భారత్- రష్యా మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలపరుచుకోవడానికి, డిసెంబర్ 4-5 తేదీలలో ఇటీవల.. మెగా ఇండియా-రష్యా బిజినెస్ ఫోరమ్‌కు ఆతిథ్యమివ్వడానికి సిద్ధంగా ఉంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనతో సమానంగా జరుగుతున్న ఈ ఫోరం.. రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కించే సౌకర్యాన్ని అందించబోతోంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యంలో 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడం ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఫోరం కొనసాగనుంది.
ఈ ఫోరం కీలకంగా ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆహారం & సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు, డిజిటల్ సేవలు, ఔషధ & మెడ్‌టెక్ పరిశ్రమల్లో పెంపుపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. భారతీయ సాంకేతికత రష్యన్ మార్కెట్లో ఉనికిని విస్తరించడం, రష్యా భారతదేశం నుండి మరిన్ని ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడం, డిజిటల్ సేవలను పొందడం, రష్యన్ కొనుగోళ్లు పెంపు వంటి అంశాలు చర్చలో ప్రధానంగా ఉంటాయని అధికారులు గుర్తించారు.

ఈ ఫోరమ్‌లో భారతీయ సరఫరాదారుల ఉనికిని రష్యాలో పెంచడం, ఉమ్మడి పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు, సాంకేతిక పరిజ్ఞానాలలో భాగస్వామ్యాన్ని విస్తరించడం వంటి అంశాలు అజెండాలో ఉన్నాయి. రష్యా, భారతదేశం నుండి నైపుణ్యంతో కూడిన మానవ వనరులను ఆకర్షించడానికి ఆసక్తి చూపుతోంది. రష్యాలో పనిచేస్తున్న భారతీయ నిపుణుల సంఖ్య ప్రస్తుతం పెరుగుతుండటం దీనికి నిదర్శనం.
వైద్య పరిశ్రమలో భాగస్వామ్యం రెండు దేశాలకు అత్యంత వ్యూహాత్మకంగా పరిగణించబడుతోంది. రష్యన్ మార్కెట్లో భారతీయ ఔషధాల సరఫరాను పెంచడం, రష్యాలో భారతీయ కంపెనీల ఉత్పత్తిని స్థానికీకరించడం, అత్యాధునిక మెడ్‌టెక్ తయారీ యూనిట్లను కలిసి ఏర్పాటు చేయడం వంటి అంశాలు రెండు దేశాల ఆరోగ్య సంరక్షణ పరిజ్ఞానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలకు అవసరమైన నియంత్రణ విధానాలు, పెట్టుబడి వ్యవస్థలపై చర్చించారు.
భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కేలబుల్ సాఫ్ట్వేర్, AI ఆధారిత పరిష్కారాలలో ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. రష్యా శాస్త్రీయ పరిశోధన, రక్షిత కమ్యూనికేషన్, అధునాతన కంప్యూటింగ్ రంగాలలో బలమైన అనుభవం ఉంది. ఈ రెండు బలాలు కలిసితే, ఉమ్మడి డిజిటల్ అభివృద్ధి, AI పరిశోధనలకు విస్తృత అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ టెక్నాలజీలలో సహకారం కోసం ప్రాధాన్యతా మార్గాలను గుర్తించడం ఈ ఫోరం ముఖ్య లక్ష్యం.
భారతీయ నైపుణ్య కార్మిక శక్తిని రష్యాలో మరింతగా ఉపాధిలోకి తీసుకోవడానికి ఒక మొబిలిటీ అగ్రిమెంట్ పై సంతకాలు జరగనున్నాయి. రష్యాలో వివిధ నగరాల్లో భారతీయ నిపుణుల అవసరం పెరుగుతుందని, ఇది రెండు దేశాలకు పరస్పర ప్రయోజనకర అవకాశం కలిగించనుంది.
ఇటీవలి కాలంలో రష్యాకు కూరగాయలు, ఆకుకూరలు, రెడీమేడ్ మీల్స్, స్నాక్స్, మిఠాయిలు, వెన్న, పాల కొవ్వు, ద్రాక్ష వంటి వస్తువుల ఎగుమతి పెరిగింది. అమెరికా సుంకాల కారణంగా సీఫుడ్ ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో..భారతీయ రొయ్యలను రష్యాకు ఎగుమతి చేయడంపై చర్చలు కొనసాగుతున్నాయి. మూడు పదార్థాలు అయిన..మిల్లెట్లు, సాంప్రదాయ స్వీట్లు సముద్ర ఆహారం రష్యాలో భారీ అవకాశాలు ఉన్నాయి.
