9 మిలియన్ల నిరసనకారులు : జననం విస్ఫోటనం ఆంధ్రప్రభ తాజా వార్తలు
- అమెరికాలో నో కింగ్స్ జ్వాల..
- వీధుల్లో అశేషజనం కదం
- ట్రంప్ వ్యతిరేక గళం గర్జన
- దద్దరిల్లిన వాషింగ్టన్
- పాలనపై తిరుగుబాటు
- అధ్యక్షుడికి భారీ దెబ్బ
(ఆంధ్రప్రభ, వాషింగ్టన్ ప్రతినిధి)
ఎడారిలో.. కొండల్లో గుట్టల్లో… పాతాళ గంగమ్మ ఆధీనంలోని ఆయిల్
సేదుకుంటూ.. ప్రపంచం దోసిట్లో ఇంధనం పోస్తున్న.. గల్ఫ్ సామ్రాజ్యంలో మంటలు రగిల్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై.. విశ్వ నీరాజనం నిప్పులు కడుతోంది. మరీ ముఖ్యంగా అమెరికా జనం ఆగ్రహంతో .. నడి వీధికి ఎక్కింది. కదం తొక్కింది. ట్రంప్ ఇప్పుడే వెళ్ళిపోవాలి’, ‘ఫాసిజంపై పోరాడండిస’ అనే భారీ బ్యానర్‌లతో .. అశేష జనవాహిని నినాదాలతో భారత కాలమానం ప్రకారం ఆదివారం అమెరికా రాజధాని వాషింగ్టన్ దద్దరిల్లిపోయింది. ఏడాదిగా అమెరికా ప్రజలు చేపట్టిన “నో కింగ్స్” (రాజులు వద్దు) ప్రజా ఉద్యమం హ్యాట్రిక్ చరిత్ర సృష్టించింది.

యావత్తుఎస్ ఏలోని 3,100 పైగా ప్రధాన నగరాలు, నగ్‌ర శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో ..అమెరికా లోనే అతిపెద్ద నిరసన కార్యక్రమంగా ఈ ఆందోళన చరిత్ర సృష్టించింది. దాదాను తొంభై లక్షల మంది ఈ క‐వాతులో పాల్గొన్న పరిశీలకులు అంచనా వేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ పాలన శైలి, కఠిన వలస విధానాలు, వాతావరణాన్ని నిరాకరణ, ఇరాన్‌తో యుద్ధం సహా పలు ఈ రోజు అమెరికా వ్యాప్తంగా.. మరి కొన్ని ప్రపంచ దేశాల్లోనూ లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో, స తక్షణం ట్రంప్ వెళ్ళిపోవాలి’, ‘ఫాసిజంపై పోరాడండిస’ అనే పెద్ద అక్షరాలతో బ్యానర్‌లను పట్టుకున్న ఆందోళనకారులు నేషనల్ మాల్‌కు తరలివచ్చారు.
9 మిలియన్ల నిరసనకారులు : నో కింగ్స్ ఉద్యమం అలజడి …

“నో కింగ్స్” (రాజులు వద్దు) అనే ప్రజా ఉద్యమంలో భాగంగా అమెరికాలో ఈ ఏడాదిలోపు ప్రజల నిరసన తెలపడం ఇది మూడవసారి. మొట్టమొదటి దేశవ్యాప్త ఈ నిరసన గత జూన్‌లో ట్రంప్ 79వ పుట్టినరోజు జరిగింది. అదే రోజున వాషింగ్టన్‌లో ఆయన ఆధ్వర్యంలో సైనిక కవాతు కూడా జరిగింది. న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు లక్షలాది మంది ప్రజలు. నిర్వాహకుల లెక్కల ప్రకారం, గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన రెండవ నిరసన దాదాపు 70 లక్షల మంది. ఈ రోజు నిరసనకారుడు మాట్లాడుతూ, “అతను అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు, ఎవరూ ఏమీ అనడం లేదు. అందుకే మనం చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం,” అని
ఆవేదన వ్యక్తం చేశాడు.
9 Mn నిరసనకారులు : జనంలో తీవ్ర వ్యతిరేఖ

