AP: ఎంఎస్‌కే ప్రసాద్‌కు ఘోర అవమానం | ప్రపంచకప్ విజేత సభ్యురాలు శ్రీ చరణి స్వాగతం సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ MSKకి అవమానం జరిగింది.


ప్రపంచకప్ విజేత సభ్యురాలు శ్రీ చరణి స్వాగతం సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ MSKకి అవమానం జరిగింది.

గతంలో మాజీ చీఫ్‌ సెలెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌కు ఘోర అవమానం జరిగింది. మహిళల ప్రపంచకప్‌-2025 విన్నర్‌ నల్లపురెడ్డి శ్రీచరణికి స్వాగతం పలికేందుకు ఎంఎస్‌కే ఇవాళ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లగా.. అక్కడ ప్రోటోకాల్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. జాబితాలో పేరు లేదని బయటికి పంపించారు.

ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎంఎస్‌కే సీఎంఓలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లోని (ఏసీఏ) కొందరు ముఖ్యులపై బీసీసీఐకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు. భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టుకు చీఫ్‌ సెలెక్టర్‌గా వ్యవహరించిన తనకు ప్రోటోకాల్‌ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం శ్రీచరణి అభినందన కూడా ఎంఎస్‌కే హాజరు కాలేదు. విమానాశ్రయం నుంచి జరిగిన ర్యాలీలో కూడా కనిపించలేదు. సీఎం చంద్రబాబు, లోకేష్‌తో శ్రీచరణి భేటీకి కూడా వెళ్లలేదు.

కాగా, విమానాశ్రయంలోని ఎంట్రీ లాంజ్‌లోకి చాలామంది రాజకీయ నాయకులను అనుమతించిన ప్రోటోకాల్ సిబ్బంది.



Source link

Spread the love