
హైదరాబాద్: గత ఏడాదిన్నర కాలంలో 763 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా డీజీపీ ఎదుట లొంగిపోయారు. వీరిలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు కూడా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ పెరగడంతో మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణకు చెందివారు కాగా.. ఎక్కువమంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే.
‘‘లొంగిపోయిన వారికి పునరావాస ప్యాకేజీ కింద రూ.1.93 కోట్లు అందజేస్తున్నాం. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యకార్డులు అందజేస్తాం. తెలంగాణకు చెందిన వాళ్లు సెంట్రల్ కమిటీలో 11 మంది ఉండేవారు. ఇప్పుడు ఇద్దరున్నారు. స్టేట్ కమిటీలో తెలంగాణ వాళ్లు 24 మంది ఉండేవారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. వాళ్లు కూడా లొంగిపోవాలని పిలుపునిస్తున్నాం’’ అని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు.