కేంద్ర మాజీమంత్రి కన్నుమూత: శాఖల్లో నాటి సంస్కరణలే నేడు.. | కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మొహసినా కిద్వాయ్ (94) కన్నుమూశారు


భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మొహసిన కిద్వాయ్ కన్నుమూశారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ తెల్లజామున నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివ దేహానికి ఈ సాయంత్రం 5 గంటలకు దేశ రాజధానిలోని నిజాముద్దీన్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గాల్లో కీలక శాఖలు నిర్వర్తించారు.

మొహసినా కిద్వాయ్ మరణం పట్ల కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి విధేయురాలుగా అభివర్ణించారు. ఆమె జీవితం మొత్తం ప్రజా సేవకు అంకితం చేశారు. సౌమ్యురాలిగా, వివాదరహితురాలిగా రాజకీయాల్లో రాణించారని, అనేక తరాల మహిళలకు స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మొహసినా కిద్వాయ్ (94) కన్నుమూశారు

1932 జనవరి 1న ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో జన్మించిన మొహసినా కిద్వాయ్.. చిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి వచ్చారు. మొదటి రాష్ట్రం, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నియోజకవర్గం నుండి పలుమార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004 నుండి 2016 వరకు ఛత్తీస్‌గఢ్ నుండి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. జాతీయ స్థాయిలో పలు బిల్లులపై చర్చించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించారు.

కిద్వాయ్ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానుల మంత్రివర్గాల్లో అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. అభివృద్ధి, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, గ్రామీణ రవాణా- జాతీయ మున్సిపల్, మున్సిపాలిటీలు పట్టణాభివృద్ధి శాఖలు ఉన్నాయి. పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యురాలిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. వ్యూహరచన, సంస్థాగత వ్యవహారాలు, యువ నాయకుల మార్గదర్శకత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మై లైఫ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ పేరుతో ఆత్మకథను రాశారు.





Source link

Spread the love