లడఖ్‌లోని గాల్వాన్ వార్ మెమోరియల్: లద్దాఖ్‌లో గల్వాన్ యుద్ధ స్మారకం


ABN
ప్రచురణ తేదీ – డిసెంబర్ 08, 2025 | 03:43 AM

గల్వాన్‌లో చైనాతో ఘర్షణ జరిగిన ఐదేళ్ల తర్వాత భారత్‌.. లద్దాఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డీ మార్గంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో యుద్ధస్మారకాన్ని నిర్మించింది….

లడఖ్‌లోని గాల్వాన్ వార్ మెమోరియల్: లద్దాఖ్‌లో గల్వాన్ యుద్ధ స్మారకం

న్యూఢిల్లీ, డిసెంబరు 7: గల్వాన్‌లో చైనాతో ఘర్షణ జరిగిన ఐదేళ్ల తర్వాత భారత్‌.. లద్దాఖ్‌లోని దౌలత్‌ బేగ్‌ ఓల్డీ మార్గంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో యుద్ధస్మారకాన్ని నిర్మించారు. 2020 జూన్ 15 రాత్రి సమయంలో చైనా బలగాలతో వీరోచిత పోరాటం చేసి అమరులైన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన ఈ స్మారకాన్ని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. భారత్‌ రణభూమి దర్శనం కార్యక్రమం కింద.. త్యాగం, వీరత్వానికి ప్రతీకగా ఎరుపు-నలుపు రంగు గ్రానైట్‌ రాళ్లతో త్రిశూలం-ఢమరుకం ఆకారంలో ఈ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. ఈ కాంప్లెక్స్‌లో మ్యూజియం, డిజిటల్‌ గ్యాలరీ, గల్వాన్‌ ఘటన వివరాలు, లడక్‌ సైనిక చరిత్రను తెలుసుకునే ఏర్పాట్లు చేశారు. ఆడిటోరియం కూడా నిర్మించారు. మరోవైపు చైనాలోని షాంఘైలో భారత్‌ కొత్త కాన్సులెట్‌ భవనాన్ని ప్రారంభించింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాల్లో పురస్కరించుకుని చైనాలో భారత రాయబారి ప్రదీప్‌ రావత్‌ ఈ సందర్భాన్ని కలిగి ఉంది.

నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 08, 2025 | 03:43 AM



Source link

Spread the love