ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్.. (22/01/2026) | Andhra pradesh telangana national and international live telugu news updates of 22nd Jan 2026 Suri



  • Jan 22, 2026 19:24 IST

    దావోస్ నుంచి స్వదేశం బయల్దేరిన ఏపీ సీఎం చంద్రబాబు

    • శుక్రవారం ఉదయం 8.25 గంటలకి హైదరాబాద్ చేరుకోనున్న సీఎం చంద్రబాబు.

    • దావోస్‌లో 4 రోజులపాటు 36కి పైగా కార్యక్రమాలకు హాజరు.

    • ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ ప్రతినిధులతో భేటీలు.

    • 16 దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం.


  • Jan 22, 2026 19:17 IST

    హైదరాబాద్‌లో 270 మందికి జైలు శిక్ష

    drunk6.jpg

    • 2026 న్యూఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవర్‌లో పట్టుబడిన వారిలో 270 మందికి జైలు శిక్ష.

    • 2025 డిసెంబర్ 24 నుంచి 31 వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్.

    • 270 మందికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన నగరంలో పలు న్యాయస్థానాలు.


  • Jan 22, 2026 18:45 IST

    విశాఖ రైల్వే స్టేషన్‌ భద్రతలో కీలక అడుగు.

    • విశాఖ రైల్వే స్టేషన్ ఆర్‌పిఎఫ్‌లో రోబో కాప్ సేవలు.

    • రోబో సేవలను ప్రారంభించిన ఆర్‌పిఎఫ్ ఐజి ఆలోక్ బొహ్ర, వాల్తేరు డివిజన్ డిఆర్ఎమ్ లలిత్ బొహ్ర.

    • రోబో కాప్‌కు అర్జున్‌గా నామకరణం.

    • భారతీయ రైల్వేలో మొదటిసారిగా విశాఖ రైల్వే స్టేషన్‌లో రోబో కాఫ్ సేవలు.


  • Jan 22, 2026 18:36 IST

    తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

    new Amrit Bharat Express

    • చర్లపల్లి నుంచి తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.

    • తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడలో ఆగనున్న ఎక్స్‌ప్రెస్‌.

    • ఏపీలో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు నెల్లూరు, రేణిగుంటలో ఆగనున్న అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.

    పూర్తికథనం


  • Jan 22, 2026 18:34 IST

    దావోస్‌: తెలంగాణ సీఎం రేవంత్‌, ఏపీ మంత్రి లోకేష్‌ భేటీ

    • తెలుగు రాష్ట్రాల ప్రగతి ప్రణాళికలపై రేవంత్‌, లోకేష్‌ చర్చ.

    • విద్యా సంస్కరణలు, ఐటీ ప్రగతిపై స్నేహపూర్వక సంభాషణ.


  • Jan 22, 2026 18:25 IST

    హైదరాబాద్‌: ముగిసిన విజయసాయిరెడ్డి ఈడీ విచారణ.

    Vijay Sai Reddy ED inquiry

    పూర్తికథనం


  • Jan 22, 2026 18:03 IST

    క్రొయేషియాలో భారత ఎంబసీపై దాడి..

    • క్రొయేషియాలోని భారత ఎంబసీలోకి ఖలిస్థాన్ వేర్పాటువాదుల చొరబాటు.

    • ఎంబసీలో విధ్వంసం సృ‌ష్టించిన ఖలిస్థానీ వేర్పాటువాదులు.

    • తీవ్రంగా స్పందించిన భారత్.

    • బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రకటన విడుదల.

    పూర్తికథనం


  • Jan 22, 2026 16:10 IST

    తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

    • బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సిట్‌ నోటీసులు.

    • శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయంలో విచారణకు రావాలని కేటీఆర్‌కు సిట్‌ నోటీసులు.

    • కేటీఆర్‌కు 160 CrPC కింద సిట్‌ నోటీసులు.

    • నందినగర్‌లోని కేటీఆర్‌ నివాసంలో నోటీసులు అందజేత.

    • 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌పై ప్రశ్నించనున్న సిట్‌.

      పూర్తికథనం


  • Jan 22, 2026 16:03 IST

    నైని కోల్‌ బ్లాక్‌ టెండర్లపై కేంద్రం విచారణ

    • కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలతో సింగరేణిలో పర్యటించనున్న ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం.

    • సింగరేణి అధికారులతో కలిసి దర్యాప్తు చేయనున్న బృందం.

    • బృందం సభ్యులుగా బొగ్గుశాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతనా శుక్లా, బొగ్గు శాఖ టెక్నికల్ డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు.


  • Jan 22, 2026 16:02 IST

    వరుస నష్టాల నుంచి లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు.

    • లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.

    • 398 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్.

    • 132 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ.

      పూర్తికథనం


  • Jan 22, 2026 15:29 IST

    ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం

    • న్యూ సౌత్‌వేల్స్‌లో కాల్పులకు తెగబడిన ఓ దుండగుడు.

    • ఘటనలో ముగ్గురు మృతి.

    • మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు. పూర్తికథనం


  • Jan 22, 2026 15:27 IST

    మధ్యప్రదేశ్‌ భోజ్‌శాల ఆలయ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు

    • వసంత పంచమి వేళ హిందూ, ముస్లిం ప్రార్థనలకు అనుమతి.

    • మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 వరకు నమాజ్‌కు అనుమతి.

    • సుప్రీంకోర్టు తీర్పుపై హిందూ సంఘాల హర్షం. పూర్తికథనం


  • Jan 22, 2026 15:15 IST

    జమ్మూకశ్మీర్‌: దోడా సెక్టార్‌లో రోడ్డుప్రమాదం

    • 200 అడుగుల లోయలో పడిన ఆర్మీ వాహనం.

    • 10 మంది జవాన్లు మృతి, పలువురికి గాయాలు.

    • ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయకచర్యలు. పూర్తికథనం


  • Jan 22, 2026 15:03 IST

    చరిత్ర సృష్టించిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు

    • కెరీర్‌లో 500 మ్యాచ్‌ విజయాలు సొంతం చేసుకున్న పీవీ సింధు.

    • ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డు.

    • ప్రపంచంలో ఆరో మహిళా షట్లర్‌గా పీవీ సింధు ఘనత. పూర్తికథనం


  • Jan 22, 2026 14:52 IST

    పోలీసుల అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.

    • పోలీసులకు మీడియా బ్రీఫింగ్ విధానాలు రూపొందించాలన్న సుప్రీంకోర్టు.

    • 3 నెలల్లో విధానాలు రూపొందించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశం. పూర్తికథనం


  • Jan 22, 2026 14:49 IST

    దావోస్: సీఎం రేవంత్‌రెడ్డితో WEF ఎండీ జెరెమీ జర్గెన్స్‌ భేటీ.

    • హైదరాబాద్‌లో WEF ఫాలో-అప్ సదస్సు ప్రతిపాదన.

    • ప్రతి ఏడాది జులైలో ఫాలో-అప్ ఫోరం నిర్వహణపై చర్చ.

    • తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ను వివరించిన సీఎం రేవంత్‌రెడ్డి. పూర్తికథనం


  • Jan 22, 2026 13:55 IST

    ప్రధాని విజన్ అదే: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

    • దేశాన్ని స్పోర్ట్స్ పవర్‌ హౌస్‌గా మార్చాలనేదే ప్రధాని విజన్: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

    • ఆటలు కేవలం మెడల్స్ కోసం మాత్రమే కాదు: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

    • దేశ ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చూపేందుకు స్పోర్ట్స్ శక్తిమంతమైన మార్గం: జిష్ణుదేవ్ వర్మ

    • హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్

      పూర్తి కథనం


  • Jan 22, 2026 13:47 IST

    క్రెడిట్ చోరీ చేస్తున్నారు: మాజీ సీఎం జగన్

    • భూముల రీసర్వేపై చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు: మాజీ సీఎం జగన్

