
కరీంనగర్ సాంస్కృతికం: రాష్ట్ర రవాణా శాఖ తరఫున సమ్మక్క- సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రథసప్తమి సందర్భంగా ఆదివారం కరీంనగర్లో జరిగిన బ్రహ్మోత్సవాల్లో మంత్రి పాల్గొని శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్న మంత్రి.. మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28 నుంచి 31 వరకు సమ్మక్క- సారలమ్మ జాతర ఉత్సవాలకు ఉత్తర తెలంగాణ జిల్లాలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లోని 51 కేంద్రాల నుంచి బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 4 వేల ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయన్నారు. ఆర్టీసీ బస్సులు సురక్షితం, భద్రత దృష్ట్యా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని భక్తులను కోరారు. ఆర్టీసీ బస్సులు గద్దెల వరకు వెళ్లే అవకాశం ఉందన్నారు.