రాఘవ్ చద్దా: ఆమ్ఆద్మీ పార్టీ యాక్షన్‌కు రాఘవ్ చద్దా స్ట్రాంగ్ రియాక్షన్! గొంతు నొక్కుతున్నారా అంటూ క్వశ్చన్స్!


త్వరిత పఠనాన్ని చూపు

AI ద్వారా రూపొందించబడిన ముఖ్య అంశాలు, న్యూస్‌రూమ్ ద్వారా ధృవీకరించబడ్డాయి

రాఘవ్ చద్దా: దేశ రాజకీయాల్లో యువ నాయకుడిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ గొంతుకగా ఉన్న రాఘవ్‌ చద్దాను రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌ పదవి నుంచి ఆప్ తప్పించింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్‌కు పార్టీ అధికారికంగా లేఖ రాసింది. స్పందించిన చద్దా తాను మౌనంగా ఉన్నంత మాత్రాన ఓడిపోయినట్టు కాదని అన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తే తన గొంతు నొక్కాలని చూస్తున్నారని అన్నారు.

రాఘవ్ చద్దా స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్‌ మిట్టల్‌ను కొత్త డిప్యూటీ లీడర్‌గా నియమిస్తూ పార్టీ ప్రకటించారు. అదనంగా పార్టీ కోటా కింద సభలో మాట్లాడేందుకు రాఘవ్‌ చద్దాకు సమయం కేటాయించలేదు. ఈ అనూహ్య నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చ్ఛకు దారి తీసింది. పంజాబ్‌ నుంచి రాజ్యసభకు నిర్వహిస్తున్న చద్దా, గతంలో పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉండేవారు.

ఓడించలేరని ఘాటుగా స్పందించిన చద్దా

ఆప్ తీసుకున్న చర్యలపై రాఘవ్ చద్దా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిశ్శబ్బంగా ఉన్నానే కానీ ఓడిపోలేదు అంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన ఆప్ నాయకత్వంపై సూటి ప్రశ్నలు గుప్పించారు. “పార్లమెట్‌లో నాకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలనే ప్రస్తావించాను. సాధారణంగా ఎవరూ మాట్లాడని అంశాలు నేను లేవనెత్తుతుండవచ్చు, కానీ ప్రజాసమస్యలను లేవనెత్తడం నేరమా? నేను ఏదైనా తప్పు చేశానా? అని ఆయన ప్రశ్నించారు.

తొలగింపునకు అసలు కారణాలేంటి?

రాఘవ్ చద్దా తొలగింపు వెనుక గత కొన్ని నెలలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు కారణమని విశ్లేషకులు. ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు సమయంలో చద్దా లండన్‌లో ఉండటం, ఆ సమయంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై నాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు కోర్టులో ఊరట లభించినప్పుడు కూడా చద్దా బహిరంగంగా ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు. అసోం, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల ఎన్నికల ప్రచారకర్తల జాబితాలో చద్దా పేరు లేకపోవడంతో ఆయన ప్రాధాన్యత తగ్గిందనేదానికి సంకేతంగా ఎదురుచూస్తున్నారు. ముంబై విమానాశ్రయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉడాన్ యాత్రి కేఫ్‌ను ప్రశంసిస్తూ ఆయన చేసిన పోస్ట్‌కు కూడా నచ్చలేదని సమాచారం.

ఇది సాధారణ విషయమేనని అంటున్నారు అశోక్‌ మిట్టల్. గతంలో ఎన్డీ గుప్తా ఉండే వారని ఆయన స్థానంలో చద్దాకు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తనకు బాధ్యతలను అప్పగించారని వివరించారు.

ఆహారం కల్తీ, గిగ్ వర్కర్ల సమస్యలు, రైల్వే భద్రత, న్యాయ సంస్కరణలు, టెలికాం రెగ్యులేషన్, ఇన్సూరెన్స్, వంటి సమస్యలు చద్దా గళమెత్తారు. ఇంతటి చురుకైన నాయకుడిని ఆప్ పక్కన పెట్టడం వెనుక అసలు కారణాలు ఏమై ఉన్నా సరే ఆ పార్టీ భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వాతి మలివాల్ తర్వాత ఆప్ నాయకత్వంతో విభేదాలు వచ్చిన రెండో ముఖ్యమైన ఎంపీ రాఘవ్ చద్దా.

మరిన్ని చదవండి

ఇంకా చదవండి





Source link

Spread the love