Jan 18, 2026 22:07 IST
మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్..
ఫిబ్రవరిలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు..
పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం..
Jan 18, 2026 21:51 IST
Ind Vs NZ: సిరీస్ కివీస్‌దే..

ఇండోర్ వేదికగా భారత్‌తో జరిగిన ఆఖరి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం..
338 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. 41 పరుగుల తేడాతో ఓటమి..
ఈ మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో దక్కించుకున్న కివీస్..
Jan 18, 2026 20:55 IST
కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా..: మహిపాల్ రెడ్డి

కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాట్ కామెంట్స్.
తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరాను.
కాంగ్రెస్ పార్టీలో చేరినా వెంట్రుక వంతు లాభం జరగలేదు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలి.
Jan 18, 2026 20:09 IST
ఒకే బైక్‌పై విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ..?
టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ఒకే బైక్‌పై జర్నీ చేస్తున్నారా?
అచ్చం కోహ్లీ, ధోనీలా ఉన్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా.. వీడియో తీసిన మరో బైకర్స్.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో.
Jan 18, 2026 20:09 IST
ఫేస్బుక్ వేదికగా విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
అమ్ముడు పోయిన ‘కోటరీల’ మధ్య ‘బందీలుగా’ ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి.
భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి!
జగన్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేశారని పలువురు కామెంట్స్.
Jan 18, 2026 19:27 IST
వైఎస్ జగన్‌కు మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీలో అభివృద్ధిని అడ్డుకుందామని చూస్తున్న జగన్‌ను తరిమికొడదాం: మంత్రి కొల్లు రవీంద్ర
సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలన..
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలి: మంత్రి కొల్లు రవీంద్ర
Jan 18, 2026 19:22 IST
కోహ్లీ ఫన్నీ వీడియో వైరల్..

ఇండోర్ మైదానంలో చోటు చేసుకున్న సరదా సంఘటన అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది..
కోహ్లీ మిచెల్‌ను నెడుతున్న వీడియో వైరల్..
వీడియో చూసి మిచెల్‌తో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు..
Jan 18, 2026 19:16 IST
ధర్మాన్ని ఆశ్రయించాలి: మోహన్ భగవత్

భారతదేశం విశ్వగురువుగా ఎదిగేందుకు ధర్మాన్ని ఆశ్రయించాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ధర్మం అనే సూత్రం ప్రపంచాన్ని నడిపిస్తోంది..
మన ఆధ్యాత్మిక పరిజ్ఞానం ప్రపంచానికి చాలా అవసరం: మోహన్ భగవత్
Jan 18, 2026 19:12 IST
అసెంబ్లీ సమావేశాలపై రఘురామ క్లారిటీ

అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు..
అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకునే అంశంపై ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తోంది..
సభకు వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే అనర్హత వేటు: రఘురామ
Jan 18, 2026 18:35 IST
పశ్చిమ బెంగాల్లో ప్రధాని కీలక వ్యాఖ్యలు..

పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.
మమతా బెనర్జీ, టీఎంసీ నాయకులపై తీవ్ర విమర్శలు చేసిన పీఎం.
పశ్చిమ బెంగాల్లో జంగిల్ రాజ్‌కు వీడ్కోలు పలుకుతామన్న పీఎం.
మార్పు తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చిన పీఎం.
Jan 18, 2026 18:26 IST
వృద్ధుడి ఆకలి తీర్చిన యువకుడు..

ఆకలితో అలమటిస్తున్న వృద్ధుడి కడుపు నింపాడు ఓ యువకుడు.
కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియో నెటిజన్ల హృదయాన్ని హత్తుకుంటోంది.
Jan 18, 2026 18:22 IST
డెబ్యూలోనే అదరగొట్టిన సయాలీ..
డబ్ల్యూపీఎల్ 2026 డెబ్యూలోనే అదరగొట్టిన సయాలీ సత్ఘరే.
ఆర్సీబీ తరఫున ఆడిన సయాలీ.. 3 వికెట్లు తీసింది.
ఆర్సీబీకి ఆడాలన్న తన కోరిక నిజమైందంటూ సయాలీ ఆనందం వ్యక్తం చేసింది.
Jan 18, 2026 18:12 IST
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు బిగ్ షాక్..

