మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం భారత రాజకీయ యవనికపై జరిగిన మరో విషాదకర విమాన ప్రమాదంగా మిగిలిపోయింది. దేశ చరిత్రలో ఎందరో దిగ్గజ నాయకులు, ప్రముఖులు ఇలాంటి హెలికాప్టర్, విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి మొదలుకుని.. అజిత్ పవార్ వరకు విమాన ప్రమాదాల్లో బలైన ప్రముఖుల వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (1945)
భారతదేశానికి బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్య్రం రాక ముందే తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు చెప్పారు. ఇది భారత రాజకీయాల్లో మొదటి పెద్ద విమాన ప్రమాదంగా మారింది.
హోమీ జహంగీర్ బాభా (1966)
భారత అణు పితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానం ఆల్ప్స్ పర్వతాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో ఆయన చనిపోయారు.
ఇంకా చదవండి: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. రెండుసార్లు సిగ్నల్స్ కట్.. ఎత్తు, వేగం తగ్గిపోయి..!
సంజయ్ గాంధీ (1980)
ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ స్వయంగా విమానం నడుపుతూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో కూలి మరణించారు.
మాధవరావు సింధియా (2001)
కేంద్ర మాజీ మంత్రి.. కాంగ్రెస్ పార్టీ దిగ్గజం అయిన మాధవరావు సింధియా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరి కేంద్రమంత్రి అయ్యారు.
ఇంకా చదవండి: ప్రమోద్ మహాజన్ నుంచి అజిత్ పవార్ దాకా.. మహారాష్ట్ర రాజకీయ మలుపులను తిప్పిన మరణం
జీసీ బాలయోగి (2002)
లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న బాలయోగి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి (2009)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. చిత్తూరు జిల్లా నల్లమల అడవుల్లో వాతావరణం అనుకూలంగా హెలికాప్టర్ కూలి మరణించడం యావత్ దేశాన్నే తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
డార్జీ ఖండూ (2011)
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డార్జీ ఖండూ సీఎంగా ఉన్న సమయంలోనే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలి దుర్మరణం చెందారు.
ఇంకా చదవండి: అజిత్ పవార్ రాజకీయ వారసులు ఎవరు.. ఎన్సీపీ పగ్గాలు చేపట్టే రేసులో ఉన్నది వీళ్లే!
జనరల్ బిపిన్ రావత్ (2021)
దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ రావత్ తమిళనాడులోని కూనూరు వద్ద హెలికాప్టర్ కూలి దుర్మరణం చెందారు.
విజయ్ రూపానీ (2025)
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. గత ఏడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం కూలిన ఘటనలో మరణించారు.