- మరో విదేశీ పర్యటనకు మోడీ
- జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరు
- ధృవీకరించిన భారత విదేశాంగ శాఖ

ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సులో పాల్గొంటారు.
ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి జీన్-నోయెల్ బారోట్ గురువారం అబ్బే డెస్ వాక్స్-డి-సెర్నెలో జరిగిన జీ7 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌తో చర్చలు జరిపారు. ఈ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారని.
ఇది కూడా చదవండి: UK-రష్యా: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం
ఈ మంత్రుల సమావేశంలో మధ్యప్రాచ్యంలోని పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. హార్ముజ్ జలసంధిపై సంయుక్తంగా పని చేయడానికి సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించాలని భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం అందించింది. ఇక G7 కార్యకలాపాలకు భారతదేశం అందించిన సహకారాన్ని అభినందించింది.
జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ వేదికగా జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
యూరప్ మరియు విదేశీ వ్యవహారాల ఫ్రెంచ్ మంత్రి, జీన్-నోయెల్ బారోట్, G7 సందర్భంగా తన భారత కౌంటర్ విదేశాంగ మంత్రి డాక్టర్ S. జైశంకర్‌తో చర్చలు జరిపారు…
– ANI (@ANI) మార్చి 26, 2026