భారత్‌కు తమ జట్టును పంపబోమన్న బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్ తగిలింది.
బీసీబీ(బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్) చేసిన గ్రూప్ స్వాపింగ్ ప్రతిపాదనను ఐర్లాండ్ తిరస్కరించింది.
లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడతామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
Jan 18, 2026 17:56 IST
భారత్ టార్గెట్ ఎంతంటే..
ఇండోర్ వేదికగ భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.
తొలి ఇన్నింగ్స్ ఆడిన కివీస్ టీమ్.. నిర్ణీత ఓవర్లలో 337 పరుగులు చేసింది.
టీమిండియా లక్ష్యం 338 పరుగులు.
Jan 18, 2026 17:24 IST
మొట్టమొదటి సారి నా రాజకీయ ప్రయాణం ఖమ్మం నుంచి జరిగింది: సీఎం రేవంత్
20 సంవత్సరాలలో ఖమ్మం ఎప్పుడు వచ్చినా నన్ను అభిమానించారు.
ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు కోట్ల పదిహేను లక్షల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం.
గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు.
మా ప్రభుత్వంలో అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం.
Jan 18, 2026 17:12 IST
నేరస్తులు రాజకీయ పార్టీలు నడుపుతున్నారు: సీఎం చంద్రబాబు

ప్రజలు ఒకసారే మోసపోతారు. ఇక్కడున్నది ఎన్డీయే ప్రభుత్వం.. నడిపించేది సీబీఎన్.
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి, స్వర్ణాంధ్రను సాధిస్తాం.
కక్షతీర్చుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు.
తెలుగుజాతిని బాగు చేయడానికి వచ్చాను.
Jan 18, 2026 16:57 IST
అది నోరా లేక క్రషరా..
గాజు ముక్కలను కరకరా నమిలి తినేశాడు.
రొట్టె ముక్కల తరహాలో తినేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Jan 18, 2026 16:32 IST
ట్రంప్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్న యూరప్ దేశాలు

గ్రీన్లాండ్కు మద్ధతు తెలిపే యూరప్ దేశాలపై భారీగా సుంకాలు పెంచిన ట్రంప్.
ట్రంప్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యూరప్ దేశాలు.
అమెరికా యంత్రాంగంతోనే తేల్చుకుంటామంటున్న బ్రిటన్ ప్రధాని.
అమెరికా బెదిరింపులకు భయపడేది లేదంటున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు.
Jan 18, 2026 16:27 IST
రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
డబ్ల్యూపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి.
ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది.
డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా రికార్డులోకెక్కింది.
61 బంతులు ఎదుర్కొని 96 పరుగులు చేసింది స్మృతి.
Jan 18, 2026 16:00 IST
ఇటలీ క్రికెట్ టీమ్‌లోకి సౌతాఫ్రికా ప్లేయర్..
టీ20 ప్రపంచకప్-2026కు ఇటలీ అర్హత సాధించింది.
15 మంది సభ్యుల జట్టును ఆ దేశం ప్రకటించింది.
ఈ టీమ్‌కు సీనియర్ ప్లేయర్ వేన్ మ్యాడ్సన్ సారథ్యం వహించనున్నాడు.
ఈ టీమ్‌కు గతంలో సౌతాఫ్రికా తరఫున ఆడిన ఓ ప్లేయర్ ఎంపికయ్యాడు.
Jan 18, 2026 15:54 IST
వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చిన చాట్‌జీపీటీ టిప్స్..