ఈ నిరసనతో అమెరికాలో ప్రస్తుతం తీవ్ర రాజకీయ వ్యతిరేఖతను స్పష్టం చేసింది. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ ఉద్యమంలో చాలామంది ట్రంప్ ను ఆరాధిస్తున్నప్పటికీ, ఆయన శత్రువులు మాత్రం అంతే స్థాయిలో ఆయనను ద్వేషిస్తున్నారు. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా పాలించడం, ప్రత్యర్థులపై కేసులు పెట్టడానికి న్యాయవ్యవస్థను ఉపయోగించడం, పర్యావరణ మార్పులను పదేపదే తిరస్కరించడం, శిలాజ ఇంధనాలపై ఆయనకున్న వ్యామోహం త’దిత’ర ఆయన ధోరణులను జనం తీవ్రంగా ఖండించారు. యుద్ధాలను నివారించే శాంతిదూతగా ప్రచారం తర్వాత, జాతి, లింగ వైవిధ్య కార్యక్రమాలను రద్దు చేయడం, అమెరికా సైనిక శక్తిని ప్రదర్శించడం పట్ల కూడా ఆయన ప్రత్యర్థులలో అనేక మంది అసంతృప్తిగా ఉన్నారు.
9 మిలియన్ల నిరసనకారులు : మీడియాపై అక్కసు

వైట్ హౌస్ ఈ ర్యాలీలను కొట్టిపారేసింది. అసలు సిసలు ప్రజా లేని “వామపక్ష నిధుల నెట్‌వర్క్” ఫలితమే వీటికి మద్దతు అని ఒక ప్రతినిధి అభివర్ణించారు. “ఈ ట్రంప్ డిరేంజ్‌మెంట్ సిండ్రోమ్ థెరపీ సెషన్‌ల గురించి పట్టించుకునే వ్యక్తులు, కవర్ చేయడానికి డబ్బు తీసుకునే విలేఖరు” అని ప్రతినిధి అబిగైల్ జాక్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాఖ్యలను నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ కూడా పునరుద్ఘాటించింది. ఒక ప్రతినిధి మాట్లాడుతూ, “ఈ ‘హేట్ అమెరికా ర్యాలీలు’ అనేవి తీవ్రవామపక్షం అత్యంత హింసాత్మక, వికృత కల్పనలకు మైక్రోఫోన్ లభించే వేదిక” అని అన్నారు. కానీ ఈ ర్యాలీలో మూడింట రెండు వంతుల మంది ప్రధాన నగరాల్లో నివసించరని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నగరాలు తరచుగా అమెరికాలో డెమోక్రటిక్ పార్టీకి కంచుకోటలుగా ఉంటాయి. గత నిరసన తర్వాత ఈ సంఖ్య పెరిగింది.
9 మిలియన్ల నిరసనకారులు : యూరప్ లోనూ..
యూరప్‌లోనూ ఈ ర్యాలీలు జరిగాయి. ఆమ్‌స్టర్‌డామ్మాడ్రిడ్, రోమ్ వంటి నగరాల్లో భారీ పోలీసు బందోబస్తు నడుమ సుమారు 20,000 మంది కవాతు చేశారు. పారిస్‌లో అమెరికన్లతో సహా వందలాది మంది, ఫ్రెంచ్ కార్మిక సంఘాలు మానవ హక్కుల సంస్థలతో కలిసి బాస్టిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. “ట్రంప్ చట్టవిరుద్ధ , అనైతిక , నిర్లక్ష్య , అసమర్థం , అంతులేని యుద్ధాల నిలబెట్టుకుంటున్నానని పారిస్ నో కింగ్స్ నిర్వాహకురాలు అడా షెన్ అన్నారు.
9 మిలియన్ల నిరసనకారులు : ఇరాన్ పై వార్ కు వ్యతిరేఖంగా..

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా వేలాది మంది రోమ్‌లో నిరసన తెలిపారు. ఇటలీ న్యాయవ్యవస్థ పనితీరును మార్చే ప్రజాభిప్రాయ సేకరణ ఇటీవల విఫలమవ్వడాన్ని చూసిన ప్రధానమంత్రి జార్జియా మెలోనిని విమర్శించే అవకాశాన్ని కూడా ఇటాలియన్‌లు ఉపయోగించుకున్నారు. లండన్‌లో నూ ప్రజలు ఇరాన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. చాలామంది “తీవ్రవాద కుడిపక్షాన్ని ఆపండి”, “జాతి వివక్షను ఎదిరించండి” అనే బ్యానర్లను ప్రదర్శించారు.