Jan 24, 2026 07:58 IST
దుమ్మురేపుతున్న బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ మార్కెట్లో రూ.1,59,720కి చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం
రూ.1,46,410కి చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర
విజయవాడ, వైజాగ్‌లోనూ దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్న ధరలు
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం అత్యల్పంగా రూ.1,54,320
ప్రస్తుతం రూ.3.60లక్షలకు చేరిన కిలో వెండి
Jan 24, 2026 07:39 IST
రోడ్డుప్రమాదం.. స్పాట్లోనే..
ప్రకాశం జిల్లా: కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం
తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరి మృతి
మరో 12మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
Jan 24, 2026 07:32 IST
అమెరికాను వణికిస్తున్న ‘ఫెర్న్’ మంచు
టెక్సాస్, ఓక్లహోమా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
అమెరికాలో 800కు పైగా విమానాలు ఆలస్యం, రద్దు
మంచుతుఫాన్‌తో జార్జియా, మిసిసిపీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటన
మరో 3 రోజులు మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిక
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచన
Jan 24, 2026 07:32 IST
అమెరికా మధ్యవర్తిత్వంలో అబుదాబిలో శాంతి చర్చలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో చర్చలు
చర్చలు ప్రారంభానికి ముందే షరతు విధించిన రష్యా
డాన్బాస్ నుంచి ఉక్రెయిన్ సేనలు వైదొలగాలని రష్యా షరతు
డాన్బాస్ ప్రాంతం కీలకమైన అంశమేనన్న ఉక్రెయిన్
రేపటి వరకు కొనసాగనున్న రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు
Jan 24, 2026 07:32 IST
ఢిల్లీ: నేడు 18వ రోజ్‌గార్ మేళా
ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా..
18వ రోజ్‌గార్ మేళాలో పాల్గొననున్న ప్రధాని మోదీ
61 వేల మందికి నియామకపత్రాలు అందజేయనున్న మోదీ
దేశావ్యాప్తంగా 45 చోట్ల 18వ రోజ్‌గార్ మేళా