OnePlus 15R భారతదేశంలో త్వరలో ప్రారంభం: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) త్వరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. వన్ ప్లస్ 15R (OnePlus 15R) పేరుతో కొత్త మోడల్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఈ డివైస్ టెస్టింగ్ స్టేజీలో ఉంది. వన్‌ప్లస్ ఇండియా వెబ్సైట్లో ‘కమింగ్ సూన్’ ట్యాగ్‌తో ఈ కొత్త మోడల్ ఫోన్ దర్శనమిస్తుంది. ఈ ఫోన్ మధ్యస్థాయి బడ్జెట్లో ఉన్నట్లు చూపిస్తుంది. ఈ మొబైల్ మార్కెట్లో ఎప్పుడు విడుదల కానుందన్న అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో విడుదల చేయబోతున్నట్లు ఆ సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కనిపిస్తుంది. అయితే ఈ కొత్త మోడల్ వచ్చే నెలలో ఈ ఫోన్ ఇండియాలో రిలీజ్ కానుందని మార్కెట్ వర్గాల సమాచారం.
ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
-డ్యూయల్ రియర్ కెమెరా -ఆక్సిజన్ OS16 -6.83-ఇంటన్ 1.5k AMOLED డిస్ప్లే -స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ లేదా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 SoC -అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ -50MP ప్రధాన కెమెరా -100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -7 బ్యాటరీ -7 బ్యాటరీ ఆకుపచ్చ)
అమెరికాలో విడుదల ఆలస్యం
దీనికి ముందు వన్‌ప్లాస్ 15 మోడల్ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ Qualcomm కొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌ను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన అమెరికా మాత్రం ఆ మోడల్ ఫోన్ లాంచ్ కాలేదు. అమెరికాలో షట్‌డౌన్ కారణంగా రెగ్యులేటరీ సర్టిఫికేషన్లు లభించలేదు. దీని వల్ల వన్‌ప్లస్ 15 మోడల్ ఫోన్ లాంచ్ అమెరికాలో ఆలస్యమవుతుండగా.. త్వరలో అక్కడ కూడా క్లియరెన్స్ రా నుందని సూచిస్తుంది. దీనికి కొనసాగింపుగా అడ్వాన్స్ ఫీచర్లతో 15R మోడల్ ఫోన్‌ను త్వరలో వన్‌ప్లాస్ అందుబాటులోకి తీసుకురానుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి