Telangana News Updates: అకౌంట్లలో డబ్బు జమ.. పేదలకు ప్రభుత్వం శుభవార్త |


తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అప్పుడప్పుడు డబ్బు విడుదల చేసి, అకౌంట్లలో జమ చేస్తోంది. తాజాగా రూ.262.51 కోట్లు రిలీజ్ చేసింది. ఈ డబ్బు రూ.23వేల మంది లబ్దిదారుల అకౌంట్లలో జమ చేసింది. ఆధార్ నంబర్ ఆధారంగా.. ఆయా అకౌంట్లలో వేసింది. అందువల్ల ఎవరికైనా మనీ రాకపోతే, అధికారులను అడగవచ్చు. ఐతే.. ఈ డబ్బును ప్రభుత్వం బేస్‌మెంట్ పూర్తి చేసిన వారు, గోడలు, స్లాబ్‌లు నిర్మించిన వారికి ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో 2.50లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. మార్చి నాటికి ఇవి పూర్తి కావచ్చు. ఆ తర్వాత ఇదే పథకం పార్ట్ 2 ప్రారంభమై.. పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగనుంది.

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీమ్స్… దావోస్ టూర్‌లో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్నాయి. నేడు కృష్ణా జిల్లాలో ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క నేడు ధర్మపురిలో పర్యటిస్తారు. నేడు మేడారం మహా జాతరకు అంకురార్పణ జరుగుతుంది. మేడారం, కన్నెపల్లి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో మండమెలిగే పండుగ జరుగుతుంది. తెలంగాణలో మున్సిపల్ పోల్స్‌కి నేడు షెడ్యూల్ రావచ్చు. ఇవాళ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ-ట్వంటీ ఉంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love