31 మార్చి కార్టూన్ | గ్యాస్ సరఫరా పై ప్రభుత్వ ప్రకటనలు
ప్రజల్లో భయం, అధిక బుకింగ్స్ ప్రభావం
కిరోసిన్ ప్రత్యామ్నాయం – పరిష్కారమా సమస్యా?
పంపిణీ లోపాలు, అసమానతల వాస్తవం
కార్టూన్లో సమాజపు ప్రతిబింబం

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సరఫరాకు లోటు లేదు ఒక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యంగా చెబుతూనే ఉన్నాను. “గ్యాస్ కొరత ఎక్కడా లేదు… అన్నీ సవ్యంగా సాగుతున్నాయి” అని అధికారిక ప్రకటనలు వరుసగా వస్తూనే ఉన్నాయి వాస్తవ పరిస్థితి పూర్తిగా మారలేదు. గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే వెంటనే రాకుండా, వారాల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని చూస్తే “లోటు లేదు” అన్న మాట ప్రజలకు అంత నమ్మశక్యంగా అనిపించడం లేదు..
ఈ పరిస్థితులకు తగినట్లుగానే ప్రజల మనస్తత్వం కూడా ఈ పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చేస్తోంది. “ఇప్పుడే బుక్ చేసుకోకపోతే రేపు దొరకదేమో!” అన్న భయం చాలా మందిలో గుబులు రేపుతోంది. ప్రజల్లో చాలామంది అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయడం మొదలైంది. చాలామంది ఇళ్ళల్లో ఒక సిలిండర్ ఉంటే మరోటి బ్యాకప్గామరొకటి ‘ఎమర్జెన్సీ’ కోసం అన్నట్టుగా నిల్వ చేసుకునే పరిస్థితి చేశారు. ఈ ముందుచూపే కొన్నిసార్లు సమస్యకు మూల కారణంగా మారుతోంది. మరికొంతమంది కొంపముంచుతోంది. మరింత కృతిమ కొరతకు కారణం.
ఇలాంటి ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూడడం సహజమే. “గ్యాస్ లేకపోతే వంట ఆగిపోతుందా?” అన్న ప్రశ్నకు వెతుక్కుంటూ చాలా మంది పాత కాలపు చదువును గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ కొందరు మంట పెట్టే పొయ్యిలను తుడుచుకుని బయటకు తీస్తేఇంకొందరు ఎలక్ట్రిక్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వీటన్నింటికీ ఒకే సమస్య గ్యాస్ అందుబాటులో లేదు.
ఇదే సమయంలో ప్రభుత్వం కూడా చేతులు కట్టుకుని కూర్చోలేదు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తూ, “ప్రత్యామ్నాయంగా కిరోసిన్ సరఫరా పెంచడం” అనే ప్రకటనతో ముందుకొచ్చింది మంచి నిర్ణయంలా అనిపించినానేల మీద వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే మన వ్యవస్థలో ఒక ప్రత్యేకత ఉన్న ప్రభుత్వాలు ఏ పథకాలు తెచ్చినా, దాని అసలు లబ్ధిదారుల కంటే ముందే ‘సెటిలైన’ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడం.
ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. గ్యాస్ ఉన్న వాళ్లు కూడా “ఎప్పుడైనా సిలిండర్లకు కొరత వస్తే?” అన్న ఆలోచనతో కిరోసిన్ కోసం క్యూలో నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లో ఒక వైపు గ్యాస్ సిలిండర్మరో వైపు కిరోసిన్ డబ్బారెండూ ఒకే ఇంట్లో నిల్వ ఉంటాయి ‘భద్రతా వ్యూహం’!
ఇలా అయితే మరి నిజంగా అవసరమున్న వాళ్ల పరిస్థితి ఏమిటి? వాళ్లు క్యూలలో చివర్లో నిలబడి చూస్తూ ఉండాల్సిందేనా?.
