AP News Updates: విజయవాడ-విశాఖ 12 జన్ సాధారణ రైళ్లు | జాతీయం-అంతర్జాతీయం


సంక్రాంతి రద్దీ బాగా పెరగడంతో రైల్వే అధికారులు మరికొన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. విజయవాడ-విశాఖ మధ్య 12 జన సాధారణ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. ఇవి అన్ రిజర్వుడ్ టికెట్ పొంది ప్రయాణించే రైళ్లు. ఈ రైళ్లు 14, 16, 17, 18 తేదీల్లో సర్వీసులు అందిస్తాయి. విశాఖ-విజయవాడ జన సాధారణ ఎక్స్‌ప్రెస్ (08567) రైలు నిర్ణీత తేదీల్లో విశాఖలో ఉదయం 10కి బయల్దేరి, సాయంత్రం 4కి విజయవాడకు వెళ్తుంది. అలాగే విజయవాడ-విశాఖ ప్రత్యేక రైలు (08568) విజయవాడలో సాయంత్రం 6.30కి బయల్దేరి, రాత్రి 12.35కి విశాఖకు వెళ్తుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

నేడు భోగి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ రెండో రోజు జరుగుతుంది. సీఎం చంద్రబాబు నారావారి పల్లెలో వేడుకలు జరుపుకుంటున్నారు. నేడు మేడారంలో శుద్ది పండుగ (గుడిమెలిగే) జరుగుతుంది. పశ్చిమగోదావరి, నరసాపురంలో నేటి నుంచి జాతీయ స్ధాయి కబడ్డీ పోటీలు జరుగుతాయి. కృష్ణా జిల్లా, ఘంటసాలలో నేటి నుంచి ఒంగోలు జాతి పశు ప్రదర్శన పోటీలు జరుగుతాయి. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా, శర్వానంద్.. నారీ నారీ నడుమ మురారీ సినిమా ఇవాళ రిలీజ్ అవుతున్నాయి. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో శివాజీ దండోరా మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇవాళ ఇండియా, న్యూజిలాండ్ సెకండ్ వన్డే ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love