
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌పై బురద చల్లాలని ప్రయత్నించడం.. సూర్యునిపై ఉమ్మి వేయడంలాంటిదేనని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. ప్రజావ్యతిరేకత, సింగరేణి కుంభకోణం నుంచి దృష్టిని మళ్లించేందుకు ఈ నోటీసులు ఇచ్చారని విమర్శించారు. రాజకీయ వేధింపులతో మున్సిపాలిటీ ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ సమాజమంతా.. కేసీఆర్ వెంటే ఉందని, రేవంత్‌రెడ్డి రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.