    • రీసర్వేపై చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారు: జగన్

    • భూముల రీసర్వే ఆలోచన గతంలో చంద్రబాబుకు వచ్చిందా?: జగన్

    • 2019కి ముందు భూములు రీసర్వే చేసే టెక్నాలజీ సరిగా లేదు: జగన్

    • రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమే రీసర్వే: జగన్

    • 2019 మేనిఫెస్టోలోనే భూములు రీసర్వే చేస్తామని చెప్పాం: జగన్

    • 2020 డిసెంబర్ 21న భూసర్వే ప్రారంభించాం: జగన్

      పూర్తి కథనం


  • Jan 22, 2026 13:42 IST

    కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం

    • జీ రామ్‌ జీ పథకం ప్రసంగంపై వివాదం

    • సభలో ప్రసంగించకుండానే వెళ్లిపోయిన గవర్నర్

    • ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ కాపీ.. జీ రామ్‌ జీ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని అభ్యంతరం

    • గవర్నర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నినాదాలు

      పూర్తి కథనం


  • Jan 22, 2026 13:40 IST

    ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం..

    • ఏలూరు జిల్లా: బుట్టాయగూడెం మండలంలో కలకలం రేపుతున్న పెద్దపులి

    • పెద్దపులి సంచరిస్తున్నట్లు ధ్రువీకరించిన అటవీ శాఖ అధికారులు

    • తెలంగాణ రాష్ట్రం కావడిగుండ్ల ప్రాంతం నుంచి ఏలూరు జిల్లాలోకి వచ్చిన పులి

    • పందిరి మామిడిగూడెం ప్రాంతంలో పాదముద్రలు గుర్తించిన అటవీ అధికారులు

    • వచ్చిన మార్గంలోనే తిరిగి వెనక్కి వెళ్లినట్లు పాదముద్రల ద్వారా గుర్తింపు

      పూర్తి కథనం


  • Jan 22, 2026 13:06 IST

    హైదరాబాద్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

    • ఐదేళ్ల బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వీధి కుక్క

    • ఇంటి ముందు ఉన్న బాలుడిపైకి ఒక్కసారిగా దూకిన శునకం

    • ముఖాన్ని గట్టిగా కొరికి తీవ్రంగా గాయపరిచిన వీధి కుక్క

    • స్థానికులు తరమడంతో అక్కడ్నుంచి పరారైన గ్రామ సింహం

    • చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న బాధిత కుటుంబం

      పూర్తి కథనం


  • Jan 22, 2026 13:02 IST

    భారీ ఎన్‌కౌంటర్

    • జార్ఖండ్: సింగ్‌భూమ్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్

    • భద్రతా బలగాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి

    • కిరిభూమ్ పీఎస్ పరిధిలో సెర్చ్ ఆపరేషన్

      పూర్తి కథనం


  • Jan 22, 2026 12:38 IST

    తగ్గిన గోల్డ్ ధర..

    • నేడు తగ్గుముఖం పట్టిన బంగారం ధర

    • 24 క్యారెట్ల గ్రాము పసిడిపై రూ.229 తగ్గింపు

    • ప్రస్తుతం 24 క్యారెట్ల గ్రాము గోల్డ్ ధర రూ.15,431

    • 22 క్యారెట్ల గ్రాము పుత్తడిపై రూ.210 తగ్గింపు

    • రూ.14,145 వద్ద ట్రేడ్ అవుతున్న 22 క్యారెట్ల గ్రాము బంగారం

      పూర్తి కథనం


  • Jan 22, 2026 12:27 IST

    ఏపీ లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తోన్న ఈడీ

    • విజయసాయిరెడ్డి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్న ఈడీ అధికారులు

    • విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటుపై ఆరా

    • లిక్కర్ పాలసీ రూపకల్పనపై మూడు సార్లు తన సమక్షంలోనే..

