సి.పి.ఐ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి.రాజా 2025 జనవరి 26న ది హిందూ పత్రికలో వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని సమీక్షిస్తూ వ్యాసంలో భారతదేశంలో కులాన్ని క్లూప్తంగా ఇలా నిర్వచించారు: ”CPI వర్గ రహిత మరియు కుల రహిత భారతదేశం యొక్క దృక్పథాన్ని వ్యక్తీకరించింది, కులాన్ని సాంస్కృతిక అవశేషాలుగా కాకుండా లోతైన వర్గ వ్యవస్ధగా గుర్తించింది.
కులం గురించి కామ్రేడ్ డి.రాజా ఇచ్చిన పై నిర్వచనం వాస్తవికంగా ఉన్నది. కుల–వర్గ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. పార్టీల నిర్మాణాల్లో పనిచేస్తోన్న కమ్యూనిస్టులు, నిర్మాణాల వెలుపల ఉన్న కమ్యూనిస్ట్ ఆలోచనాపరులు అంతా తమ విధానాల్లోను, కార్యాచరణల్లోను, నిర్మాణాల్లోను డి.రాజా చెబుతున్నట్టే, ”కులాన్ని ఒక సాంస్కృతిక అవశేషంగా చూడటం గాక, వర్గ దోపిడీతో లోతుగా, జమిలిగా భారత దేశంలో పెనవేసుకుని, ఒక భౌతిక వ్యవస్థను నిరోధిస్తూ, భారతదేశంలో వర్గీకరణ రహిత, కులవృత్తుల లక్ష్యం” ఈ దృక్పథంలో ఇండియాలో గత వందేళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమం ఏ మేరకు పనిచేసిందో నేడు సమీక్షించాలి. మరింత వాస్తవిక దృక్పథంతో పనిచేయాలి. వర్గ–కుల దృక్పథంతో ఉద్యమాలతోపాటు, రాజకీయ పోరాటాలు కూడా చేయాలి.
– వై.కె.
ఈ వార్తలు కూడా చదవండి…
CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ
Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
తాజాగా చదవండి AP వార్తలు మరియు తెలుగు వార్తలు
నవీకరించబడిన తేదీ – జనవరి 20, 2026 | 12:28 AM