అంగన్వాడీ కేంద్రాలకు హాఫ్ డే.. | Telangana Govt Announces Half-Day for Anganwadi Centres Amid Summer Heat Siva


ABN
ప్రచురణ తేదీ – మార్చి 31, 2026 | 09:47 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు హాఫ్ డే విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే అంగన్వాడీ కేంద్రాలు..

అంగన్వాడీ కేంద్రాలకు హాఫ్ డే..

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు హాఫ్ డే విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే అంగన్వాడీ కేంద్రాలు పని చేయనున్నాయి. మే 1 నుంచి మే 31 వరకు అంగన్వాడీ పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కూడా సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

అయితే, సెలవుల సమయంలో కూడా సిబ్బందికి కీలక బాధ్యతలు అప్పటించారు. పిల్లలకు టేక్ హోమ్ రేషన్(THR) పంపిణీ తప్పనిసరి చేసింది సర్కార్. 0 – 5 ఏళ్ల పిల్లల అభివృద్ధిపై ఇంటింటా సర్వేలు నిర్వహించనున్నారు. డ్రాప్‌ఔట్ పిల్లలను మళ్లీ అంగన్వాడీల్లో చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 27 – మే 2 ‘చైల్డ్ సేఫ్టీ వీక్’ నిర్వహణ, మే 25 – 30 ‘వుమెన్ థీమ్ వీక్’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి:

ట్యాంక్ బండ్ శివకు సాయం అందించిన సీఎం రేవంత్

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగలు.. లక్నోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: మంత్రి లోకేశ్

నవీకరించబడిన తేదీ – మార్చి 31, 2026 | 09:47 PM



Source link

Spread the love