దేశంలోనే మహిళలకు బెస్ట్ సిటీగా బెంగళూరు రికార్డు సృష్టించింది. టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా 2025 నివేదిక ప్రకారం.. మహిళా సాధికారత, ఉద్యోగ అవకాశాల్లో బెంగళూరు దేశంలోనే నంబర్ 1 నగరంగా నిలిచింది. భద్రతలో మొదటి స్థానంలో చెన్నై ఉండగా.. హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తం మీద దక్షిణ, పశ్చిమ భారతదేశ నగరాలు మహిళలకు అత్యంత సురక్షితమైన, వృద్ధిని ఇచ్చే ప్రాంతాలుగా తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి.

మొత్తం స్కోరులో 53.29 పాయింట్లతో మొదటి స్థానంలో బెంగళూరు నిలిచింది. ఆ తర్వాత 49.86 పాయింట్లతో చెన్నై రెండో స్థానంలో నిలిచింది. ఇక టాప్ -5లో ఉన్న పుణె (46.27).. హైదరాబాద్ (46.04).. ముంబై (44.49) వరుసగా నిలిచాయి. ప్రాథమికంగా రెండు అంశాల మీద ఈ అధ్యయనం జరిగింది. ఒక సామాజిక భద్రత, జీవన ప్రమాణాలను కొలిచే సోషల్ ఇంక్లూజన్ స్కోర్.. రెండోది ఉద్యోగ అవకాశాలు, పని వాతావరణాన్ని కొలిచే ఇండస్ట్రియల్ ఇంక్లూజన్ స్కోర్.
మహిళల భద్రత, ప్రభుత్వ సేవలు, విద్య, ఆరోగ్య సౌకర్యాల విషయంలో చెన్నై నగరం దేశంలోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే.. బలమైన సూచిక వ్యవస్థ, స్టార్టప్‌లు, విస్తృతమైన ఉద్యోగ అవకాశాల కారణంగా బెంగళూరు పారిశ్రామిక అగ్రస్థానంలో నిలిచిపోయిన ఒవరాల్‌గా నంబర్ 1 నగరంగా మారింది. హైదరాబాద్, పుణె నగరాలు అటు సామాజిక భద్రత.
ఈ నివేదికలోని మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. టాప్ 10 నగరాల జాబితాలో దక్షిణ భారతదేశం నుంచి.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం, కోయంబత్తూర్ అనే 5 నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇది దక్షిణ భారత్‌లో మహిళలకు ఉన్న సురక్షితమైన, వృద్ధిదాయకమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. ఉత్తర భారతదేశం నుంచి.. గురుగ్రామ్ ఒక్కటే 6వ స్థానంలో నిలిచిన టాప్ 10 నగరాల జాబితాలో చేరింది.
