సుంకాలూ ఇతరేతర అడ్డుగోడలను బద్దలుకొట్టే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టీఏలు)- అంతర్జాతీయ వర్తకాభివృద్ధికి, భాగస్వామ్య దేశాలు ఆర్థిక ప్రగతికి దోహదపడతాయి. వ్యాపారాలకు అవి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ప్రజలకు వస్తుసేవలను సరసమైన ధరల్లో మరింత విస్తృతంగా అందుబాటులోకి తెస్తాయి. ఈ నెల పదమూడో తేదీ నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సభ్యదేశాల నడుమ అలాంటి ఒప్పందాలు 380 వరకు అమలులో ఉన్నాయి. దేశీయ గిరాకీపైనే ఎక్కువగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థకు కొత్త జవసత్వాలను గత కొన్నేళ్లుగా ఇండియా సైతం ఎఫ్‌టీఏలపై ఎక్కువగా దృష్టిసారిస్తోంది. 2024లో భారత జీడీపీలో 21 శాతం వాటా కలిగిన ఎగుమతులు ఎంతగా పెరిగితే స్థానికంగా ఉపాధికల్పన అంతగా జోరందుకుంది. ఆ ఉద్దేశంతో 2021లో మారిషస్‌తో సమగ్ర ఆర్థిక సహకార భాగస్వామ్య ఒప్పందాన్ని పట్టాలకెక్కించింది యూఏఈ, ఆస్ట్రేలియా, యూకే, యూరోపియన్ ఫ్రీట్రెడ్ అసోసియేషన్, ఒమన్, న్యూజిలాండ్‌లతో ఇండియా కీలక ఒడంబడికలను కుదుర్చుకుంది. తాజాగా 27దేశాల యూరోపియన్ యూనియన్‌తో ముడిపడిన చరిత్రాత్మక ఎఫ్‌టీఏ- భారతీయ ఎమతిదారులకు అతిపెద్ద విపణిని చేరువ కానుంది!
పెరుగుతున్న వయోధిక జనాభా కారణంగా దేశీయ గిరాకీలో వృద్ధి బలహీనం కావడం లేదు, అస్థిర ఏకపక్ష విధానాలతో ఆందోళన పెరుగుతోంది, చైనా మార్కెట్లను నమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో ఈయూ నేడు భారతదేశానికి విశ్వసనీయ వాణిజ్య భాగస్వామిగా భావిస్తున్నారు. ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం, 2011లో 1.82 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత జీడీపీ ఇప్పుడు 4.5 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థికవ్యవస్థ అయిన ఇండియాతో వాణిజ్యం సురక్షితమని ఈయూ తలపోస్తోంది. స్వీయ ప్రయోజనాల కోసం వెంపర్లాటలో పడి మిత్రపక్షాలపైనా సుంకాల కత్తి దూస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఉత్పత్తి- ప్రపంచీకరణ విఫలమైందంటూ ప్రచారం చేస్తోంది. ట్రంప్ సారథ్యంలో అంతర్జాతీయ నియమాలను కాలరాస్తున్న అగ్రరాజ్యం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థంకాని నేపథ్యంలో ఎగుమతి దిగుమతి మార్కెట్లను వైవిధ్యపరచడం ఇండియా, ఈయూలకు ఉభయతారకమవుతుంది. అనిశ్చిత భౌగోళిక రాజకీయాల్లో సరఫరా గొలుసులను సుస్థిరం చేసుకుని వ్యూహాత్మక ఆర్థిక స్వయంప్రతిపత్తిని నిలబెట్టుకోవడానికి అది అక్కరకొస్తుంది!
అభివృద్ధికి సహాయ సహకారాల అందజేతతో మొదలైన వాణిజ్య రంగంలో సరికొత్త చివుళ్లు తొడుక్కున్న ఐరోపా, ఇండియా సంబంధాలు- ఉమ్మడి ప్రజాస్వామ్య విలువల పునాదులపై కాలక్రమంలో బలోపేతమయ్యాయి. ఇరుపక్షాల వాస్తవిక అవసరాల ప్రాతిపదికపై ఎఫ్టీఏతో ఇప్పుడే ఇంకా పటిష్ఠమైంది. లక్షలాది మందికి ఉపాధి కల్పించే భారతీయ దుస్తులు, తోలు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు, ఇంజినీరింగ్ పరిశ్రమలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో లాభపడనుండటం శుభసూచికం. రెండు లక్షల కోట్ల విలువైన ఈయూ పారిశ్రామిక విపణిలోకి సుంకాల్లేకుండా ప్రవేశించగలగడం- దేశీయ యంత్ర సామగ్రి ఎగుమతుల విలువను 2030 నాటికి 30వేల కోట్లకు చేర్చాలన్న ఇండియా లక్ష్యాన్ని సాకారంలో తోడ్పడుతుంది. ఇప్పటికిప్పుడు రూ.6.9 లక్షల కోట్ల మేర ఎగుమతులకు లబ్ధి చేకూర్చే ఎఫ్టీఏతో మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే- ముఖ్యంగా దీర్ఘ ఎంఎస్ఎంఈల సామర్థ్య పెంపుపై దృష్టిసారించాలి. పర్యావరణ హితకర సాధనాల్లో నాణ్యమైన వస్తువుల తయారీకి పెద్దపీట వేయాలి!