యూకేలో డిస్ట్రిక్ట్ క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా బాధ్యతలు

ఈనాడు, వరంగల్: హనుమకొండకు చెందిన ప్రవాస భారతీయురాలు హేమ ఎల్లాప్రగడ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యూకేలోని వార్విక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌కు 2023లో అధికార గ్రీన్ పార్టీ సభ్యురాలిగా ఎన్నికైన ఆమె తాజాగా క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా ఎంపికయ్యారు. స్థానిక నగరాల్లో పాలన సాగించేందుకు డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన పార్టీ నేతను లీడర్ ఆఫ్ ది కౌన్సిల్‌గా పిలుస్తారు. సభ్యుల్లో కొందరిని క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్‌గా ఎంపిక చేసి వివిధ పరిపాలనా విభాగాలను అప్పగిస్తారు. అలాగే హేమ ఎల్లాప్రగడకు ఇప్పుడు డీకార్బనైజేషన్ బాధ్యతలు అప్పగించారు.