    • సమావేశాలు జరిగినట్టు స్టేట్‌మెంట్ ఇచ్చిన విజయసాయిరెడ్డి

    • కానీ పాలసీతో తనకు సంబంధం లేదని తెలిపిన విజయసాయి

    • విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా

      పూర్తి కథనం


  • Jan 22, 2026 12:23 IST

    ఏపీ అభివృద్ధికి సీఎం కృషి ప్రశంసనీయం: మంత్రి

    • ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు: మంత్రి ఆనం

    • అందుకు దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు: మంత్రి ఆనం

    • దావోస్ పర్యటన ముగించుకుని ఏపీకి శుక్రవారం రోజు సీఎం వస్తారు: మంత్రి ఆనం

    • ఏపీలో అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయి: మంత్రి ఆనం

    • తిరుమల స్వామివారిని దర్శించుకున్న సందర్భంగా మంత్రి వ్యాఖ్యలు

      పూర్తి కథనం


  • Jan 22, 2026 12:07 IST

    యూట్యూబర్ అరెస్ట్

    • హైదరాబాద్: సినీ నటి కరాటే కళ్యాణిపై దాడి కేసులో యూట్యూబర్ అరెస్ట్

    • దాడి ఘటనలో యూట్యూబర్ సిద్ధమౌని నరేందర్‌ అరెస్టు

    • ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు

    • టీటీడీ పేరు దుర్వినియోగం చేస్తూ లక్కీ డ్రా నిర్వహిస్తున్నాడని ఆరోపణ

    • లక్కీ డ్రా మోసాన్ని అడ్డుకోబోయిన తనపై దాడి చేశాడంటూ ఫిర్యాదు

    • కరాటే కళ్యాణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అరెస్టు చేసిన పోలీసులు

      పూర్తి కథనం


  • Jan 22, 2026 11:06 IST

    కొత్త అజెండా అమలుకు ఈయూ సిద్ధమన్న కాజా కల్లాస్

    • భారత్‌తో కొత్త అజెండా అమలుకు ఈయూ సిద్ధం: ఈయూ విదేశాంగ విధానం, భద్రతా విధానాల హై రిప్రెజెంటేటివ్ కాజా కల్లాస్

    • భారత్-యూరప్ ఆర్థిక స్థిరత్వానికి ఇది అత్యంత ఆవశ్యకం: యూరోపియన్ పార్లమెంట్‌లో కాజా కల్లాస్

    • భారత్‌తో కొత్త సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్‌నర్‌షిప్‌పై ఈయూ అంగీకరించింది: కాజా కల్లాస్

    • ఈ ఒప్పందం సముద్ర భద్రత, కౌంటర్ టెర్రరిజం, సైబర్ డిఫెన్స్ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తుంది: కాజా కల్లాస్

    • ఈ ఒప్పందంపై వచ్చే వారం న్యూఢిల్లీలో జరిగే 16వ EU-ఇండియా సమ్మిట్‌లో సంతకం చేస్తాం: కాజా కల్లాస్

      పూర్తి కథనం


  • Jan 22, 2026 10:54 IST

    వెనక్కి తగ్గిన ట్రంప్

    • యూరోపియన్ యూనియన్ దేశాలపై సుంకం విధించడంపై వెనక్కి తగ్గిన ట్రంప్

    • గ్రీన్‌లాండ్ అప్పగించే విషయంలో అడ్డుపడుతున్నాయని పలు దేశాలపై సీరియస్ అయిన ట్రంప్

    • ఆయా దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించిన ట్రంప్

    • జూన్ 1 నుంచి 25 శాతానికి పెంచాలని అమెరికా భావిస్తోందన్న ట్రంప్

    • తాజాగా ఈ సుంకాలపై యూటర్న్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్

    • నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఫ్రాన్స్, యూకే, నెదర్లాండ్స్, జర్మనీ, ఫిన్ లాండ్ దేశాలపై..

