తెలంగాణ
హాయ్-సాయి చైతన్య
Ration
supply:
తెలంగాణ
ప్రభుత్వం
కీలక
నిర్ణయం
తీసుకుంది.
రేషన్
సరఫరాలో
క్రమేణా
మార్పులు
తీసుకొస్తున్న
ప్రభుత్వం
మరో
అడుగు
వేసింది.
ఇప్పటికే
రాష్ట్ర
వ్యాప్తంగా
రేషన్
కార్డు
లబ్దిదారులకు
సన్న
బియ్యం
పైన
నిర్ణయం
తీసుకుంది.
కాగా..
బియ్యంతో
పాటుగా
మరో
అయిదు
నిత్యావసరాలను
అందించేందుకు
నిర్ణయించింది.
ఈ
మేరకు
రేషన్
పాలసీలో
కొత్త
మార్పుల
దిశగా
కసరత్తు
జరుగుతోంది.
త్వరలోనే
ఈ
నిర్ణయం
అమల్లోకి
రానుంది.
తెలంగాణ
ప్రభుత్వం
ధాన్యం
సేకరణలో
కొత్త
రికార్డును
నెలకొల్పింది.
ఇదే
సమయంలో
రేషన్
వ్యవస్థలోనూ
సంస్కరణలకు
శ్రీకారం
చుట్టింది.
ఇప్పటికే
సన్న
బియ్యం
పైన
నిర్ణయం
తీసుకున్న
తెలంగాణ
ప్రభుత్వం
ప్రజలకు
అవసరమైన
మరో
నాలుగు
సరుకులను
ఇవ్వాలని
డిసైడ్
అయింది.
త్వరలో
రేషన్‌లో
బియ్యంతోపాటూ..
పంచదార,
గోధుమలు
వంటి
మొత్తం
ఐదు
రకాల
నిత్యవసరాలను
ఇవ్వనున్నట్లు
మంత్రి
ఉత్తమ్
వెల్లడించారు.
బహిరంగ
మార్కెట్
లో
సరుకుల
ధరలు
ఎక్కువగా
ఉండటంతో..
రేషన్‌లో
గోధుమలు,
పంచదార,
జొన్నలు,
రాగులు
లేదా
చింతపండు,
కందిపప్పు
లాంటివి
ఇవ్వటం
ద్వారా
పేదలకు
ప్రయోజనకరంగా
ఉంటుందని
వివరించారు.
ఈ
మేరకు
ఈ
సారి
జరిగే
మంత్రివర్గ
భేటీలో
నిర్ణయం
తీసుకొని
అధికారికంగా
ఆమోద
ముద్ర
వేయనున్నారు.
వానాకాలం
సీజన్‌లో
70.82
లక్షల
మెట్రిక్
టన్నుల
ధాన్య
సేకరణతో
గత
25
ఏళ్లలో
ఎన్నడూ
లేని
రికార్డు
నమోదైందని
మంత్రి
వెల్లడించారు.

మొత్తం
ధాన్యం
ఉత్పత్తిలో
సగానికి
పైగా..
అంటే
38.37
లక్షల
మెట్రిక్
టన్నులు
సన్న
రకాలే
ఉన్నాయని
చెప్పారు.
సాంబ
మసూరి,
తెలంగాణ
మసూరి
వంటి
నాణ్యమైన
రకాల
సాగుకు
ప్రభుత్వం
మరింత
ప్రోత్సాహం
ఇస్తందని
వెల్లడించారు.
రైతులకు
మేలు
జాతి
విత్తనాలు
అందించి,
సన్న
పంట
సాగును
విస్తరించాలన్నదే
లక్ష్యమని
మంత్రి
తెలిపారు.
ధాన్యం
ఎక్కువైతే
నిల్వ
సవాల్
గా
మారిందని..
దీంతో,
గోదాముల
సామర్థ్యాన్ని
పెంచేందుకు
ఆధునిక
సాంకేతికతను
తీసుకొస్తున్నట్లు
మంత్రి
వెల్లడించారు.
ఈ
ఖరీఫ్‌లో
రాష్ట్రవ్యాప్తంగా
14.21
లక్షల
మంది
రైతుల
నుంచి
ధాన్యం
కొనుగోలు
చేసి.
వారి
ఖాతాల్లో
నేరుగా
రూ.17,018
కోట్లను
జమ
చేసినట్టు
తెలిపారు.
సన్న
బియ్యం
పండించిన
రైతులకు
అదనంగా
క్వింటాకు
రూ.500
చొప్పున
ఇప్పటివరకు
రూ.1,425
కోట్ల
బోనస్
అందించామని
మంత్రి
వెల్లడించారు.