ఎన్నికల్లో మళ్లిన ప్రజల ఆలోచన
రోడ్లు, పర్యాటకం, నీరు, విద్య, వైద్యంపై దృష్టి
నేషనల్ డెస్క్

పశ్చిమ బెంగాల్‌లోని దార్జీలింగ్ కొండలు ఒకప్పుడు గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండుతో మారుమోగేవి. ఎన్నికలొచ్చినా అదే ప్రధానాంశంగా సాగేవి. ఇప్పుడా ప్రాంతంలో ఆ డిమాండు పెద్దగా వినిపించడం లేదు. గూర్ఖాలాండ్ నినాదాలు మసకబారాయి. సరికొత్త శకంలోకి ఈ ప్రాంతం ప్రవేశిస్తోంది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఈ ప్రాంతంలో గఖాలాండ్పై కాకుండా ఇతర ఎన్నికలు జరగబోతున్నాయి.

దశాబ్దాల డిమాండ్..
దశాబ్దాలపాటు ఉత్తర బెంగాల్‌లోని దార్జీలింగ్, కాలింపాంగ్, కుర్సియాంగ్ జిల్లాల్లో ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండు ఒక భావోద్వేగంగా ఉండేది. ఎన్నికల అంశమూ అదే. ప్రస్తుతం దాని ప్రభావం కొంత ఉన్నా మిగిలిన అంశాలూ ప్రధానంగా మారాయి. ఇప్పుడు మా రోడ్లను ఎవరు బాగు చేస్తారు.. పర్యాటకులకు ఎవరు పునర్వైభవం తెస్తారు. ఇంతకుముందు కూడా లేనంత రాజకీయ పరిస్థితి.
రెండు కూటముల మధ్య..
ప్రస్తుత ఎన్నికలు.. అధికార తృణమూల్ కాంగ్రెస్- భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా (బీజీపీఎం) కూటమికి, భాజపా అభ్యర్థికి మధ్య జరుగుతున్నాయి. అనిత్ థాపా వ్యతిరేకని బీజీపీఎం.. అంతం లేకుండా సాగించిన పోరాటాన్ని పక్కనబెట్టి అభివృద్ధి రాజకీయాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ శాశ్వత పేరుతో భావోద్వేగ రాజకీయాలను అనుసరిస్తోంది. గూర్ఖాల గుర్తింపునకు రోడ్లు, సంక్షేమం, పర్యాటక ప్రాజెక్టులు ప్రత్యామ్నాయం కావని వాదిస్తోంది.
1980ల నుంచీ..

1980లలో గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్ఎల్ఎఫ్) ఆధ్వర్యంలో హింసాత్మక ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత బిమల్ గురుంగ్ ప్రకాశం ఏర్పటైన గూర్ఖా జన్ముక్తి మోర్చా (జీజేఎం) నుంచీ సుదీర్ఘకాలం పాటు ఉద్యమాలు జరిగాయి. అయినా రాష్ట్ర హోదా దక్కలేదు.
2009లో ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన భాజపా.. ఆ తరువాత కాలంలో జీజేఎం, జీఎన్ఎల్ఎఫ్తో కలిసి దార్జీలింగ్ లోక్‌సభ సీటును గెలుచుకుంది. ఎన్నికల్లో విజయం కోసం ప్రతిసారీ రాజకీయ పరిష్కార హామీని ఇస్తున్న భాజపా.. ఆ తర్వాత దానిని పట్టించుకోవడం లేదు.
భారీగా ఓట్ల కోత
ఈసారి ఎన్నికల్లో సర్ ద్వారా ఓట్ల తొలగింపు మరో ప్రధానాంశంగా ఉంది. ఒక్క దార్జీలింగ్ జిల్లాలోనే 1.22 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో భాజపాకు మెజారిటీల కంటే ఎక్కువగా తొలగించారు. ఈ తొలగింపు గూర్ఖాలాండ్ ప్రాంతంలో ఎన్నికల లెక్కలను పూర్తిగా మార్చేసింది.
2017లో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ
2017లో జరిగిన 100 రోజుల ఆందోళన కారణంగా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. పర్యాటక వ్యాపారం కుప్పకూలింది. పాఠశాలలు మూతపడ్డాయి. టీ తోటలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఆ తర్వాత గూర్ఖాలాండ్ ఉద్యమం కనుమరుగు కావడమే కాదు.. ముక్కలైంది. బిమల్ గురుంగ్ ప్రభావం కోల్పోయారు. జీఎన్ఎల్ఎఫ్ ప్రతిష్ఠ మసకబారింది. ఈ సమయంలో వచ్చిన అనిత్ థాపా బీజీపీఎం.. బలం పుంజుకుంది. అధికార తృణమూల్‌తో కలిసి అభివృద్ధికి అడుగులు వేసింది. అభివృద్ధితోపాటు గౌరవం పేరుతో ప్రజల్లో ప్రాబల్యం పెంచుకుంది. ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్న తృణమూల్ పాగా వేసేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. దీంతోపాటు మమత బెంగాలీ నినాదం కలిసివచ్చింది.
- మరోవైపు గూర్ఖాలాండ్ సెంటిమెంటును తృణమూల్ తక్కువగా అంచనా వేస్తోందని భాజపా భావిస్తోంది. అందుకే ఆ వెంటనేవాడుకుంటోంది.
- బిమల్ గురుప్రధానిని జీజేఎం.. దార్జీలింగ్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపాకు మద్దతిస్తోంది. ఆ పార్టీయే శాశ్వత పరిష్కారం చూపగలదని చెబుతోంది.
- గతంలో గూర్ఖాలాండ్లో ఉద్యమంలో పాల్గొన్న నేతలతోపాటు స్థానికంగా బలమున్న వారికి భాజపా టికెట్లు ఇచ్చింది.
- బీజీపీఎంలా కాకుండా గూర్ఖాలాండ్ డిమాండుకే ఐజీజేఎఫ్ కట్టుబడి ఉంది.