IND vs AUS 4వ T20: క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో దూసుకుపోయింది.
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (30-24 బంతుల్లో 4 ఫోర్లు), మాథ్యూ షార్ట్ (25-9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లు రాణించారు. జోష్ ఇంగ్లిష్ (12), టిమ్ డేవిడ్ (14), జోష్ ఫిలిప్ (10), గ్లెన్ మాక్స్వెల్ (2)లు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, శివమ్ దూబెలు చెరో రెండు వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (46-39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) కొంచెంలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు. అభిషేక్ శర్మ (28-21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), శివమ్ దూబె (22-18 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (20-10 బంతుల్లో 2 సిక్సర్లు) పర్వాలేదనిపించారు.
ఇక చివరిలో అక్షర్ పటేల్ (21 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. జితేశ్ శర్మ (3), తిలక్ వర్మ (5)లు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా, నాథన్ ఎలిస్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. జేవియర్ బార్ట్లెట్, మార్కస్ స్టోయినిస్ తలా ఓ వికెట్ సాధించారు.
వాషింగ్టన్ సుందర్ స్టైల్‌గా విషయాలు ముగించాడు
నుండి అద్భుతమైన ప్రదర్శన #టీమిండియా వారు 4⃣8⃣ పరుగుల తేడాతో 4⃣వ T20Iని గెలుచుకున్నారు. 👏👏
వారు ఇప్పుడు 2⃣-1⃣ ఆధిక్యంలో ఉన్నారు #AUSvIND 1⃣ మ్యాచ్‌తో T20I సిరీస్ ఆడాల్సి ఉంది. 🙌
స్కోర్‌కార్డ్ ▶ https://t.co/OYJNZ57GLX pic.twitter.com/QLh2SRqW9U
— BCCI (@BCCI) నవంబర్ 6, 2025
ఇది కూడా చదవండి: Pm Modi: పీఎం సార్.. మీ స్కిన్ కేర్ సీక్రెట్ చెప్పండి.. హర్లీన్ డియోల్ ప్రశ్నకు బ్లష్ అయిన ప్రధాని..!
ఇది కూడా చదవండి: బెట్టింగ్ యాప్ కేసు: సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌కు బిగ్ షాకిచ్చిన ఈడీ.. బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తులు సీజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U
లింక్ – https://apple.co/3loQYe
ట్విట్టర్, ఫేస్బుక్ సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ క్లిక్ చేయండి.