సికింద్రాబాద్ కార్పొరేషన్ పై రగడ.. పొలిటికల్ క్రెడిట్ కోసమేనా?


దిశ, సికింద్రాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సికింద్రాబాద్ అస్తిత్వంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ యుద్ధ కార్పొరేషన్ ను విభజించి, కొత్తగా మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదన ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలకు దారితీసింది. ముఖ్యంగా 220 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ను విస్మరించి, మల్కాజిగిరి కేంద్రంగా ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. సికింద్రాబాద్‌ను ఎలాగైనా ప్రత్యేక సంస్థ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పోరు సాగిస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యచరణ తలపెట్టారు. అయితే, ఈ పోరాటం రాజకీయనేతల్లో అటు పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు పది సంవత్సరాల పాటు తిరుగులేని అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, నాడు సికింద్రాబాద్ ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకు రాలేదు? కేవలం ప్రతిపక్షంలోకి రాగానే ఈ ప్రాంత సెంటిమెంట్ గుర్తుకు రావడానికి రాజకీయ అవసరమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

చారిత్రక నేపథ్యం..

చారిత్రక నేపథ్యాన్ని గుర్తించే, 1806లో మూడో నిజాం సికిర్ జా పేరు మీదుగా ఈ నగరం, 1950ల కాలంలోనే స్వయంప్రతిపత్తి కలిగిన మున్సిపల్ కార్పొరేషన్‌గా వెలుగొందింది. 1960వ దశకంలో పరిపాలనా సౌలభ్యం కోసం దీనిని హైదరాబాద్‌తో విలీనం చేసినప్పటికీ, సికింద్రాబాద్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కాపాడుకుంటూ వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం నుంచి, కంటోన్మెంట్ బోర్డు వరకు ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతం నుంచి నేతలు మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, కంటోన్మెంట్ విలీనం కీలక లేదా సికింద్రాబాద్‌కు ప్రత్యేక హోదా కల్పించడంలో సరైన చొరవ చూపలేదన్న విమర్శలు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. నాడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి, ఇప్పుడు మల్కాజిగిరి పేరుతో విభజన జరుగుతుంటే రాద్ధాంతం చేయడం కేవలం క్రెడిట్ పాలిటిక్స్‌లో భాగమేనని అధికార పక్షం ఆరోపిస్తోంది.

మరోవైపు బీఆర్ఎస్ నేతలు తమ వాదనను భిన్నంగా వినిపిస్తున్నారు. సికిరాబాద్ అనేది కేవలం ఒక ప్రాంతం కాదని, అది ఒక సంస్కృతి అని, అటువంటి చారిత్రక నగరాన్ని కేవలం ఒక మున్సిపల్ సర్కిల్‌గా లేదా మరో కొత్త కార్పొరేషన్ కింద ఉప విభాగంగా మార్చడం అన్యాయమని వారు వాదిస్తున్నారు. కంటోన్మెంట్ విలీనం ద్వారా వచ్చే అదనపు భూభాగాన్ని కలుపుకొని సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా మార్చాలని వారు పట్టుబడుతున్నారు. కానీ, ఈ డిమాండ్ వెనుక ఉన్న చిత్తశుద్ధిని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏ మార్పు తలపెట్టినా దానిని వ్యతిరేకించడం విపక్షాల సహజ లక్షణం అయినప్పటికీ, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అడుగు ముందుకు వేయని బీఆర్ఎస్, ఇప్పుడు సికింద్రాబాద్‌ కార్డును తెరపైకి తెచ్చి ప్రజల సానుభూతిని పొందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత చదవండి ….

జిల్లాల పునర్విభజన చిక్కు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అనిశ్చితి!



Source link

Spread the love