పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంఘర్షణకు మధ్యవర్తిత్వం వహించాలని గ్లోబల్ థింక్ ట్యాంక్‌లు ప్రధాని మోదీని కోరాయి


  • మోడీ గారు యుద్ధాన్ని ఆపండి..
  • అన్ని దేశాలతో మీకు సత్సంబంధాలు ఉన్నాయి..
  • యూరోపియన్ థింక్ ట్యాంక్ విజ్ఞప్తి..
PM Modi: “మోడీ గారు యుద్ధాన్ని ఆపండి”.. ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ విజ్ఞప్తి

ప్రధాని మోదీ: ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న వేళ, ప్రపంచంలోని వివిధ రాజకీయ ప్రముఖులు, ప్రధాని నరేంద్రమోడీ యుద్ధాన్ని ఆపేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ అనే థింక్ ట్యాంక్‌లో ఇరాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న అలీ వాజ్ మాట్లాడుతూ.. ఇరాన్ సంక్షోభాన్ని పరిష్కరించిన భారత ప్రధాని నరేంద్రమోడీ చొరవ, పరిణతి, అనుభవం ఉన్న దేశంగా భారత్ ఈ సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు.

ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ అనేది బెల్జిని బ్రస్సెల్స్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక స్వతంత్ర సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలపై నివేదిక అందిస్తుంది. ఇది ఏ ప్రభుత్వానికి లేదా ఏ అధ్యక్షుడి ఆధీనంలో ఉండదు. అలీ వాజ్ ఇరాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా, ఇరాన్ సంబంధిత విషయాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఒప్పందం అలీ వాజ్ మాట్లాడుతూ.. అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్న మోడీ ఉద్రిక్తతలు తగ్గేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Most Expensive Tea: కిలో టీ పొడితో లగ్జరీ విల్లా కొనేయొచ్చు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రూ.9 కోట్ల ‘చాయ్’ విశేషాలివే!

భారత్ నుంచి మరిన్ని చర్యలను ఆశిస్తున్నామని, భారత్ ఎంతో చేయగలని, హార్ముజ్ జలసంధిని మూసివేసిన తరుణంలో భారత్ అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ఒక ఒప్పందానికి ప్రయత్నించడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. ఈ దశలో కాల్పుల విరమణకు అవకాశం లేదు, రెండు పక్షాలు కూడా ఒకరినొకరు దెబ్బ కొట్టగలమని నమ్ముతున్నాయని ఇలాంటి సమయంలో భారత్ చొరవ తీసుకోవడానికి అలీ వాజ్ సూచన.

గతంలో ఇరాన్, అమెరికా యుద్ధాన్ని మోడీ ఆపగలరని కొంత మంది అమెరికన్ నిపుణులు కూడా అనడం. భారత్ మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వస్తే, అమెరికా అధ్యక్షుడు, మోదీల మధ్య చర్చలు ముందుకు సాగడానికి అమెరికా యుద్ధ నిపుణుడు డగ్లస్ మెక్‌గ్రెగర్ అన్నారు. రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వంటి ప్రధాన శక్తుల మధ్య విశ్వాస వారధిగా మారే సత్తా ప్రధాని మోదీకి ఉందని మెక్‌గ్రెగర్ అన్నారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం గురించి మాట్లాడుతూ.. ఆర్థిక,రాజకీయ అస్థిరత కారణంగా పాక్ తటస్థ మధ్యవర్తిగా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు.





Source link

Spread the love