ఈ దృశ్యం చూస్తే మనలో ఉంది అసమానతలు మరోసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. “లేని వాడికి ఏది దొరకదు, ఉన్న వాడికి అన్నీ అందుతాయి” అన్న పాత సామెత ఇక్కడ అక్షరాలా నిజమవుతోంది. సరఫరాలో లోటు లేక పోయినా, పంపిణీ లోటు స్పష్టంగా నిర్ణయించబడింది. అదే సమయంలో భయం, అపోహలు, ముందు చూపు పేరుతో జరిగే అధిక వినియోగం సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తోంది.
ఈ పరిస్థితులకు తగినట్లుగానే ప్రజల మనస్తత్వం కూడా ఈ పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చేస్తోంది. “ఇప్పుడే బుక్ చేసుకోకపోతే రేపు దొరకదేమో!” అన్న భయం చాలా మందిలో గుబులు రేపుతోంది. ప్రజల్లో చాలామంది అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయడం మొదలైంది. చాలామంది ఇళ్ళల్లో ఒక సిలిండర్ ఉంటే మరోటి బ్యాకప్గామరొకటి ‘ఎమర్జెన్సీ’ కోసం అన్నట్టుగా నిల్వ చేసుకునే పరిస్థితి చేశారు. ఈ ముందుచూపే కొన్నిసార్లు సమస్యకు మూల కారణంగా మారుతోంది. మరికొంతమంది కొంపముంచుతోంది. మరింత కృతిమ కొరతకు కారణం.
ఇలాంటి ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూడడం సహజమే. “గ్యాస్ లేకపోతే వంట ఆగిపోతుందా?” అన్న ప్రశ్నకు వెతుక్కుంటూ చాలా మంది పాత కాలపు చదువును గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ కొందరు మంట పెట్టే పొయ్యిలను తుడుచుకుని బయటకు తీస్తేఇంకొందరు ఎలక్ట్రిక్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వీటన్నింటికీ ఒకే సమస్య గ్యాస్ అందుబాటులో లేదు.
ఈ దృశ్యం చూస్తే మనలో ఉంది అసమానతలు మరోసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. “లేని వాడికి ఏది దొరకదు, ఉన్న వాడికి అన్నీ అందుతాయి” అన్న పాత సామెత ఇక్కడ అక్షరాలా నిజమవుతోంది. సరఫరాలో లోటు లేక పోయినా, పంపిణీ లోటు స్పష్టంగా నిర్ణయించబడింది. అదే సమయంలో భయం, అపోహలు, ముందు చూపు పేరుతో జరిగే అధిక వినియోగం సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తోంది.
ఇదే సమయంలో ప్రభుత్వం కూడా చేతులు కట్టుకుని కూర్చోలేదు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తూ, “ప్రత్యామ్నాయంగా కిరోసిన్ సరఫరా పెంచడం” అనే ప్రకటనతో ముందుకొచ్చింది మంచి నిర్ణయంలా అనిపించినానేల మీద వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే మన వ్యవస్థలో ఒక ప్రత్యేకత ఉన్న ప్రభుత్వాలు ఏ పథకాలు తెచ్చినా, దాని అసలు లబ్ధిదారుల కంటే ముందే ‘సెటిలైన’ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడం.
ఇలాంటి మొత్తం పరిస్థితులను ఒకే ఫ్రేమ్‌లో, ఒకే సన్నివేశంలో చూపించడం అంటే కార్టూనిస్ట్ లకే సాధ్యం. అలాంటి సామాజిక వాస్తవాన్ని చమత్కారంగాకానీ గట్టిగా తాకేలా చూపించింది ఆంధ్రప్రభ సీనియర్ కార్టూనిస్ట్ మాధవ్ కార్టూన్ ఇది. ఒక చిన్న స్కెచ్లోనే పెద్ద పెద్ద వ్యవస్థలలోని లోపాలను, సగటు మనుషుల మనస్తత్వాలనుప్రభుత్వ ప్రకటనలతో నేల మీద వాస్తవాల మధ్య ఉన్న విరుద్ధతను అద్దంలా చూపించారు.