Telangana Mla Mlc Games,తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు.. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా..! – telangana mla mlc games govt host first ever legislator sports meet 2026


తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. అదే సమయంలో ప్రజా ప్రతినిధులకు సాంస్కృతి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. ఈ నెల 28, 29 రోజుల్లో ఈ ఆటల పోటీలు ఎల్బీ స్టేడియంలో.. సాంస్కృతిక కార్యక్రమాలను రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆటల పోటీలు ఇదే తొలిసారి కావడం విశేషం.

తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆటలు
తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు(ఫోటోలు– Samayam Telugu)
రాజకీయ నాయకులు అంటే.. నిత్యం ప్రజల్లో తిరుగుతూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారు. ప్రతిపక్షాలపై అధికార పక్షం.. అధికార పక్షంపై ప్రతిపక్షాలు.. తీవ్ర విమర్శలు గుప్పించుకుంటారు. ప్రారంభోత్సవాలు, సంక్షేమ పథకాల అమలు, శంకుస్థాపనలు, రాజకీయ సభలు, సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతూ ఉంటారు. తమ ఇంటికి వచ్చిన నియోజకవర్గ ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలను తెలుసుకుని తీర్చుతూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫుల్ బిజీగా ఉంటారు. అయితే అలా బిజీ బిజీ లైఫ్ గడిపే ప్రజా ప్రతనిధులకు ఆటల పోటీలు నిర్వహించాలని.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 28, 29వ తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌‌‌‌కు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. గురువారం శాసనసభలో ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా తొలి విడత లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026 నిర్వహించనున్నట్లు తెలిపారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కమిటీ ఛైర్మన్‌గా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. కో ఛైర్మన్‌గా క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని నియమించారు. అదే సమయంలో రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఆటల పోటీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌ సహా మరో 13 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌‌‌‌లో సమావేశమైన ఈ కమిటీ.. ప్రజా ప్రతినిధులకు నిర్వహించనున్న పోటీల నిర్వహణపై సమీక్ష చేపట్టింది. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు ఎల్బీ స్టేడియంలో క్రీడలు ప్రారంభం కానున్నట్లు కమిటీ స్పష్టం చేసింది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడంతోపాటు.. రాష్ట్ర ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని నింపడం కోసమే ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు.. కో ఛైర్మన్ మంత్రి వాకిటి శ్రీహరి తేల్చి చెప్పారు. అంతకుముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి స్పోర్ట్స్ కిట్‌ను అందించారు.

ఈ సంద‌‌‌‌ర్భంగా మాట్లాడిన మంత్రులు.. ఈ నెల 28, 29వ తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మొదటి ఎడిషన్ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026 ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాల‌‌‌‌ను ఘ‌‌‌‌నంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల‌‌‌‌ని సంబంధిత అధికారుల‌‌‌‌ను ప్రభుత్వం ఆదేశించింది.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2023లో సమయం తెలుగులో చేరిన శివరామచారి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలతోపాటు విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు, సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు.

శివరామచారి తాటికొండ ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ న్యూస్ ఛానెల్‌లో కాపీ ఎడిటర్‌గా పని చేశారు. ఆ సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ స్పోర్ట్స్ వార్తలు రాశారు. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడాన్ని ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి