
బీర్కూర్: బీర్కూర్ తండాలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి గర్భగుడిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామస్థులు, దాతల సాయంతో రూ.10 లక్షలతో ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు. హోమం, బలి పూర్ణాహుతి, మంత్రపుష్పం, హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.