    • సుంకాలు విధించమని తాజాగా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

      పూర్తి కథనం


  • Jan 22, 2026 10:38 IST

    నేడు ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి

    • ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందుకు నేడు రానున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

    • ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సాయిరెడ్డిని ప్రశ్నించనున్న ఈడీ అధికారులు

    • విచారణ సందర్భంగా విజయసాయిరెడ్డి వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్న అధికారులు

    • మద్యం పాలసీ రూపకల్పన, కోట్లాది రూపాయల అవినీతి వంటి అంశాలపై ప్రశ్నించనున్న ఈడీ

      పూర్తి కథనం


  • Jan 22, 2026 09:26 IST

    గుంటూరు: దుగ్గిరాల మండలం చిలువూరులో దారుణం

    • వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని హతమార్చిన భార్య

    • ప్రియుడితో కలిసి భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి పథకం ప్రకారం హత్య

    • భర్త హత్య తర్వాత నీలి చిత్రాలు చూస్తూ రాత్రంతా గడిపిన భార్య

    • గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైన మహిళ

    • కేసు నమోదు చేసిన సదరు మహిళను అరెస్టు చేసిన పోలీసులు

    • పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు

      పూర్తి కథనం


  • Jan 22, 2026 08:56 IST

    వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

    • గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,56,610

    • రూ.1,43,560కి చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు

    • రూ.3,45,100 వద్ద కొనసాగుతున్న కిలో వెండి

    • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,56,661

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,560

      పూర్తి కథనం


  • Jan 22, 2026 08:21 IST

    కేరళ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో మహిళ అరెస్ట్

    • బస్సులో ఓ వ్యక్తి తనను అసభ్యకరంగా తాకాడంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టిన మహిళ

    • ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరువుపోయినట్లు బాధపడిన దీపక్ అనే వ్యక్తి

    • దీంతో ఆత్మహత్యకు పాల్పడిన దీపక్.. నెట్టింట మహిళపై తీవ్ర విమర్శలు

    • సదరు మహిళను 35 ఏళ్ల షిమ్జితా ముస్తఫాగా గుర్తించి కేసు నమోదు చేసిన పోలీసులు

    • దీపక్ ఆత్మహత్యకు ఆమే కారణమంటూ ఫిర్యాదు రావడంతో అరెస్టు

    • దర్యాప్తునకు ఆదేశించిన కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

    • పూర్తి కథనం


  • Jan 22, 2026 08:18 IST

    దావోస్‌ వేదికగా ఏపీకి ప్రత్యేక గుర్తింపు

    • రాష్ట్రం గురించి ప్రపంచ పారిశ్రామిక రంగం చర్చ

    • మాది పరిశ్రమల స్నేహపూర్వక ప్రభుత్వం

    • ‘ఈజ్‌ ఆఫ్‌’ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌

    • పెట్టుబడులతో వచ్చినవారికి తక్షణమే అనుమతులు

      పూర్తి కథనం


  • Jan 22, 2026 07:47 IST

    దావోస్‌లో రెండో రోజు సీఎం రేవంత్ బృందం బిజీబిజీ

    • రూ.2,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు రష్మి గ్రూప్‌ ఎంవోయూ

    • 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు

    • రూ.6 వేల కోట్లతో రాష్ట్రంలో ‘స్లోవేకియా’ రియాక్టర్‌ ప్లాంట్‌

    • రూ.1,000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ సర్గాడ్‌ ఎంవోయూ

    • దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

      పూర్తి కథనం


  • Jan 22, 2026 07:19 IST

    నంద్యాల: శిరివెళ్లమెట్ట దగ్గర రోడ్డుప్రమాదం

    • ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

    • ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ భాస్కర్‌, లారీ క్లీనర్‌, డ్రైవర్ సజీవదహనం

    • టైరు పేలి అదుపుతప్పి లారీని ఢీకొన్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

    • లారీని ఢీకొట్టడంతో బస్సులో చెలరేగిన మంటలు

    • బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను రక్షించిన స్థానికులు

    • నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు

    • ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన AR BCVR బస్సు, లారీ

    • ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు

      పూర్తి కథనం





  • Source link

    Spread the love