చాట్‌జీపీటీ సలహాలు నమ్మి ప్రాణాలమీదకు తెచ్చుకున్న వ్యక్తి.
పేషెంట్‌కు అంతర్గత రక్తస్రావం అయినట్లు గుర్తించిన ఎయిమ్స్ డాక్టర్.
ఎవరూ ఇలాంటి తప్పు చేయొద్దని హెచ్చరిక.
అనారోగ్య సమస్యలు వస్తే వైద్యులను సంప్రదించాలని సూచన.
Jan 18, 2026 15:48 IST
నా తొలి రాజకీయ ప్రయాణం ఖమ్మం నుంచే: సీఎం రేవంత్
మొట్టమొదటి సారి నా రాజకీయ ప్రయాణం ఖమ్మం నుంచి జరిగింది: సీఎం రేవంత్
20 సంవత్సరాలలో ఖమ్మం ఎప్పుడు వచ్చినా నన్ను అభిమానించారు.
ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు కోట్ల పదిహేను లక్షల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం.
గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు.
Jan 18, 2026 15:01 IST
తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్

నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు.
ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు.
భారతదేశం నాకు స్ఫూర్తి, ఇదే నా ఇల్లు.
నా నిజాయితీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
Jan 18, 2026 14:40 IST
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు: సీఎం చంద్రబాబు

‘మదరాసి’ అని అవహేళన చేస్తే తెలుగుజాతి ఒకటుందని ప్రపంచానికి గుర్తుచేసిన వ్యక్తి ఎన్టీఆర్.
ఎన్టీఆర్ రాకముందు చదువు లేని వ్యక్తులే రాజకీయాల్లో ఉండేవారు.
త్వరలో మరో 700 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం.
ఈ ఉగాదికి మరో 5 లక్షల గృహ ప్రవేశాలు కల్పిస్తాం.
Jan 18, 2026 14:34 IST
బలహీన వర్గాల వారిని నాశనం చేసిన జగన్: మంత్రి అనగాని సత్య ప్రసాద్

కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగను వైభవంగా చేసుకున్నారు.
వైసీపీ నేతలు మాత్రం సైకో ఆలోచనలోనే ఉన్నారు.
వైసిపి సైకోలు బలహీన వర్గాల తలకాయలు ఎగరేస్తున్నారు.
శవ రాజకీయాలకు కేరాఫ్ వైసీపీ.
Jan 18, 2026 13:01 IST
ఉత్తర్ ప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన
గ్రేటర్ నొయిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
గురుగ్రామ్‌లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఘటన
పిట్లో పడి చివరివరకూ ప్రాణం కాపాడుకోవడానికి విఫలయత్నం చేసిన యువరాజ్
Jan 18, 2026 12:25 IST
గుజరాత్‌లోని మోదాసా టౌన్లో యువతి ఆత్మహత్య
భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వకపోవడమే కారణం
మొబైల్ కొనుగోలు విషయమై భార్యాభర్తల మధ్య తలెత్తిన ఘర్షణ
క్షణికావేశంలో ఉరివేసుకుని భార్య బలవన్మరణం
Jan 18, 2026 12:16 IST
ఘోర రోడ్డుప్రమాదం
జగిత్యాల రూరల్ సమీపంలోని పోరండ్లలో ఘోర రోడ్డుప్రమాదం
కారు విద్యు్త్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి
మరొకరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం
సంక్రాంతి సెలవుల అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా ఘటన
Jan 18, 2026 12:14 IST
పబ్లిక్ లిస్టింగ్ కు కోకా-కోలా బెవరేజెస్
పబ్లిక్ లిస్టింగ్ రానున్న భారతీయ బాట్లింగ్ సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్
ఈ IPO ద్వారా సుమారు రూ.9,027 కోట్లు సేకరించాలని లక్ష్యం
కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లు(సుమారు రూ.90 వేల కోట్లు) ఉండేలా లక్ష్యం
Jan 18, 2026 12:07 IST
యూపీలో పొగమంచుతో ప్రమాదం.. పరస్పరం ఢీకొన్న వాహనాలు
ఉత్తర భారతదేశంలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు
పొగమంచు కారణంగా యూపీలోని అమ్రోహా జిల్లాలో ఘోరప్రమాదం
షావజ్‌పూర్ గ్రామం వద్ద ఢిల్లీ-లఖ్‌నవూ రహదారిపై ఢీకొన్న వాహనాలు
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 12 మంది ప్రయాణికులు
ప్రమాదానికి గురై దెబ్బతిన్న 10 వాహనాలు
Jan 18, 2026 11:53 IST
ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పిస్తున్న తెలుగు తమ్ముళ్లు..
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న తెలుగు తమ్ముళ్లు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, టీడీపీ శ్రేణులు ఘన నివాళులు
తెలుగు రాష్ట్రాల్లో ఊరువాడల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి పాలాభిషేకాలు
రక్త దానం సహా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు
హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు భారీగా తరలివస్తున్న అభిమానులు
Jan 18, 2026 11:24 IST
దేశ రాజధాని ఢిల్లీలో భారీగా పడిపోయిన వాయు నాణ్యత
ఆదివారం ఉదయం రాజధాని వ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొంగ మంచు
దట్టమైన పొగమంచుతో ఎదురుగా ఉన్నవేవీ కానరాని పరిస్థితి
దీంతో పలు రైళ్లు, విమానాల ప్రయాణాలు వాయిదా
Jan 18, 2026 10:48 IST
దావోస్ పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ప్రపంచ ఆర్థిక సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు
ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలర్ మేర్క్స్ సంస్థల సీఈవోలతో చర్చలు
స్విట్జర్లాండ్, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు
4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
Jan 18, 2026 10:21 IST
దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
దావోస్ పర్యటనకు వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆది, సోమవారాల్లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్న రేవంత్
ఈ పర్యటన అనంతరం సోమవారం ఉదయం దావోస్‌కు వెళ్లనున్న సీఎం
Jan 18, 2026 09:14 IST
నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న అభిమానులు, ప్రముఖులు
ఎక్స్ వేదికగా నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించిన హీరో కళ్యాణ్ రామ్, మంత్రి లోకేశ్
Jan 18, 2026 09:02 IST
తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్..
అన్నదాతలకు భారీ ఊరటనిస్తూ టీజీఈఆర్సీ ఉత్తర్వులు
ఇకపై రైతులు కిలోవాట్‌కు రూ.వెయ్యి చొప్పున ఛార్జీలు
Jan 18, 2026 07:34 IST
నిరక్షరాస్యత, పేదరికం, కరువే నా శత్రువులు: సీఎం రేవంత్ రెడ్డి
ఉన్న ఒక్క శత్రువునూ ఎన్నికల్లో ఓడించాను: సీఎం రేవంత్
మారీచుడు ఏ రూపంలో వచ్చినా కట్టిపడేస్తాం: సీఎం రేవంత్
జైపాల్‌రెడ్డి, జానారెడ్డి సమయంలో చెల్లినట్లు ఇప్పుడు చెల్లదు.. దెబ్బకు దెబ్బ తీస్తాం: సీఎం రేవంత్
Jan 18, 2026 07:32 IST
యూనిట్ విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.1.19కి తగ్గిస్తాం: సీఎం చంద్రబాబు
ఈ ఏడాదే డ్రోన్ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి: సీఎం చంద్రబాబు
సంపద సృష్టికి ఏపీని మించిన రాష్ట్రం లేదు: సీఎం చంద్రబాబు
కాకినాడలో ‘గ్రీన్ అమ్మోనియా’ ప్లాంట్ ప్రారంభించిన చంద్రబాబు, పవన్
Jan 18, 2026 07:30 IST
పెరుగుతున్న గోల్డ్, సిల్వర్ రేట్లు..
భారత్‌లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు
రోజురోజుకూ పెరిగిపోతున్న గోల్డ్, సిల్వర్ ధరలు
జనవరిలో ఇప్పటివరకూ 7శాతం మేర పెరిగిన పసిడి ధర