భారత రక్షణ రంగానికి సంబంధించి మరో కీలక ఒప్పందం జరిగింది. హామర్ మిస్సైల్ సిస్టమ్‌ను ఉత్పత్తి చేయడం కోసం.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సంతకాలు చేశాయి. ఇది ఆకాశం నుంచి భూమిపైకి అత్యంత కచ్చితత్వంతో ప్రయోగించే స్మార్ట్ ప్రిసిషన్ గైడెడ్ ఆయుధ వ్యవస్థ. ఈ హామర్ మిస్సైల్ సిస్టమ్‌ను రఫేల్, తేజస్ వంటి ఫైటర్ జెట్‌లకు ఉపయోగించవచ్చు. ఇది మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు బలాన్ని చేకూర్చుతుందని రక్షణగా ఉన్నాయి.

ఈ ఒప్పందం ద్వారా.. అత్యంత కచ్చితత్వంతో కూడిన హామర్ (HAMMER -Highly Agile Modular Munition Extended Range) స్మార్ట్ ప్రిసిషన్ గైడెడ్ మిస్సైల్ సిస్టమ్‌ను భారత్‌లోనే ఉత్పత్తి చేస్తుంది.
HAMMER ప్రత్యేకతలు
హామర్ ఆయుధ వ్యవస్థ యుద్ధరంగంలో ఇప్పటికే సక్సెస్ అయింది. అధిక కచ్చితత్వం, మాడ్యులర్ డిజైన్‌తో కూడిన ఈ ఆయుధ వ్యవస్థ.. యుద్ధంలో తన సత్తాను ప్రదర్శించింది. ఇక ఈ హామర్ ఆయుధ వ్యవస్థను.. రఫేల్ యుద్ధ విమానాలతోపాటు.. తేలికపాటి ఫైటర్ జెట్ అయిన తేజస్ సహా పలు విమానాల నుంచి ప్రయోగించడానికి వీలుగా తయారు చేశారు.
సగం వాటాతో సంయుక్త సంస్థ
ఇక ఈ హామర్ ఆయుధ వ్యవస్థను తయారు చేయడానికి.. బీఈఎల్, ఎస్ఈడీ సంస్థలు చెరి సగం వాటాతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపంలో సంయుక్త సంస్థను (జాయింట్ వెంచర్ కంపెనీ) ఏర్పాటు చేస్తున్నాయి. ఈ జేవీసీ ఏర్పాటుకు సంబంధించి తాజా ఫిబ్రవరి 11వ తేదీన ఏరో ఇండియా సందర్భంగా కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేసింది.
ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలు
భారత వైమానిక దళం, భారత నావికాదళం కార్యాచరణ అవసరాల కోసం హామర్ మిస్సైల్ సిస్టమ్‌ను తయారు చేయడం, సరఫరా చేయడంతోపాటు… వాటి మెయింటెనెన్సును మన దేశంలోనే చూసుకోవడం. ఈ హామర్ ఆయుధ వ్యవస్థను స్వదేశంలోనే 60 శాతం వరకు తయారు చేయాలని పెట్టుకున్నారు. వీటికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విడిభాగాలు స్థానికంగానే తయారు చేయనున్నారు.
ఇక ఈ హామర్ ఆయుధ వ్యవస్థ ఉత్పత్తి దశలవారిగా బదిలీ చేయబడుతుంది. ఇందులో ఫైనల్ అసబుల్, టెస్టింగ్, కంపెనీలకు సంబంధించిన వాటిని బీఈఎల్ చేపడుతుంది. ఢిల్లీలో జరిగిన ఈ ఒప్పందంపై బీఈఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ జైన్.. ఎస్ఈడీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ జీగ్లర్ సంతకాలు చేశారు. ఇది భారత అమ్ముల పొదిలోకి చేరితే.. శత్రుదేశమైన పాకిస్తాన్‌కు ఇక చుక్కలు చూపించి రక్షణ రంగ నిపుణులు చూస్తున్నారు.
