భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు: భారత్‌-పాక్‌ సరిహద్దులో మారణాయుధాలు లభ్యం


ABN
ప్రచురించిన తేదీ – జనవరి 19, 2026 | 04:16 AM

పంజాబ్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్‌ పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి.

భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు: భారత్‌-పాక్‌ సరిహద్దులో మారణాయుధాలు లభ్యం

పఠాన్‌కోట్, జనవరి 18: పంజాబ్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్‌ పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. భారత్‌-పాక్‌ సరిహద్దుకు సమీపంలోని నరోత్‌ జైమల్‌ సింగ్‌ ప్రాంతంలో పఠాన్‌కోట్‌ పోలీసులు, కేంద్ర నిఘా సంస్థలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో మారణాయుధాలు, మందుగుండు సామగ్రి లభించాయి. ఈ తనిఖీల్లో భాగంగా మూడు ఏకే-47 రైఫిళ్లు, ఐదు మ్యాగజీన్‌లు, టర్కీ, చైనా దేశాలలో తయారైన రెండు పిస్టళ్లు, వాటికి సంబంధించిన రెండు మ్యాగజీన్‌లు, 98 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నవీకరించబడిన తేదీ – జనవరి 19, 2026 | 04:19 AM



Source link

Spread the love