్చేది? అది కదా అసలు విషయం. కనీసం మన ప్రధాని శాంతి, చర్చలు అని ప్రస్తావిస్తూంటే ఆ విషయం ఆలోచిస్తామని కూడా ట్రంపు నోటివెంట రాలేదంటే అతడిలోని యుద్ధకాంక్ష ఎంత తీవ్రమైనదో, బలమైనదో అర్థమవుతూనే ఉంది కదా.
యుద్ధ విరామం కూడా హింస పట్ల విముఖత కలిగో, విధ్వంసం వల్ల జరిగే నష్టంను గుర్తించో కాదనేది కఠోర వాస్తవం. కఠిన సత్యం. యుద్ధం మరి చెయ్యబోమనే సంకేతాలిచ్చి, ఈ అయిదు రోజులలో హార్ముజ్ విషయంలో ప్రపంచ దేశాలతో దౌత్యం నెరిపి, మంచి మార్కులు కొట్టేసి, తమ ఆర్థిక బలాన్ని బేరీజు వేసుకునితిరిగి విరుచుకు పడాలంటే దురాశనే అని కచ్చితంగా ట్రంప్ నైజం తెలిసినవారెవరైనా చెప్పగలరు.
ఈ కార్యక్రమం సూటిగా, నేరుగా, క్లుప్తంగా చెప్పిన ఆంధ్రప్రభ కార్టూన్ ఇది.
గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.