వ్యూహాత్మక భాగస్వామ్యంపై మెక్రాన్ సానుకూలతకు ప్రశంసలు

పారిస్‌లో భారత్ – ఫ్రాన్స్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌తో జైశంకర్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ గురువారం భేటీ అయ్యారు. ప్రపంచ పరిణామాలపై ఆయనతో చర్చించారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంపట్ల మెక్రాన్ సానుకూలతను శుక్రవారం ఆయన ఎక్స్‌లో ప్రశంసించారు. ఫ్రాన్స్, లక్సెంబర్గ్‌లలో ఆరు రోజుల పర్యటనలో ఉన్న జైశంకర్.. గురువారం ఫ్రాన్స్ రాయబారుల సమావేశంలోనూ ప్రసంగించారు. వాణిజ్యం, ఆర్థిక, సాంకేతికత, ఇంధన వనరులు, అనుసంధానత వంటి అంశాలే ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు కారణమవుతున్నాయి. ‘ఫ్రాన్సు అధ్యక్షుడిని కలిసి ప్రధాని నరేంద్రన్స్ శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉంది. సమకాలీన ప్రపంచ పరిణామాలు, మన వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల మెక్రాన్‌కు ఉన్న భావాలను అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు.
భారత్ పర్యటనకు మెక్రాన్..
వచ్చే నెలలో భారత్‌ను సందర్శించారు. ఢిల్లీలో జరగనున్న ‘ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో పాల్గొనేందుకు భారత్ ఐ రానున్నట్లు ఆయన తెలిపారు.
జైశంకర్‌కు శుభాకాంక్షలు
ఢిల్లీ: జైశంకర్‌కు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దౌత్యవేత్తగా సేవలందించడంతోపాటు భారత్ విదేశాంగ పనితీరును బలోపేతం చేయడంతో ఆయన కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు.
అమెరికాలో 670కి.మీ. రోడ్డు ప్రయాణం
న్యూయార్క్: గత ఏడాది కాలం పాటు కొనసాగిన ప్రభుత్వ మూసివేత (షట్‌డౌన్) సమయంలో నిలిచిపోయిన విమాన సర్వీసుల కారణంగా జైశంకర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అగ్ర రాజ్యంలో ఆయన దాదాపు 670 కి.మీ. రోడ్డు మార్గంలోనే సేవలందించిన విషయం తాజాగా విడుదలైన విదేశీ వ్యవహారాల శాఖ నివేదికద్వారా వెల్లడైంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోని గుటెరస్‌తో సమావేశం కోసం గత ఏడాది నవంబరులో జైశంకర్ అగ్రరాజ్యానికి వెళ్లినపుడు షట్ డౌన్ కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది.